S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

02/05/2017 - 00:43

* బేస్‌బాల్ మాజీ పిచర్ మార్క్ ఫిర్డిచ్‌ని ‘ది బర్డ్’ అని అభిమానులు ముద్దుగా పిలుస్తారు. ఎవరైనా ఒక మ్యాచ్‌కి ముందు గ్రౌండ్‌లో బాగా ప్రాక్టీస్ చేస్తారు. కొంత మంది చివరి క్షణం వరకూ అక్కడే ఉంటారు. కానీ, ఫిర్డిచ్ మాత్రం మ్యాచ్‌కి ముందు మట్టిలో గంతులు పెట్టేవాడు. అక్కడే ఒంటరిగా ఏవేవో ఆటలు ఆడేవాడు. చివరికి మురికిపట్టిన బట్టలతోనే మ్యాచ్ ఆడేందుకు వెళ్లేవాడు.

01/28/2017 - 22:57

స్టార్లు గెలవడం.. టైటిళ్లు సాధించడం సర్వసాధారణం. ఎలాంటి అంచనాలు లేకుండా పోటీకి దిగి, స్టార్లను ఓడించడం సంచలనం. ఇలాంటి సంచలనాలకు మారుపేరైన టెన్నిస్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు ఎన్నో నమోదయ్యాయి.

01/28/2017 - 22:53

గొరాన్ ఇవానిసెవిచ్ వైల్డ్‌కార్డ్‌తో ఎంట్రీ సంపాదించి, టైటిల్ సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2001 వింబుల్డన్‌లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందినప్పుడు అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 125వ స్థానంలో ఉన్నాడు. ఒక్కో అడుగు ముందుకేస్తూ, ఫైనల్ చేరాడు. టైటిల్ పోరులో అప్పటి మూడోసీడ్ పాట్ రాఫ్టర్‌ను 6-3, 3-6, 6-3, 2-6, 9-7 తేడాతో ఓడించి సరికొత్త రికార్డు నమోదు చేశాడు.

01/28/2017 - 22:51

ఆస్ట్రేలియా క్రీడాకారిణి జెలెనా డికాచ్ 1999 వింబుల్డన్ తొలి రౌండ్‌లోనే అప్పటి ప్రపంచ నంబర్ వన్ మార్టినా హింగిస్‌ను ఓడించి ప్రకంపనలు సృష్టించింది. అప్పట్లో 16 ఏళ్ల డికాచ్ ప్రపంచ ర్యాంక్ 129. హింగిస్ ఇంత తక్కువ స్థాయి క్రీడాకారిణి చేతిలో ఓడిపోవడం అదే మొదటిసారి.

01/28/2017 - 22:50

ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానంలో ఉన్న వీనస్ విలియమ్స్ 2000వ సంవత్సరంలో మొదటి గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అప్పటి డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ లిండ్సే డావెన్‌పోర్ట్‌పై 6-3, 7-6 తేడాతో గెలిచి టైటిల్ అందుకుంది. ఆతర్వాత వింబుల్డన్‌లోనే ఆమె మరో నాలుగు పర్యాయాలు విజేతగా నిలిచింది.

చిత్రం..వీనస్ విలియమ్స్

01/28/2017 - 22:48

బ్రెజిల్ ఆటగాడు గుస్టావో కూర్టెన్ సవాళ్లు విసరగలడని, గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించగలడని ఎవరూ ఊహించలేదు. కానీ, 1997 ఫ్రెంచ్ ఓపెన్‌లో, ప్రపంచ 66వ ర్యాంక్ ఆటగాడిగా బరిలోకి దిగిన కూర్టెన్ అప్పటికే రెండు పర్యాయాలు టైటిల్‌ను గెల్చుకున్న సెర్గీ రుగ్వేరాను 6-4, 6-2 తేడాతో ఓడించాడు.

01/28/2017 - 22:46

ఆస్ట్రేలియా టెన్నిస్ అభిమానులు తమ దేశానికే చెందిన నిక్ కిర్గియోస్ పేరు చెప్తేనే మండిపడుతున్నారు. అద్వితీయ ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్నప్పటికీ, మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు అతని ప్రవర్తనను అంతా మూకుమ్మడిగా ఖండిస్తున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆండ్రియాస్ సిప్పీని ఢీకొన్న కిర్గియోస్ మొదటి రెండు సెట్లను 1-6, 6-7 తేడాతో గెల్చుకున్నాడు.

01/28/2017 - 22:40

* మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ నెలకొల్పి రికార్డులు అన్నీఇన్నీ కావు. అనేకానేక రికార్డుల్లో, టెస్టుల్లో అత్యధిక ఫోర్ల రికార్డు కూడా ఉంది. అతను 200 టెస్టులు ఆడి, 2,058 ఫోర్లు కొట్టాడు. ఈ రికార్డులు ఇప్పటి వరకూ ఎవరూ అధిగమించలేదు. ఇప్పట్లో అ ది బద్దలయ్యే అవకాశాలు కూడా కనిపించ డం లేదు. రాహుల్ ద్రవిడ్ (1,654 ఫోర్లు), బ్రి యాన్ లారా (1,559 ఫోర్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

01/28/2017 - 22:39

* అమెరికా ఐస్ హాకీ అంటేనే ముందుగా గుర్తుకొచ్చే పేరు గోర్డీ హోవ్. 1946 నుంచి 1980 వరకు కెరీర్‌ను కొనసాగించిన అతను 1928 మార్చి 31న జన్మించాడు. 2016 జూన్ 10న మృతి చెందాడు. సుమారు మూడున్నర దశాబ్దాలు ఐస్ హాకీని ఏలిన హోవ్‌కు ‘క్రైయోఫోబియా’ అనే వింత భయం ఉండేది. ఐస్ లేదా చలి అంటే విపరీతమైన భయానే్న క్రైయోఫోబియా అంటారు.

01/28/2017 - 22:37

* హేమాహేమీ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌ను నిలువరించి, 1983లో ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను భారత్‌కు సాధించి పెట్టిన లెజెండరీ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరుమీద చాలా రికార్డులున్నాయి. వాటిలో ఒకటి కెప్టెన్‌గా అతని అద్భుత బౌలింగ్.

Pages