S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

04/08/2017 - 22:10

* ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ 14 పర్యాయాలు హ్యాట్రిక్స్ నమోదయ్యాయి.

04/08/2017 - 22:08

ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ, టి-20 సిరీస్‌ల్లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చక్కటి సలహాలు, సూచనలిచ్చి, టీమిండియా విజయాలకు బాటలు వేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ కెరీర్‌ను త్వరలోనే ముగిస్తాడా? స్వదేశంలో అతను తన చివరి మ్యాచ్‌ని ఆడేశాడా?

04/08/2017 - 22:05

* ఒక ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ డాట్ బాల్స్ ఆడిన బ్యాట్స్‌మన్ డ్వెయిన్ బ్రేవో. 2009లో సెంచూరియన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడిన అతను 59 బంతులు ఎదుర్కొని 70 పరుగులు చేశాడు. వీటిలో 30 డాట్ బాల్స్. మొత్తం మీద ఐపిఎల్ టోర్నీలో ఎక్కువ బంతులను రక్షణాత్మకంగా ఆడిన బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. అతను 131 ఓవర్లలో , 3151 బంతులు ఎదుర్కొన్నాడు.

04/02/2017 - 06:52

హోం సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు జోరు కొనసాగింది. ఈ సీజన్‌లో టీమిండియా స్వదేశంలో మొత్తం 13 టెస్టులు ఆడింది. పది విజయాలు సాధించింది. నాలుగు ట్రోఫీలను కైవసం చేసుకుంది. తొలుత న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించింది. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఆ సిరీస్‌లో తమ ఆధిపత్యాన్ని కనబరిచారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన భారత్ 3-0 తేడాతో న్యూజిలాండ్‌కు వైట్‌వాష్ వేసింది.

04/02/2017 - 03:42

* ఐపిఎల్ అంటేనే పరుగుల విందు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించేందుకు ప్రతి ఆటగాడు ప్రయత్నిస్తాడు. అయితే, జిడ్డు బ్యాటింగ్‌తో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిన బ్యాట్స్‌మెన్ కూడా లేకపోలేదు. అలాంటి వారిలో ప్రవీణ్ కుమార్ పేరును ముందుగా ప్రస్తావించాలి. అతను 113 ఐపిఎల్ ఇన్నింగ్స్‌లో 1,035 బంతులను డిఫెన్స్ ఆడాడు.

04/02/2017 - 03:41

* అఫ్గానిస్థాన్ యువ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అర్మాన్ ఐపిఎల్‌లో కొత్త చరిత్రకు తెరతీశాడు. వేలంలో నాలుగు కోట్ల ధరతో సంచలనం సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ భారీ మొత్తాన్ని చెల్లించి రషీద్‌ను తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీని కూడా సన్‌రైజర్స్ జట్టు కొనుగోలు చేసింది. అఫ్గాన్ నుంచి ఐపిఎల్‌లో చోటు దక్కించుకున్న క్రికెటర్లుగా వీరిద్దరూ చరిత్ర పుటల్లో చోటు సంపాదించారు.

04/02/2017 - 03:39

* వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోనీని అసాధారణ ప్రజ్ఞావంతుడిగా పేర్కొంటారు. కానీ, ఐపిఎల్‌లో ధోనీ కంటే దినేష్ కార్తీక్ ఎక్కువ మందిని అవుట్ చేశాడు. అతని డిస్మిసల్స్ 98కాగా, వాటిలో 72 క్యాచ్‌లు, 26 స్టంపింగ్స్ ఉన్నాయి. రెండో స్థానంలో నిలిచిన ధోనీ ఖాతాలో 89 డిస్మిసల్స్ ఉన్నాయి. వీటిలో 62 క్యాచ్‌లుకాగా, 27 స్టంపింగ్స్. రాబిన్ ఉతప్ప 75 డిస్మిసల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

04/02/2017 - 03:38

న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన టెస్టు సిరీస్‌లపై కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన ముద్ర వేస్తే, ఆ రెండు జట్లతోపాటు ఆస్ట్రేలియాపైనా పంజా విసిరిన సూపర్ స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్‌సన్‌ను అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో 200 వికెట్ల మైలుయిని చేరాడు. ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ముగిసే సమయానికి అతని ఖాతాలో 275 వికెట్లు ఉన్నాయి.

04/02/2017 - 03:35

ప్రస్తుత భారత పేసర్లలో మహమ్మద్ షమీని అందరి కంటే సమర్థుడిగా పేర్కోవాలి. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై కూడా బంతిని స్వింగ్ చేయించగల సమర్థుడు అతను. వికెట్లకు ఇరువైపులా, గాల్లో నాట్యమాడుతున్న రీతిలో దూసుకొచ్చే షమీ బంతులను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడని బ్యాట్స్‌మన్ ఉండడు. కానీ, ఫిట్నెస్ సమస్య తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో షమీకి అనుకున్న స్థాయిలో పేరుప్రఖ్యాతులు రాలేదు.

04/02/2017 - 03:34

పచ్చగడ్డివేస్తే భగ్గున మండే ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య క్రీడా వారధి ఏర్పడనుందా? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవుననే అనిపిస్తున్నది. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఎఫ్‌సి) ఆధ్వర్యంలో ఆసియా కప్ మహిళా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఉత్తర కొరియాలో జరగనున్నాయి. సోమవారం నుంచి టోర్నీ ఆరంభం కానుండగా, షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉత్తర, దక్షిణ కొరియాలు తలపడాల్సి ఉంది.

Pages