S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

02/12/2017 - 00:12

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు మిగతా రంగాలతోపాటు క్రీడలపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. కొంత మంది క్రీడాకారుల కెరీర్ ప్రమాదంలో పడితే, కొన్ని దేశాలు ఎదురుదాడికి దిగాయి. ట్రంప్ ఎఫెక్ట్ కేవలం క్రీడాకారులపైనేగాక, కోచ్‌లు, సపోర్టింగ్ స్ట్ఫా, అధికారులపైనా పడుతున్నది.

02/12/2017 - 00:10

పిచ్ తీరుతెన్నులు, వాతావరణం, జట్టు బలాబలాలు, వ్యూహాలు వంటి విషయాలను బుకీలకు సమాచారం అందించి కొంత మంది ఆటగాళ్లు భారీగా ముడుపులు తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఫలానా ఓవర్‌లో నో బాల్స్ వేస్తానని, లూజ్ బాల్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌కు భారీ షాట్ కొట్టే అవకాశం ఇస్తానని ముందుగానే ఒప్పందం కుదుర్చుకొని, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వారూ ఉన్నారు.

02/12/2017 - 00:09

బార్బడాస్ రాజధాని బ్రిడ్జిటౌన్, ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానాలు భారత్‌కు అచ్చిరాలేదు. ఈ రెండు వేదికల్లో టీమిండియా తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడింది. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేకపోయింది. బ్రిడ్జిటౌన్‌లో ఏడు, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాలుగు చొప్పున పరాజయాలను చవిచూసింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా భారత్ 47 కేంద్రాల్లో కనీసం ఒక్క మ్యాచ్‌నైనా గెలిచింది.

02/12/2017 - 00:07

ఒక టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి, ట్రోఫీని అందుకున్నప్పుడు ఏ జట్టయినా గంతులు పెడుతుంది. ఆనందంతో ఊగిపోతూ, విక్టరీ ల్యాప్స్‌తో సందడి చేస్తుంది. షాంపైన్ జల్లుల్లో మునిగితేలుతుంది. కానీ, బ్రెజిల్ ఫుట్‌బాల్ క్లబ్ చపెకొయన్స్ జట్టు కోపా సుడామెరికానా ట్రోఫీని తీసుకున్నప్పుడు ఎవరి ముఖంలోనూ ఆనందం కనిపించలేదు. కన్నీళ్లు జాలువారుతుండగా, దుఃఖాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకుంటూ ట్రోఫీని స్వీకరించారు.

02/12/2017 - 00:04

* మైదానంలోకి దిగిన తర్వాత ఎవరైనా తన జట్టును గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారు. బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్లు చేయాలని, సాధ్యమైనన్ని తక్కువ పరుగులిచ్చి, ఎక్కువ వికెట్లు తీయాలని బౌలర్లు అనుకుంటారు. కానీ, ఆస్ట్రేలియా బౌలర్ మిక్ లూయిస్‌ను ఇందుకు మినహాయించాలి. 2006లో దక్షిణాఫ్రికాతో వాండరర్స్‌లో జరిగిన వనే్డలో అతను 10 ఓవర్లు బౌల్ చేసి, 113 పరుగులు సమర్పించుకున్నాడు.

02/05/2017 - 01:07

అన్నాదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల సవాళ్లు మిగతా క్రీడల్లో మాదిరిగానే టెన్నిస్‌లోనూ చాలాకాలంగా కొనసాగుతున్నాయ. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో ‘విలియమ్స్ సిస్టర్స్’ వీనస్, సెరెనా విలియమ్స్ పోటీపడడంతో మరోసారి తోబుట్టువుల హవా తెరపైకి వచ్చింది. మన దేశంలో విజయ్ అమృత్‌రాజ్, ఆనంద్ అమృత్‌రాజ్, అశోక్ అమృత్‌రాజ్ సోదరులు టెన్నిస్‌కు సరికొత్త గుర్తింపును తెచ్చిపెట్టారు.

02/05/2017 - 01:03

ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకొని, ఈ ఏడాది శుభారంభం చేసిన స్విట్జర్లాండ్ వీరుడు రోజర్ ఫెదరర్ కెరీర్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను అందుకున్న క్రీడాకారుడిగా అతను తన రికార్డును తానే అధిగమిస్తున్నాడు. పీట్ సంప్రాస్, రాఫెల్ నాదల్ చెరి 14 టైటిళ్లతో ద్వితీయ స్థానంలో ఉంటే, వారి కంటే నాలుగు టైటిళ్లు అధికంగా సాధించిన ఫెదరర్ తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు.

02/05/2017 - 01:02

నిషిద్ధ మాదక ద్రవ్యాన్ని వాడినందుకు సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవా మళ్లీ అంతర్జాతీయ సర్క్యూట్‌పై కాలు మోపేందుకు కసరత్తు చేస్తున్నది. ఫిట్నెస్ కోసం చెమటోడుస్తున్నది. గంటల తరబడి పరుగులు తీస్తూ, బాక్సింగ్ చేస్తూ కెరీర్‌ను కొనసాగించేందుకు మంచి షేపులో ఉండేందుకు శ్రమిస్తున్నది.

02/05/2017 - 00:47

* గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో అత్యధిక టైటిళ్లు సాధించిన టెన్నిస్ స్టార్ల జాబితాలో మార్గరెట్ కోర్ట్‌ది అగ్రస్థానం. ఆమె కెరీర్‌లో మొత్తం 24 టైటిళ్లను అందుకుంది. వీటిలో 11 ఆస్ట్రేలియా ఓపెన్, ఐదు ఫ్రెంచ్ ఓపెన్, మూడు వింబుల్డన్, మరో ఐదు యుఎస్ ఓపెన్ ట్రోఫీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించిన సెరెనా విలియమ్స్ 23 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది.

02/05/2017 - 00:45

* ఎన్నో సందర్భాల్లో క్రీజ్‌లో నిలదొక్కుకొని, గంటల తరబడి బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన బ్యాట్క్‌మెన్ జాబితాలో రాహుల్ ద్రవిడ్ ముందు వరుసలో ఉంటాడు. అందుకే అతనికి ‘ది వాల్’ అన్న పేరు స్థిరపడింది. అతనిని అవుట్ చేయడం సులభం కాదన్నది వాస్తవం. అది నిజమే.. కానీ, టెస్టు చరిత్రలో ఎక్కువ సార్లు క్లీన్ బౌల్డ్ అయిన బ్యాట్స్‌మన్ కూడా అతనే కావడం విశేషం.

Pages