S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/06/2019 - 01:42

విజయవాడ (క్రైం), నవంబర్ 5: ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్‌లో నగర పోలీసులు నిబంధనలు అతిక్రమించిన బుల్లెట్ వాహనాలను సీజ్ చేశారు. వాయు, శబ్ద కాలుష్యానికి కారణమైన వాహనాలపై దృష్టి సారించిన ట్రాఫిక్ యంత్రాంగం కొద్దిరోజులుగా కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలోభాగంగా నగరంలోని పలు కూడళ్లలో మంగళవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు.

11/06/2019 - 01:37

బాలానగర్, నవంబర్ 5: తాను పని చేస్తున్న సంస్థ ఎండికే లక్షలాది రూపాయాలు టోకరా వేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

11/05/2019 - 23:54

పొన్నూరు, నవంబర్ 5: గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని చింతలపూడి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మూకిరి సలోమాను (46) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా ఇసుక కొరత వలన ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా కలత చెందుతున్న సలోమాను మంగళవారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతడి భౌతికకాయాన్ని టీడీపీ శ్రేణులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.

11/05/2019 - 22:09

న్యూఢిల్లీ, నవంబర్ 5: జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తరువాత అనేక మంది మైనర్లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకోవడంపై సుప్రీంకోర్టు స్పందించింది. దీనిపై వస్తున్న ఆరోపణలపై నలుగురు సభ్యుల జువైనల్ జస్టిస్ కమిటీ వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని దర్మాసనం ఆదేశించింది.

11/05/2019 - 05:49

చిత్తూరు: కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు ఆత్యహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు నగరం ఓబనపల్లి కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. ఇందులో భార్యభర్తతో పాటు తొమ్మిది సంవత్సరాల కూతురు మృతి చెందింది. ఈ సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓబనపల్లికాలనీకి చెందిన జయలక్ష్మి స్థానికంగా ఉన్న ఎల్‌ఐసీ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తూ ఇటీవల రిటైర్ అయ్యింది.

11/05/2019 - 05:23

ఆలమూరు, నవంబర్ 4: తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడవద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున కార్లతో వెళుతున్న కంటైనర్ కాలువలోకి దూసుకుపోయిన ప్రమాదంలో ఇరువురు మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం చెన్నై నుండి ఒడిస్సాకు హ్యూందై కార్లతో వెళుతున్న కంటైనర్ జొన్నాడ గౌతమి బ్రిడ్జి సమీపంలో అదుపుతప్పి, జాతీయ రహదారి నుండి 40 అడుగుల దిగువకు ఉన్న తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది.

11/05/2019 - 05:20

తిరుపతి, నవంబర్ 4: టీటీడీలోని అన్నదానం, లడ్డూ కౌంటర్లలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఆన్‌లైన్ ద్వారా నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ముఠాను ఓ బాధితుడి ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వీరిపై ఫిర్యాదు చేయడంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

11/05/2019 - 04:48

హైదరాబాద్ (బాలాపూర్), నవంబర్ 4: కళాశాల యజమాన్యం వేధింపులతో టీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లోని తీగల రాంరెడ్డి పాలిటెక్నిక్ కళశాలలో ఫైనల్ చదువుతున్న సంధ్యను కళాశాల యజమాన్యం, లెక్చరర్ పార్వతి వేధించడంతో ఆదివారం ఇంటిలో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

11/05/2019 - 02:53

నర్సీపట్నం, నవంబర్ 4: గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీస్, ఎక్సైజ్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ స్మగ్లర్లు మాత్రం కొత్త దారులను వెతుకుతూనే ఉన్నారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి విశాఖ మన్యం మీదుగా వివిధ రాష్ట్రాలకు భారీ స్థాయిలో గంజాయి అక్రమంగా తరలిపోతోంది.

11/05/2019 - 02:07

హైదరాబాద్ : రాష్ట్రం లో ఫీజులు-అడ్మిషన్ల నియంత్రణ కమిటీ నిర్ణయించిన ఫీజులను పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఫీజుల రెగ్యులేషన్ కమిటీ సిఫార్సులకు మించి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీల తీరుపై రాష్ట్ర తల్లిదండ్రుల సం ఘం సహా పలువురు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Pages