S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

12/24/2016 - 23:44

తనను తాను ‘ది గ్రేటెస్ట్’ అని ప్రకటించుకున్న ‘బాక్సింగ్ లెజెండ్’ మహమ్మద్ అలీ మృతితో క్రీడా ప్రపంచం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. టీనేజ్‌లోనే ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సాధించి, నల్ల జాతీయుల ఆశాకిరణంగా మారిన అలీ తన జీవిత కాలంలో ఎన్నడూ అమెరికా జాత్యాహంకారం ముందు తలవంచలేదు. యుద్ధ పిపాసను సమర్థించలేదు. వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకించి, నిషేధానికి గురైనా తన పట్టు వీడలేదు.

12/24/2016 - 23:41

టెన్నిస్‌లో ఈ ఏడాది సంచలన ఫలితాలు నమోదయ్యాయి. కెరీర్‌లో అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన రోజర్ ఫెదరర్ తెరమరుగయ్యాడు. ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ అనూహ్యంగా వెనుకబడి, రెండో స్థానానికి పడిపోయాడు. ఆ స్థానాన్ని బ్రిటిష్ సూపర్ స్టార్ ఆండీ ముర్రే సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

12/18/2016 - 01:34

ఒకటిరెండు సిరీస్‌లు, రెండు మూడు ఈవెంట్స్‌ను మినహాయిస్తే, ఈ ఏడాది అంతర్జాతీయ క్రీడా సంబరాలకు తెరపడింది. ప్రపంచ క్రీడలకు గ్రహణం పట్టిందన్న వాస్తవాన్ని ఈ ఏడాది చోటుచేసుకున్న అనేకానేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. రష్యా వ్యూహాత్మక డోపింగ్ యావత్ క్రీడా రంగాన్ని కుదిపేసింది. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

12/18/2016 - 01:32

నిషిద్ధ మాదక ద్రవ్యాల వినియోగం క్రీడా రంగాన్ని కూకటివేళ్లతో సహా పెకళిస్తున్నది. దీనికితోడు ఒక దేశమే వ్యూహాత్మకంగా తమ దేశ అథ్లెట్లకు డ్రగ్స్‌ను అలవాటు చేసి, డోపింగ్ పరీక్షలు నిర్వహించినట్టు, అంతా సవ్యంగా ఉందంటూ తప్పుడు సమాచారమిచ్చి మరీ మేజర్ ఈవెంట్స్‌కు పంపడం, పతకాలు సాధించడం క్రీడలకు పట్టిన చీడను పెంచుతున్నాయి.

12/18/2016 - 01:30

వచ్చే ఏడాది బాబ్‌స్లీ, స్కెలిటన్ చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సోచీకి చుక్కెదురైంది. ఈ చాంపియన్‌షిప్స్‌ను రద్దు చేసినట్టు అంతర్జాతీయ బాబ్‌స్లీ, స్కెలిటన్ సుమాఖ్య (ఐబిఎస్‌ఎఫ్) ప్రకటించింది. కొత్త వేదికను త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపింది. అయితే, ఈ చర్యను రాజకీయ కుట్రగా రష్యా అభివర్ణించింది.

12/18/2016 - 01:26

కొత్త అధ్యక్షుడిగా గియానీ ఇన్‌ఫాంటినో ఎన్నికైనప్పటికీ, అవినీతి ఊబిలో కూరుకుపోయిన ఫిఫా పరిస్థితుల్లో భారీ మార్పులేవీ కనిపించడం లేదు. ఐరోపా ఖండానికి చెందిన ఇన్‌ఫాంటినో ఈ రేసులో గట్టిపోటీదారు షేక్ సల్మాన్ బిన్ ఇబ్రహీం ఖలీఫాను 27 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. సెప్ బ్లాటర్ వారసుడిగా, ఫిఫాకు 10వ అధ్యక్షుడిగా అవతరించాడు.

12/18/2016 - 01:22

అంతర్జాతీయ మహిళా టెన్నిస్ సంఘం (డబ్ల్యుటిఎ) అధికారులు ఆలస్యంగా నిద్ర లేచారు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వాడినట్టు స్వయంగా అంగీకరించిన రష్యా టెన్నిస్ బ్యూటీ మరియా షరపోవాపై రెండేళ్ల సస్పెన్షన్‌ను విధించిన డబ్ల్యుటిఎ పెద్దలు ఆమె పేరును ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితా నుంచి తొలగించాలన్న విషయాన్ని మరచిపోయారు.

12/18/2016 - 01:17

* ఉసేన్ బోల్ట్ పోటీపడుతున్నాడంటే చూడడానికి అభిమానులు ఎగబడతారు. స్టేడియంలో సీట్లు నిండిపోతాయి. కానీ, రియో ఒలింపిక్స్‌లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపించింది. పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో బోల్ట్ పరుగును చూసేందుకు చాలా మంది రాలేదు. ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో నిర్వాహకులు తెల్లబోయారు.

12/11/2016 - 02:17

అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమస్య (్ఫఫా) మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తన ‘ఆఖరి యుద్ధం’లో ఓడాడు. తనపై విధించిన ఆరు సంవత్సరాల నిషేధాన్ని సవాలు చేస్తూ అతను దాఖలు చేసుకున్న పిటిషన్‌ను క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) కొట్టేసింది.

12/11/2016 - 02:15

మాంచెస్టర్ యునైటెడ్ కెప్టెన్, ఇంగ్లాండ్ సాకర్ సూపర్ స్టార్ వేన్ రూనీ కెరీర్‌పై అనుమానాలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా ఫామ్‌లో లేని అతను తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్ చివరిలో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినా, యూరోపియన్ లీగ్‌లో ఫెయెనూర్డ్‌పై అద్భుతమైన గోల్ సాధించినా, అతనిని ఎవరూ ప్రశ్నించడం లేదు.

Pages