S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ చిన్నమాట!

01/29/2019 - 01:11

న్యాయమూర్తి పదవిలో వున్నప్పుడు కూడా చాలామంది లీగల్ సమస్యలు వున్నప్పుడు సలహాల కోసం, సహాయం కోసం వచ్చేవాళ్లు. నా వృత్తికి సంబంధం లేని విషయాల్లో సలహాలు ఇచ్చేవాణ్ని. అవసరమైన సందర్భాలలో మాట సహాయం కూడా చేసేవాణ్ని. న్యాయమూర్తి పదవీ విరమణ చేసిన తరువాత కూడా చాలామంది సలహా సంప్రదింపుల కోసం వస్తూనే వున్నారు. తోచిన రీతిలో ఏదో సహాయం చేస్తూనే వున్నాను.

01/19/2019 - 18:38

గత వారం వారణాసి వెళ్లాను. రెండు రోజులు అక్కడ వున్న తరువాత గయా, బోద్‌గయా వెళ్లడానికి నిర్ణయించుకున్నాం. ఉదయం ఆరు గంటలకు రమ్మని ఓ కారుని హైర్ చేశాం. యజమాని డ్రైవర్ నెంబర్ ఇచ్చాడు. డ్రైవర్‌కి ఫోన్ చేశాను. ఆరు గంటలకి వస్తానని చెప్పాడు కానీ 7 గంటలకు వచ్చాడు. రావడంతోనే క్షమాపణలు చెప్పాడు ఆలస్యంగా వచ్చినందుకు.

01/12/2019 - 18:31

నేను వికారాబాద్‌లో సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నప్పుడు మద్రాస్‌లో ఓ సమావేశం జరిగింది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో న్యాయమూర్తుల పాత్ర అన్న అంశం మీద నేషనల్ జ్యుడీషియల్ అకాడెమీ దక్షిణాది రాష్ట్రాలకి చెందిన న్యాయమూర్తుల కోసం ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ అది. మేజిస్ట్రేట్ స్థాయి నుంచి జిల్లా జడ్జి స్థాయి వరకు అందరూ పాల్గొన్న కాన్ఫరెన్స్ అది.

01/05/2019 - 19:10

న్యాయశాస్త్రానికి సంబంధించి తెలుగులో చాలా పుస్తకాలు రాశాను. వ్యాసాల సంగతి చెప్పాల్సిన పనిలేదు. లెక్కలేనన్ని రాస్తూనే వున్నాను.
కథలూ, కవిత్వం వాటికి అదనం. అవి ఓ పది పుస్తకాలు వచ్చాయి.

12/29/2018 - 17:23

మా చిన్నప్పుడు డబుల్ కాట్స్ అనేవి ఉండేవి కావు. నవారు మంచాలు, నులక మంచాలు ఉండేవి. ఒకటీ అరా పెళ్ళి మంచాలు ఉండేవి. పడుకోవాలని అన్పిస్తే మంచాలు వాల్చుకుని పడుకోవాల్సి వచ్చేది. వాటి మీద బట్టలూ, పరుపు చుట్టలని పెట్టేవాళ్ళు. అందుకని ఎక్కువగా కూర్చొని ఉండేవాళ్ళం.
ఇంటి ముందు ఉన్న బల్ల మీద కూర్చొని చదువుకునేవాళ్ళం ఇప్ప టి పిల్లలకు ఉన్నట్టు స్టడీ టేబుల్ లాంటివి ఉండేవి కాదు.

12/22/2018 - 18:38

ఇల్లు మారిన తరువాత పుస్తకాలని సర్దుతుంటే రెండుత్తరాలు దొరికాయి. ఒకటి మా అమ్మాయికి రాసిన ఉత్తరం. అప్పుడు మా పాప ఐదవ తరగతి చదువుతోంది. హైదరాబాద్‌లో హాస్టల్‌లో వుంది. ఆ ఉత్తరంలో నేను ఒక పేజి, మా అబ్బాయి రెండో పేజీలో రాశాడు. అప్పుడు వాడు మూడవ తరగతి చదువుతున్నాడు.

12/22/2018 - 18:36

కొంతమంది న్యాయబద్దంగా పని చేస్తూ ఉంటారు.
ఎలాంటి అవినీతికి తావులేకుండా పని చేస్తూ ఉంటారు.
మరి కొంతమంది ఇతరులకి సహాయం చేస్తూ ఉంటారు.
అవినీతిమయమైన ఈ సమాజంలో నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా వుండటం కష్టమైన పని.
మోచేతులతో ఇతరులని నెట్టుకుంటూ ప్రయాణం చేస్తున్న ప్రపంచంలో కాసింత దయతో బ్రతకడం కూడా కష్టమే.

12/15/2018 - 17:23

‘వయస్సు అనేది ఒక సంఖ్య మాత్రమే. మనస్సుకి వయస్సు లేదు’ ఈ మాట అన్నది భారతీయ అమెరికన్ భక్తవార్‌సింగ్ బ్రార్. అతని వయస్సు 105 సంవత్సరాలు. ఇటీవలె అతను తన జన్మదిన సంరంభం జరుపుకున్నాడు. ఆయన జరుపుకోలేదు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్న ఉద్యోగులు ఆయన జన్మదిన ఉత్సవాన్ని జరిపారు.

12/08/2018 - 18:16

ఇంటర్నెట్ వచ్చిన తరువాత సమాచారం అందరికీ సులువుగా అందుతోంది. స్మార్ట్ఫోన్ వచ్చిన తరువాత అది ఇంకా సులువైంది. గుడ్‌మార్నింగ్‌లు, గుడ్‌నైట్‌లు ఇలా ఎన్నో కుప్పలు తెప్పలుగా వచ్చి చేరిపోతున్నాయి.
ఎన్నో వెబ్‌సైట్లు. ఎన్నో శుభాకాంక్ష సందేశాలు.
వాటిల్లో నుంచి ఎంపిక చేసి చాలా మంది పంపిస్తూ వుంటారు.
మంచిదే!
అదే విధంగా గొప్పవాళ్ల కొటేషన్స్ ఎంపిక చేసి పంపిస్తూ వుంటారు.

12/01/2018 - 18:42

మా చిన్నప్పుడు మా అమ్మా, బాపు ఒక మాట చెప్పేవాళ్లు. ఏ పని చేసినా మనస్సు పెట్టి చెయ్యాలని.
మా అక్కల్లో ఎవరైనా టీ పెట్టి అది బాగా లేకపోతే మా అనేది మనస్సు పెట్టి చేయలేదని.
‘నువ్వు వేసినట్టే టీ పొడి, చక్కెర వేశానని, పాలు పోసాన’ని మా అక్కలు చెప్పేవాళ్లు.
నాలాగే టీ పొడి, చక్కెర వెయ్యడం, పాలు పొయ్యడం కాదు. నాలాగా మనస్సు పెట్టి చెయ్యాలి అని మా అమ్మ చెప్పేది.

Pages