S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/11/2018 - 04:11

మధురవాడ, అక్టోబర్ 10: పోతినమల్లయ్యపాలేం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్‌లో నగదు మాయమైనట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. సిఐ కె.లక్ష్మణమూర్తి బుధవారం తెలిపిన వివరాలప్రకారం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రాంతానికి చెందిన టి.రాజేశ్వర శర్మ కొమ్మాది సాయిరామ్ కాలనీలో నివాసముంటు ప్రవేశ పరీక్షలకు శిక్షణపొందుతున్నారు.

10/11/2018 - 00:14

జగ్గయ్యపేట రూరల్, అక్టోబర్ 10: మండలంలోని షేర్‌మహమ్మద్‌పేటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన శరణం మనీష (16) జగ్గయ్యపేట వాగ్దేవి కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి విషయం తల్లిదండ్రులకు తెలియపర్చారు.

10/11/2018 - 00:12

పాతబస్తీ, అక్టోబర్ 10: వ్యభిచార గృహాన్ని నిర్వహించడానికి కుమారుడిని, మేనల్లుళ్లను రంగంలో దించిన ఓ మహిళ గుట్టును కొత్తపేట పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పాత రాజరాజేశ్వరిపేటకు చెందిన పత్తిపాటి శాంతి(45) కొంతకాలంగా తనింట్లో వ్యభిచారం నిర్వహిస్తోంది.

10/11/2018 - 00:05

శంకరపట్నం, అక్టోబర్ 10: శంకరపట్నం మండలం తాడికల్‌లో రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా మృతి చెందిన గడ్డి కుమార్ మృతిపై హుజూరాబాద్ రూరల్ సీఐ బుధవారం గ్రామంలో విచారణ చేపట్టారు. అదేవిధంగా కరీంనగర్ స్పెష ల్ బ్రాంచి పోలీసులు వేర్వేరుగా ఇతని మృతిపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. కుమార్ మృతి వ్యవహారం పోలీసులకు అంతు చిక్కకుండా పోయింది.

10/11/2018 - 00:04

సుల్తానాబాద్, అక్టోబర్ 10: భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడం, అత్తింటి వారు అదనపు కట్నం కోసం పెట్టే వేధింపులు భరించలేక ఓ వివాహిత బుధవారం ఉదయం తనువు చాలించిన సంఘటన సుల్తానాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సూసైడ్ నోట్, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

10/10/2018 - 23:53

మర్రిగూడ, అక్టోబర్ 10: కష్ట సుఖాలను అనుభవిస్తూ సగం జీవితాన్ని గడిపినన భార్యా భర్తల ఇద్దరి మధ్య అనుమానమే పెనుభూతమైంది. భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన మండలంలోని శివన్నగూడ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కధనం ప్రకారం..

10/10/2018 - 23:29

గంగవరం, అక్టోబర్ 10:: భర్తపై అలిగి కోపంతో తన ఇద్దరు పిల్లలతో సహా ఓ గిరిజన మహిళ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తూర్పు మన్యంలో సంచలనం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గంగవరం ఎస్సై రామలింగేశ్వరరావు స్థానిక విలేఖర్లకు బుధవారం సాయంత్రం వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం అతిలోతట్టు గిరిజన ప్రాంతమైన నీలవరం గ్రామానికి చెందిన పట్టం దేవమణి (28)ఈ ఘాతుకానికి పాల్పడింది.

10/10/2018 - 22:25

గుంటూరు (అరండల్‌పేట) అక్టోబర్ 10: రాజధాని పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇరువురు బుకీల గుట్టు రట్టు చేసి వారి వద్దనుంచి రూ 2.29ల నగదుతో పాటు, ల్యాప్‌ట్యాప్, టీవి, కారును స్వాధీనం చేసుకున్నారు గుంటూరు అర్బన్ పోలీసులు. బుధవారం అర్బన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అదనపు ఎస్పీ వైటి నాయుడు నిందితుల వివరాలను వెల్లడించారు.

10/10/2018 - 22:22

మంగళగిరి, అక్టోబర్ 10: గుంటూరు అర్బన్ నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని మంగళగిరి , తాడేపల్లి, పెదకాకాని పోలీసుస్టేషన్ల పరిధిలో వివిధ దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడిన నలుగురు అంతర్‌జిల్లా నేరస్థులను బుధవారం అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ జీ రామకృష్ణ వెల్లడించారు.

10/10/2018 - 22:13

గార్లదినె్న, అక్టోబర్ 10 : మండల పరిధిలోని మర్తాడు గ్రామానికి చెందిన మలిరెడ్డి (70) బుధవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాంప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మలిరెడ్డి భార్య ఐదు నెలల క్రితం మృతి చెందింది. భార్య మృతితో మనస్థాపానికి గురైన మలిరెడ్డి గ్రామంలోని పాత సినిమా హాల్ పక్కన ఉన్న చెట్టుకు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Pages