S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/23/2017 - 01:10

విజయవాడ, ఆగస్టు 22: పిఎంపి, ఆర్‌ఎంపిలకు కమ్యూనిటీ పారా మెడికల్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ కింద శిక్షణ విధి విధానాలు ఖరారు చేసేందుకు ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

08/23/2017 - 01:09

విజయవాడ, ఆగస్టు 22: తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్ష రగిలించిన నేతల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రభాగాన ఉంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. బుధవారం ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

08/23/2017 - 01:08

విజయవాడ, ఆగస్టు 22: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ తెలుగుదేశం పార్టీ గెలిచి తీరాల్సిందేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన కాకినాడ ఎన్నికల నిర్వహణపై ఆ పార్టీ నేతలతో మంగళవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.

08/23/2017 - 01:01

గుంటూరు, ఆగస్టు 22: రాష్ట్రంలో అవినీతికి అడ్డుకట్ట వేయటంలో ప్రభుత్వం విఫలమైందని శాసనసభలో బిజెపి ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్ రాజు విమర్శించారు. మంగళవారం గుంటూరులో కేంద్రమంత్రి జెపి నద్దా హాజరైన సంకల్పసిద్ధి- నవభారత నిర్మాణం సదస్సులో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వానికి అవినీతి మరక లేదన్నారు.

08/23/2017 - 01:01

విజయవాడ, ఆగస్టు 22: పాఠశాల విద్యాశాఖ సర్వీస్ రూల్స్ ముసాయిదా ఈనెల 29కి విడుదల చేస్తామని సర్వీస్ రూల్స్ కమిటీ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎంవి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం విజయవాడలోని ఓ హోటల్‌లో సర్వీస్ రూల్స్ కమిటీ ఎంవి సత్యనారాయణ అధ్యక్షతన సమావేశమైంది.

08/23/2017 - 01:00

విజయవాడ, ఆగస్టు 22: సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఆర్‌కె ప్రసాద్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర సంతాపం తెలియజేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో నూతన పరిపాలన సంస్కరణలకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిన ఘనత పివిఆర్‌కె ప్రసాద్‌కే దక్కిందంటూ స్పీకర్ గుర్తు చేశారు.

08/23/2017 - 01:00

విజయవాడ, ఆగస్టు 22: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే పూర్తిస్థాయిలో అన్నిరంగాల్లోనూ రాణించగలుగుతారని, విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా హెల్త్ కార్డులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లాలో పైలెట్ ప్రాతిపదికన 71వేల మందికి పైగా విద్యార్థులకు హెల్త్ కార్డులను అందించనున్నట్లు స్పష్టం చేశారు.

08/23/2017 - 00:59

విజయవాడ, ఆగస్టు 22: మున్సిపల్ కార్మికులను వీధులపాలు చేసే 279 జీవోను వచ్చేనెల 15లోపు రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఆ మరుసటిరోజు 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తారని మున్సిపల్ జెఎసి, ఇతర కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు.

08/23/2017 - 00:58

విజయవాడ, ఆగస్టు 22: విద్యాశాఖ అధికారులు తరచూ పాఠశాలలకు వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలోకి వెళితేనే సమస్యలకు పరిష్కార మార్గాలు అర్థమవుతాయన్నారు.

08/23/2017 - 00:57

విజయవాడ, ఆగస్టు 22: రాష్ట్రంలోని 110 పురపాలక పట్టణాలు, నగరాల్లో ‘ఆనంద లహరి’ పేరుతో వారాంతపు వినోద కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, విద్యార్థులు, ఔత్సాహిక కళాకారులతో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పోటీల నిర్వహణతో పాటు అక్కడే హస్తకళల ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేస్తారు. ప్రతి వారాంతంలో 4గంటలపాటు ఈ కార్యక్రమాలు ఉంటాయి.

Pages