S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/01/2017 - 23:55

తిరుపతి, సెప్టెంబర్ 1: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు.

09/01/2017 - 23:54

విజయవాడ, సెప్టెంబర్ 1: దేశంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా దేశీయ స్థూల ఉత్పత్తి (జీడిపి) పతనమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఏడాది వ్యవధిలో వృద్ధిరేటు 7.9 నుంచి 5.7 శాతానికి దిగజారిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఏకపక్ష నిర్ణయాలే అన్ని అనర్ధాలకు కారణమని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా కూడా మోదీ పశ్చాత్తాపం చెందకపోవడం దురదృష్టకరమన్నారు.

09/01/2017 - 03:59

గుంటూరు, ఆగస్టు 31: తిరుపతికి చెందిన పదేళ్ల బాలుడు దేవిశ్రీ ప్రసాద్ లింబోరోలర్ స్కేటింగ్‌లో గిన్నీస్ బుక్ రికార్డులకెక్కాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 72 పతకాలు సాధించిన దేవిశ్రీ ప్రసాద్ గురువారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో టోల్ ప్లాజా వద్ద అద్భుతమైన విన్యాసాలను ప్రదర్శించాడు.

09/01/2017 - 03:57

విజయవాడ: స్కేటింగ్‌లో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన తిరుపతి బాలుడు జి.దేవిశ్రీ ప్రసాద్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ప్రోత్సాహకంగా రూ.10 లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు. స్కేటింగ్‌లో మరింత రాణించేందుకు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో స్కేటింగ్ ట్రాక్ అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్నారు.

09/01/2017 - 03:54

అమరావతి, ఆగస్టు 31: విలువిద్యలో ‘అర్జున’ పురస్కార గ్రహీత వెన్నం జ్యోతి సురేఖకు ప్రోత్సాహకంగా రూ.కోటి అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. 500 చదరపు గజాల ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు. గురువారం సాయంత్రం పలువురు క్రీడాకారులు ముఖ్యమంత్రిని విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కలిశారు.

09/01/2017 - 03:52

విజయవాడ, ఆగస్టు 31: మైనింగ్, తిరుపతి-తిరుమల ఘాట్ రోడ్డులో భద్రత తదితర అంశాలపై వెస్టర్న్ అస్ట్రేలియా ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. విజయవాడ సిఎం క్యాంప్ కార్యాలయంలో విద్య, మైనింగ్, జియాలజీ, రహదారి భద్రత, డిజిటల్ హెల్త్ కేర్, తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గురువారం వెస్టర్న్ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్ రోగర్ కుక్ చర్చించారు.

09/01/2017 - 03:51

ఖమ్మం, ఆగస్టు 31: రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయ శాఖను బలోపేతం చేయడంతో పాటు రైతులకు మరింత దగ్గర చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రాష్టవ్య్రాప్తంగా 2500 క్లస్టర్లలో ఏఇఓ కార్యాలయాలు, ప్రత్యేక గోదాములు, రైతులకు సమావేశ మందిరాలను నిర్మించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో క్లస్టర్ల వారీగా స్థల సేకరణ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

09/01/2017 - 03:51

విజయవాడ, ఆగస్టు 31: వాల్మీకి/బోయ ఫెడరేషన్ ద్వారా ఇకపై 5గురు సభ్యులతో కూడిన గ్రూపుతో పాటు వ్యక్తిగత రుణాలు కూడా మంజూరు చేయనున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ బిటి నాయుడు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.18 జారీ చేసిందన్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 15 తేదీ వరకూ ప్రభుత్వం గడువు పొడిగించిందని వెల్లడించారు.

09/01/2017 - 03:50

అమరావతి, ఆగస్టు 31: తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఎప్పటికప్పుడు పోరాటాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. తెలంగాణ టిడిపి నేతలకు సూచించారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, క్షేత్రస్థాయి నుంచి పార్టీని పునర్మిర్మించేందుకు కొత్త కమిటీలకు సమష్టిగా దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు.

09/01/2017 - 03:50

విజయవాడ, ఆగస్టు 31: రాష్ట్రంలో అనలిటిక్స్, డేటా సైన్సు వర్సిటీ ప్రారంభించేందుకు మ్యూ సిగ్మా సంస్థ ముందుకు వచ్చింది. 500 మంది డేటా సైంటిస్టులతో రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి కనబరించింది. మ్యూ సిగ్మా కంపెనీ ప్రతినిధులతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ వెలగపూడి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు.

Pages