S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

09/18/2017 - 23:46

కోల్‌కతా, సెప్టెంబర్ 18: ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను ఆడేందుకు విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం మధ్యాహ్నం చెన్నై నుంచి ఇక్కడికి చేరుకుంది. తెల్ల టి-షర్టులు ధరించిన ఆటగాళ్లు విమానాశ్రయం నుంచి నేరుగా తమ హోటల్‌కు వెళ్లిపోయారు. వారి వెంట కోచ్ రవి శాస్ర్తీ, ఇతర సపోర్టింగ్ స్ట్ఫా కూడా ఉన్నారు.

09/18/2017 - 23:43

చెన్నై, సెప్టెంబర్ 18: తోటి స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు, తనకు మధ్య పరస్పర అవగాహన ఉందని, అందుకే, అనుకున్నది సాధించామని భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మొదటి వనే్డలో 30 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన అతను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, స్పిన్నర్లు ఎప్పుడూ దూకుడుగానే ఉంటారని, వికెట్లను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తారని అన్నాడు.

09/18/2017 - 23:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ విజయానికి బాటలు వేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. ఎంతో మంది అతనిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మ్యాచ్‌లో 83 పరుగులు చేసిన పాండ్య రెండు వికెట్లు కూడా కూల్చి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. వనే్డల్లో అతనికి ఇదే అత్యధిక స్కోరు.

09/18/2017 - 23:41

చెన్నై, సెప్టెంబర్ 18: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నైలోని చేపాక్ (ఎంఎ చిదంబరం) స్టేడియం కలిసొచ్చిందని చెప్పాలి. ఈ మైదానంలో ధోనీ మొత్తం ఆరు ఇన్నింగ్స్ ఆడి, 401 పరుగులు చేశాడు. ఈ స్కోరులో రెండు శతకాలు, ఒక అర్ధ శతకం ఉన్నాయి. 100.25 సగటును అతను చేపాక్‌లో నమోదు చేశాడు. మరే ఇతర మైదానంలో అతనికి ఇంత భారీ సగటు లేదు.

09/18/2017 - 23:39

చెన్నై, సెప్టెంబర్ 18: భారత్‌తో జరిగిన మొదటి వనే్డను చేజార్చుకున్నప్పటికీ, మిగతా మ్యాచ్‌లకు మెరుగైన వ్యూహాలతో సిద్ధమవుతామని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అన్నాడు. ఒక ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ మొదటి మ్యాచ్‌లో ముందుగా సిద్ధం చేసుకున్న వ్యూహాలను సక్రమంగా అమలు చేయలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు.

09/18/2017 - 23:38

టోక్యో, సెప్టెంబర్ 18: క్వాలిఫయర్స్‌తో మంగళవారం నుంచి ఇక్కడ మొదలుకానున్న జపాన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో అభిమానుల దృష్టి తెలుగు తేజం పివి సింధుపై కేంద్రీకృతమైంది. ఇటీవలే కొరియా ఓపెన్ ఫైనల్‌లో నొజోమీ ఒకుహరాను ఓడించి టైటిల్ సాధించిన 22 ఏళ్ల ఈ హైదరాబాద్ జపాన్ ఓపెన్ మొదటి రౌండ్‌లో మినాత్సు మితానీతో తలపడుతుంది.

09/18/2017 - 23:37

ఎడ్మాంటన్, సెప్టెంబర్ 18: కెనడాతో జరిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రివర్స్ సింగిల్స్‌లో కెనడా టెన్నిస్ సంచలనం డెనిస్ షపొవలోవ్‌ను ఢీకొన్న రాంకుమార్ రామనా థన్ పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.

09/18/2017 - 23:36

మిలన్, సెప్టెంబర్ 18: పౌలొ డిబలా హ్యాట్రిక్‌తో రాణించడంతో, చాంపియన్స్ లీగ్‌లో ససువొలోతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ని 3-1 తేడాతో గెల్చుకుంది. మొదటి నుంచి దూకుడుగా ఆడిన డిబలా 16వ నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. నిజానికి అంతకు ముందు, పదో నిమిషంలోనే అతని ఖాతాలో తొలి గోల్ చేరి ఉండేది. కానీ, అతను కొట్టిన బంతి గోల్ పోస్టుకు తగిలి దూరంగా వెళ్లడంతో, గోల్ రాలేదు.

09/18/2017 - 23:35

ఎడ్మాంటన్, సెప్టెంబర్ 18: కెనడాను ఓడించి, వరల్డ్ గ్రూప్ దశకు చేరుకోవడానికి ఎంత కష్టపడినా ఫలితం లేకపోయిందని భారత డేవిస్ కప్ జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేష్ భూపతి వాపోయాడు. సోమవారం రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అతను మాట్లాడుతూ, వరల్డ్ గ్రూప్‌లోకి అడుగుపెట్టే అవకాశాన్ని తృటిలో కోల్పోయామని అన్నాడు.

09/18/2017 - 02:35

సియోల్, సెప్టెంబర్ 17: ప్రపంచ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌లో తనను ఓడించిన నజోమీ ఒకుహరాపై భారత బాడ్మింటన్ స్టార్ పివి సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడ జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్‌లో 22 ఏళ్ల ఈ తెలుగు తేజం 22-20, 11-20, 20-18 తేడాతో ఒకుహరాపై విజయం సాధించి, టైటిల్‌ను అందుకుంది. ఒక గంట, 23 నిమిషాలు సాగిన ఈ పోరు ఆద్యంతం అభిమానులను అలరించింది.

Pages