S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

03/04/2017 - 23:47

* ఒక గేమ్‌లో అద్భుతంగా రాణించిన ఆటగాడిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరిస్తుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంత వరకూ ఎక్కువ పర్యాయాలు ఈ అవార్డును స్వీకరించిన ఆటగాడు జాక్వెస్ కాలిస్. ఆల్‌రౌండర్‌గా దక్షిణాఫ్రికాకు విశేష సేవలు అందించిన అతను 23 టెస్టుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సాధించాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 19 పర్యాయాలు ఈ అవార్డును తీసుకొని, రెండో స్థానంలో ఉన్నాడు.

03/04/2017 - 23:44

* ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతులైన బ్యాట్స్‌మెన్ జాబితాలో సచిన్ తెండూల్కర్ అగ్ర భాగాన నిలుస్తాడు. అతను నెలకొల్పిన రికార్డులకు అంతేలేదు. వంద అంతర్జాతీయ సెంచరీలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధీరుడు అతను. టెస్టుల్లో 51 శతకాలు సాధించిన సచిన్ ఖాతాలో 49 వనే్డ సెంచరీలున్నాయి. అయితే, 90 పరుగుల స్కోరుదాటిన తర్వాత తడబడి వికెట్ పారేసుకున్న బ్యాట్స్‌మెన్‌లోనూ సచిన్‌దే అగ్రస్థానం.

03/04/2017 - 23:43

బిసిసిఐపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఐసిసి చైర్మన్ మనోహర్ సరైన సమయంలో, సరైన అస్త్రాన్ని సంధించాడు. మిగతా దేశాల సాయంతో చావుదెబ్బ కొట్టాడు. పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఐసిసి ఆదాయం, వాటాల పంపిణీ అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఐసిసిలోని క్రికెట్ బోర్డులకు అందే మొత్తాల్లో భారీ వ్యత్యాసం ఉండకూడదని తీర్మానించారు.

02/25/2017 - 22:58

ఏ క్రీడైనా కొన్ని రికార్డులకు పరిమితమవుతుంది. కానీ క్రికెట్‌లో మాత్రం రికార్డులకు కొదువ లేదు. కొన్ని రికార్డులు విచిత్రంగా ఉంటే మరికొన్ని ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. ఇందుకు ఉదాహరణలు ఎనె్నన్నో! 2013 జొహానె్నస్‌బర్గ్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఢీకొన్నప్పుడు అలాంటి విచిత్రమే ఒకటి చోటు చేసుకుంది.

02/25/2017 - 22:55

పాకిస్తాన్ స్పిన్నర్ అబ్దుర్ రెహ్మాన్‌కు ఎవరూ కోరుకోని చిత్రమైన రికార్డు ఉంది. ఎవరైనా బంతులు వేస్తేనే, పరుగులిస్తారు. కానీ, అతను ఒక్క బంతి కూడా వేయకుండానే ఎనిమిది పరుగులిచ్చాడు. 2014 ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెహ్మాన్ ఒకదాని తర్వాత మరొకటిగా 8 బంతుల్ని నిబంధనలకు విరుద్ధంగానో లేక నోబాల్స్‌గానో వేశాడు.

02/25/2017 - 22:53

* ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ తన కెరీర్‌లో, అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 4,172 పరుగులు రాబట్టినప్పటికీ ఒక్క సెంచరీ కూడా సాధించలేకపోయాడు. 2001లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను 99 పరుగులు చేసి, దురదృష్ట వశాత్తు సెంచరీ పూర్తి చేయకుండానే డానియల్ వెటోరీ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

02/25/2017 - 22:51

* శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అన్ని ఫార్మాట్స్‌లో కలిపి మొత్తం 1,347 వికెట్లు పడగొట్టాడు. 77 పర్యాయాలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించాడు. రెండో స్థానంలో ఉన్న రిచర్డ్ హాడ్లీ 41సార్లు కనీసం ఐదేసి వికెట్లు పడగొట్టాడు. ఈ తేడానే మురళీధరన్ సామర్థ్యానికి అద్దం పడుతున్నది.

02/25/2017 - 22:49

1,009 పరుగులు... ఇది ఒక జట్టు మొత్తం కలిసి చేసిన స్కోరుకాదు.. ఒకే ఒక్కడు సాధించిన పరుగులు. 2016 జనవరి 5న హెచ్‌టి భండారీ కప్ అంతర్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్‌లో ఆర్యా గురుకుల్‌పై కెసి గాంధీ స్కూల్‌కు ప్రాతినిథ్యం వహించిన ప్రణవ్ ధనవాదే ఈ భారీ స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు, 1899లో ఆర్థర్ కొలిన్స్ జూనియర్ హౌస్ మ్యాచ్‌లో 628 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

02/25/2017 - 22:47

అంతర్జాతీయ వనే్డ క్రికెట్ చరిత్రలో ఆరు పర్యాయాలు మాత్రమే డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. భారత ఆటగాడు రోహిత్ శర్మ రెండు పర్యాయాలు డబుల్ సెంచరీ సాధించి, అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2013 నవంబర్ 2న బెంగళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన వనే్డలో అతను 209 పరుగులు చేశాడు. 2014 నవంబర్ 13న కోల్‌కతాలో శ్రీలంకతో జరిగిన వనే్డలో 264 పరుగులు చేశాడు. వనే్డల్లో ఇప్పటి వరకూ అదే అత్యధిక స్కోరు.

02/25/2017 - 22:46

* కాన్‌బెరాలో జింబాబ్వేతో 2015 ఫిబ్రవరి 24న జరిగిన వనే్డలో వెస్టిండీస్ సూపర్ హీరో క్రిస్ గేల్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. వనే్డ చరిత్రలో అదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ. అంతకు ముందు వీరేందర్ సెవాగ్ 140 బంతుల్లో ‘డబుల్’ సాధించి నెలకొల్పిన రికార్డును గేల్ అధిగమించాడు.

Pages