S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళాంజలి

04/07/2018 - 21:46

డాక్టర్ కొట్టే వేంకటాచార్యులు ప్రసిద్ధ రంగస్థల నటుడు, రచయిత, పరిశోధకుడు, దర్శకుడు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎంతో సాధించినా నిండుకుండ, బంగారుకొండ. ఎన్నో బిరుదులు, సన్మానాలు పొందినా వీరి మాట సున్నితం. మనస్సు నవనీతం. వందల ప్రదర్శనలు వీరు పౌరాణిక నాటకాలలో చేశారు. కొన్ని దశాబ్దాలుగా నాటక రంగానికి అంకితమైన వీరు హైదరాబాద్ శ్రీరామభద్ర జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి 2009లో రిటైరయ్యారు.

03/31/2018 - 21:17

అయ్యదేవర పురుషోత్తమరావు గారు కవి, గాయకుడు, రచయిత, రంగస్థల నటుడు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. జీవితంలో ఎంతో సాధించినా వీరు నిండు కుండ. బంగారు కొండ. కళాకారుడిగా ఎన్నో గౌరవాలు పొందారు. అయినా, వీరి మాట సున్నితం, మనసు నవనీతం. 3వేలకు పైగా నాటకాలు ప్రదర్శించారు. అందులో వెయ్యికి పైగా శ్రీకృష్ణుడిగా నటించారు. 500 పైగా శ్రీకృష్ణదేవరాయలుగా వేశారు. వీరు ‘చింతామణి’లో బిల్వమంగళుడిగా ఎంతో ప్రఖ్యాతి గాంచారు.

03/24/2018 - 20:23

డాక్టర్ సుమిత్ర పార్థసారథి కూచిపూడిలో మేటి కళాకారిణి. గృహిణిగా, పరిశోధకురాలిగా, రచయిత్రిగా, గురువుగా ఎనె్నన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆదర్శ మహిళ. ఎన్నో అవార్డులు పొందినా ఆమె నిండుకుండే. కళాజీవితంలో ఎంతో సాధించినా ఆమె మాట సున్నితం, మనసు నవనీతం.

Pages