S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/08/2016 - 21:17

గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న హాస్యరస చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ’. యువ జంటగా బాబ్త్రన్, బిందు బార్బి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఉగాది సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

04/08/2016 - 21:11

శ్రీ బుజ్జిమేక ఫిలింస్ పతాకంపై కోటి కిరణ్, ఆశ జంటగా పాండాల మహేష్‌కుమార్ గౌడ్ దర్శకత్వంలో పాండాల బుజ్జి రూపొందిస్తున్న చిత్రం ‘వేటాడే పులి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా రూపొందించామని తెలిపారు.

04/08/2016 - 21:09

యువ కథానాయకుడు నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో అభినయ్, మధుర శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఒక మనసు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతున్నామని, ఓ అందమైన మనసు కథగా ఈ చిత్రం అద్భుతంగా రూపొందిందని అన్నారు. ఈనెల చివరివారంలో ఆడియో విడుదల చేసి మే మూడవ వారంలో

04/08/2016 - 21:08

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అబ్బాస్ తెలుగు తెరపై హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై నిర్మాత కె.సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

04/08/2016 - 21:06

అనేకమంది హీరో హీరోయిన్లు డేటింగ్ అంటే ముద్దని ప్రకటనలిస్తుంటే, త్రిష మాత్రం ఆ మాటని తన వద్ద ప్రస్తావించవద్దని కరాఖండీగా చెబుతోంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన త్రిష, ప్రస్తుతం స్లో అండ్ స్టడీగా కెరీర్‌ను సాగిస్తోంది. గత సంవత్సరం పెళ్లిపీటలవరకు వెళ్లిన ఆమె అక్కడే ఆగిపోయింది. పెళ్లి తప్పిపోవడంతో కెరీర్‌పై దృష్టిపెట్టి వరుసగా అవకాశాలు పొందుతోంది.

04/08/2016 - 21:04

రామ్ కథానాయకుడిగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. రామ్‌పై శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి.ఎం. క్లాప్‌కొట్టగా రవికిశోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట, అనీల్ సుంకర మాట్లాడుతూ, మే మూడవ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

04/07/2016 - 21:20

బాలీవుడ్ భామ బిపాసాబసు త్వరలో ఓ ఇంటిది కాబోతోంది. ప్రేమికుడు కరణ్‌సింగ్ గ్రోవర్‌తో బిపాసా వివాహం ఈనెల 30న జరగనుంది. ఈ విషయాన్ని కరణ్, బిపాసా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇన్నాళ్లూ తమ ప్రేమవ్యవహారాన్ని రచ్చకీడ్చకుండా ఉన్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పిన ఈ జంట వివాహానికి అత్యంత ఆప్తులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు.

04/07/2016 - 21:18

‘అమ్మా నాన్న తమిళ అమ్మాయి’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అసిన్, అటుపై పలు సినిమాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గజనీ సినిమాతో బాలీవుడ్‌లో కూడా అంతే ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామ ఎక్కువగా హిందీలో సినిమాలు చేయలేకపోయింది. దాంతో గత ఏడాది బిజినెస్‌మెన్ అయిన రాహుల్ శర్మను వివాహం చేసుకున్న అసిన్, ఇప్పుడు ఇంటికే పరిమితం అవుతోంది.

04/07/2016 - 21:16

తిబ్ధ్నిలబ2ల్థ జ్ఞూ్ర+

04/07/2016 - 21:14

వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ప్రశాంత్, ప్రసన్న, మణికంఠ సన్ని, పూజిత ప్రధాన తారాగణంగా శివశ్రీ దర్శకత్వంలో మళ్ల విజయప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇంకేంటి నువ్వే చెప్పు’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జరుపుతున్నారు.

Pages