S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/27/2016 - 01:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత జనాభాలో దాదాపు 70మిలియన్ల మంది ప్రాణాంతకమైన అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని భారత క్లినికల్ పరిశోధన సొసైటీ (ఐఎస్‌సిఆర్) తెలిపింది.

02/27/2016 - 01:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలో తప్పనిసరి ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. అయితే ఎన్నికల సంస్కరణలను మాత్రం ముందుకు తీసుకువెళతామని ప్రస్తుతం వీటి అవసరం ఎంతైనా ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ లోక్‌సభలో వెల్లడించారు. నిర్బంధ ఓటంగ్‌ను ప్రవేశపెట్టే అంశంపై ఓ అనధికార బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్నారు.

02/27/2016 - 01:32

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలో బిఎస్‌ఎఫ్ ఆపరేషన్‌లన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడాన్ని వీలుకల్పించే ఓ హైటెక్ కంట్రోల్ రూమర్‌ను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం నాడు ఇక్కడ ప్రారంభించారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని క్షేత్రాలనుంచే అందే ఆన్‌లైన్ సమాచారాన్ని అనుసంధానం చేయడానికి, విశే్లషించడానికి వీలుకలుగుతుంది.

02/27/2016 - 01:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత సమాజం ముక్కలు చెక్కలయ్యే పరిస్థితి నేడు నెలకొందని 1947లో దేశ విభజన సందర్భంగానూ, 1992లో బాబర్ విధ్యంసం తర్వాతే ఈ రకమైన ప్రతికూల ధోరణులు ఏర్పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం అని మతపరమైన అంశాలపైన ఇతర విషయాల్లోనూ జరుగుతున్న చర్చే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

02/27/2016 - 01:29

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఐదు రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు బిజెపి జాతీయ కార్యవర్గం వచ్చే నెలలో సమావేశ మవుతుంది. మార్చి 19, 20 తేదీల్లో ఈ సమావేశం ఢిల్లీలో జరిగే అవకాశం వుంది. జాతీయ కార్య నిర్వాహక వర్గ సమావేశానికి ముందు బిజెపి అనుబంధ సంస్థలను అధ్యక్షుడు అమిత్‌షా పునర్‌వ్యవస్థీకరిస్తారు.

02/27/2016 - 01:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ పేరును ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని ఐక్యరాజ్య సమితి కమిటీ 1267కు భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.

02/27/2016 - 01:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: పాటియాలా హౌస్‌కోర్టులో జెఎన్‌యుఎస్‌యు అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తదితరులపై దాడికి పాల్పడిన ముగ్గురు న్యాయవాదులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ దాడిపై సిట్‌తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.

02/27/2016 - 01:21

ఉత్తర్వులపై రాష్టప్రతి సంతకం

02/27/2016 - 01:37

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: హెచ్‌సియులో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆవాస్తవమని రోహిత్ తల్లి రాధిక చెప్పారు. ఆమె శుక్రవారం రోహిత్ స్నేహితులతో కలసి ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ తన కుమారుడి ఆత్మహత్య ఉదంతాన్ని స్మృతి ఇరానీ ఉద్దేశపూర్వకంగా పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

02/27/2016 - 00:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: భారత్ సియాచిన్ మంచు పర్వతాలపైనుంచి తన సైనిక బలగాలను ఉపసంహరించుకోబోదని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ను విశ్వసించజాలమని, భారత్ తన బలగాలను ఉపసంహరించుకుంటే సియాచిన్‌లోని వ్యూహాత్మక ప్రదేశాలను పాకిస్తాన్ ఆక్రమించుకునే అవకాశముందని ఆయన అన్నారు.

Pages