S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

04/29/2017 - 21:48

టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో విజయాల విషయానికి వస్తే, పాక్‌పై భారత్ పైచేయి సాధించింది. రావల్పిండిలో జరిగిన టెస్టును ఇన్నింగ్స్ 131 పరుగుల తేడాతో గెల్చుకుంది. ఫిరోజ్ షా కోట్లాలో ఇన్నింగ్స్ 70, ముల్తాన్ క్రికెట్ మైదానంలో ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయాలను నమోదు చేసింది. మొత్తం మీద టీమిండియా మూడు సార్లు పాక్‌పై ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.

04/29/2017 - 21:46

* ఇరు జట్ల మధ్య జరిగిన వనే్డల్లో 2,000లకుపైగా పరుగులు చేసిన జాబితాలో ఇద్దరు భారతీయులుకాగా, మరో ఇద్దరు పాకిస్తానీలు. సచిన్ తెండూల్కర్ 66 ఇన్నింగ్స్‌లో 2,474 పరుగులు సాధించి, ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇంజమాముల్ హక్ 64 ఇన్నింగ్స్‌లో 2,403 పరుగులతో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. రాహుల్ ద్రవిడ్ 55 ఇన్నింగ్స్‌లో 2,008, సరుూద్ అన్వర్ 48 ఇన్నింగ్స్‌లో 2,002 చొప్పున పరుగులు చేశారు.

04/29/2017 - 21:44

భారత్‌పై ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సరుూద్ అన్వర్ పేరిట ఉంది. 1997 మే 21న చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అతను 194 పరుగులు చేశాడు. ఈ జాబితాలో రెండు, మూడు స్థానాలు భారత్‌కు దక్కాయి. 2012 మార్చి 18న ఢాకాలోని షేర్ ఎ బంగ్లా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 183 పరుగులు చేశాడు.

04/23/2017 - 04:20

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇతనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయ. అందుకు తగినట్టుగానే అతను ఫామ్‌లోకి వచ్చాడు

04/23/2017 - 04:15

ఫీల్డ్ అంపైర్లు సరైన నిర్ణయం తీసుకోలేదని అనుమానిస్తే, దానిపై అప్పీల్ చేసే ‘అంపైర్ డెసిషన్ రివ్యూ సిస్టం’ (డిఆర్‌ఎస్) అంటే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పెద్దలకు చిన్నచూపే. చాలాకాలం డిఆర్‌ఎస్‌ను అమలు చేసేందుకు నిరాకరిస్తూ వచ్చిన బిసిసిఐ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో మొదటిసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

04/23/2017 - 04:11

గుజరాత్ లయన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఒక సంఘటన అందరినీ ఆకట్టుకుంది. గుజరాత్ పేసర్ బాసిల్ తంపి ఒక డెలివరీ వేసినప్పుడు, అతని షూ కాలి నుంచి ఊడిపోయి దూరంగా పడింది. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన పరుగును మధ్యలో ఆపి, బూటును బాసిల్‌కు అందించి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ఐపిఎల్‌లో హోరాహోరీ యుద్ధాలేకాదు..

04/23/2017 - 04:09

ఐపిఎల్‌లో అంపైర్లకు క్రికెట్ నిబంధనలు పట్టవా? క్రికెట్ వౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారా? ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న సంఘటన ఐపిఎల్‌లో అంపైర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఒక ఓవర్ చివరి బంతిలో సింగిల్ లేదా మూడు పరుగులు సాధిస్తే తప్ప, మిగతా సందర్భాల్లో ఆ బంతిని ఆడిన బ్యాట్స్‌మన్‌కు తర్వాతి ఓవర్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే అవకాశం దక్కదు.

04/22/2017 - 23:57

ఐపిఎల్‌లో ఆటగాళ్లు.. అభిమానులేకాదు.. కామెంటేటర్లు కూడా టెన్షన్ అనుభవిస్తారు. మ్యాచ్‌లో నెలకొన్న ఉత్కంఠను తమ కామెంటరీ ద్వారా కళ్ల ముందు ఆవిష్కరించడానికి వారు చేయని ప్రయత్నం ఉండదు. అయితే, ఒక్కోసారి కామెంటేటర్లు టెన్షన్ నుంచి బయటపడేందుకు సరదా మాటలు, విశే్లషణలు చేరుస్తుంటారు.

04/22/2017 - 23:53

* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. పదో ఐపిఎల్ ఆరంభానికి ముందు అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్)లో ఐదు మ్యాచ్‌లు ఆడి 109 పరుగులతో సరిపుచ్చాడు. ఆ తర్వాత పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో తొమ్మిది ఇన్నింగ్స్ ఆడాడు. 160 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం ఐపిఎల్‌కు వచ్చి, ఆరంభ మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు.

04/22/2017 - 23:49

* ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడుతున్న వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్‌కు పదో ఐపిఎల్ ఊరటనిచ్చింది. 2013 ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించినప్పుడు సంజూ పేరు క్రికెట్ వర్గాల్లో మారుమోగింది. 2015లో జింబాబ్వే టూర్‌కు వెళ్లిన టి-20 ఇంటర్నేషనల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ, అంతర్జాతీయ వేదికలపై విఫలమై, జట్టుకు దూరమయ్యాడు. తర్వాతి కాలంలో దాదాపు అంతా అతని గురించి మరచిపోయారు.

Pages