S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

06/03/2019 - 22:47

నాకు ఓ చిన్న మారుతి కారు వుండేది. కొత్త కారు కొనుక్కున్న తరువాత దాన్ని వాడటం తగ్గించి వేశాను. అప్పుడు ఈ కార్ల ఎక్స్‌ఛేంజీలు లేవు. కొంతకాలం మారుతిని అప్పుడప్పుడూ ఉపయోగించేవాళ్లం. కానీ ఎక్కువగా అది నిరుపయోగంగానే వుండేది.
ఓసారి దాన్ని అమ్ముదామని చూస్తే దానికి చాలా తక్కువ ధరని కోట్ చేశారు. అంత తక్కువ ధరకు అమ్మడం ఎందుకని అమ్మలేదు. అట్లా అని ఎవరికీ ఇవ్వలేదు.

05/25/2019 - 18:41

ఆరు సంవత్సరాలుగా ‘ఓ చిన్న మాట’ రాస్తున్నాను. కొంతకాలం తరువాత దానికి తోడు ‘సండే గీత’ కూడా మొదలైంది. ఎక్కడో నాకు నచ్చిన రెండు చిన్న కథలను తెలుగు అనువాదం చేసి రాశాను. అలా మొదలైన ఈ ఫీచర్ అలా నడుస్తూనే వుంది. ఇప్పటికి ఇవి రెండు పుస్తకాలుగా వచ్చాయి. ఇంకా రెండు పుస్తకాలు రావల్సి వుంది.

05/18/2019 - 22:45

తెలుగులో ఓ రెండు పదాలు వున్నాయి. ఆ మాటకొస్తే అవి అన్ని భాషల్లోనూ వున్నాయి. అవి ‘కానీ’, ఎందుకంటే.
నేను పరీక్ష పాస్ కాలేదు ఎందుకంటే...
నాకు ఉద్యోగం రాలేదు ఎందుకంటే..
నా పుస్తకానికి ప్రైజ్ రాలేదు ఎందుకంటే..
ఆ సమయంలో నేను సరైన నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే...
ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు.
కానీ కొంతమంది ఈ పదాన్ని వాడరు. వాళ్లు ఉపయోగించే పదం ‘అయినప్పటికీ.’

05/11/2019 - 18:45

‘ప్యారడైస్ లాస్ట్’ అన్న కవితను జాన్‌మిల్టన్ రాశాడు. డిగ్రీ చదువుతున్నప్పుడు బహుశా అందరూ ఈ కవితని చదివి వుంటారు. అదొక కోణం.
‘స్వర్గాలు లేవు.. మనం కోల్పోయినవే స్వర్గాలు’ అన్నాడు ఓ తెలుగు కవి.
‘మన స్వర్గాలు మనలోనే వున్నాయి’ అంది ఈ మధ్య ఓ కవయిత్రి.

05/04/2019 - 17:01

మన జీవితాన్ని గొప్పగా ఊహించుకోవాలి. జీవితంలోని అన్ని అంశాల గురించి గొప్పగానే ఊహించుకోవాలి.
మన వృత్తిలో
మన వ్యాపారంలో మనం అత్యున్నత శిఖరం వైపు ప్రయాణం చేసే విధంగా మనం కృషి చేయాలి.
ఇతరులతో మన సంబంధాలు గొప్పగా వుండాలని ఆశించాలి.
మన ఆరోగ్యం
మన ఆర్థిక స్థితిగతులు
మన వ్యవహారాలు
అన్నీ గొప్పగా వుండాలని ఆశించాలి.

04/27/2019 - 19:44

2013వ సంవత్సరం డిసెంబర్‌లో లీవ్ ట్రావెల్ కనె్షషన్ మీద గుజరాత్ వెళ్లాం. ద్వారక నుంచి పోర్‌బందర్ వెళ్లాం. అక్కడి నుంచి సోమ్‌నాథ్ వెళ్లాలి.

04/20/2019 - 19:06

కాలేజీ రోజుల్లో, ఆ తరువాత కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న క్రమంలో ఎగ్జామ్స్ తేదీ అనౌన్స్ అయ్యేంత వరకు చదువుకోవడానికి మూడ్ రాకుండా పోయేది.
పరీక్షలు దగ్గరకొచ్చినప్పుడు తీక్షణంగా చదివేవాళ్లం. ఒక గంట సరిగ్గా కూర్చోలేని మేం పరీక్షల సమయంలో ఏకబిగిన మూడు గంటలు కూర్చుని చదివేవాళ్లం.

04/13/2019 - 18:44

ఆ మధ్య ఐ ఫోన్ రిపేర్ కోసమని ఆప్ట్రానిక్స్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లాను. ఓ అరగంటలో ఇస్తానని చెప్పడం వల్ల అక్కడే కూర్చున్నాను. చాలామంది కస్టమర్లు వస్తున్నారు. వెళ్తున్నారు. ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాను.

04/06/2019 - 23:03

ఈ మధ్య ప్రముఖ రచయిత పాల్ కొహెలో రాసిన ఓ చిన్న కథని అతని బ్లాగులో చదివాను. అది నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది.
ఓ కొత్త జంట కొత్త అపార్ట్‌మెంట్‌లో చేరారు. వాళ్ల డైనింగ్ హాల్ దగ్గర నుంచి ప్రక్కన వున్న ఫ్లాట్ వాళ్ల వాషింగ్ ఏరియా కన్పిస్తుంది.
ఓ రోజు ఉదయం ప్రక్కింటి అమ్మాయి బట్టలు ఉతికి ఆరేస్తూ కన్పిస్తుంది. ఈ జంట బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ వుంటారు.

03/30/2019 - 18:53

ఎండాకాలం తరువాత వానాకాలం వస్తుంది. కానీ వానలు రావు. ఇప్పుడు ఇది మామూలే. అయితే మా చిన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడూ వచ్చేది. వానలు పడకపొయ్యేవి. రైతులే కాదు అందరూ వానల కోసం ఎదురుచూసేవాళ్లు. బావుల్లో నీళ్లు అడుగంటుకొని పొయ్యేవి. బొక్కెనకి వున్న తాడు నీళ్లకు అందకపొయ్యేది. ఆ తాడుకు మరి కొంత తాడు కట్టి నీళ్లు ఊరిన తరువాత చేదుకునేవాళ్లు.

Pages