S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/04/2016 - 07:16

కరాచీ: ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరలేకపోయిన పాకిస్తాన్ ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓటమిపాలైన పాక్ బుధవారం నాటి అత్యంత కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడి పరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో ఫైనల్ చేరలేకపోయింది.

03/04/2016 - 07:15

ముల్హెమ్ ఆన్ డెర్ రర్ (జర్మనీ): జర్మనీ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ 15-21, 21-6, 21-16 తేడాతో నెదర్లాండ్స్‌కు చెందిన క్వాలిఫయర్ ఎరిక్ మెజిస్‌ను 48 నిమిషాల్లో ఓడించాడు. అతను ప్రీ క్వార్టర్స్‌లో కా లాంగ్ ఆంగస్ (హాంకాంగ్)తో తలపడతాడు.

03/03/2016 - 18:29

ముంబై: టి-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా దాయాది దేశాలైన భారత్, పాక్ జట్ల మధ్య ఈనెల 19న జరగాల్సిన మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలన్నదానిపై వివాదం రేగిన విషయం తెలిసిందే. ఆరునెలల క్రితం ఖరారైన షెడ్యూల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఈ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. కాగా ఇప్పుడు ఆ వేదిక కోల్‌కతాకు మారే అవకాశం ఉంది.

03/03/2016 - 03:50

మీర్పూర్: ఆసియా కప్ టి-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో ‘పసికూన జట్టు’ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ను ఢీ కొంటున్న భారత్ ప్రయోగాలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ టోర్నీ ఫైనల్ చేరిన కారణంగా, గురువారం నాటి మ్యాచ్ ఫలితం వల్ల టీమిండియాకు ప్రత్యేకించిన లాభనష్టాలేవీ ఉండవు.

03/03/2016 - 03:48

కరాచీ: టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్‌తో ఈనెల 19న జరిగే మ్యాచ్‌లో ఆడొద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మాజీ చీఫ్ ఇషాన్ మణి హితవు పలికాడు. ఈ మ్యాచ్‌కి భద్రత కల్పించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీర్‌భద్ర సింగ్ స్పష్టం చేసిన విషయాన్ని అతను పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ, ఇది ఆషామాషీ ప్రకటన కాదని అన్నాడు.

03/03/2016 - 00:43

మల్హెమ్ ఆన్ డెర్ రూ (జర్మనీ): ఇక్కడ జరుగుతున్న జర్మనీ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ శుభారంభం చేశారు. ఈఏడాది జనవరిలో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకున్న శ్రీకాంత్ ఇక్కడ మొదటి రౌండ్‌లో జపాన్ క్రీడాకారుడు తకుమా ఉయేదాను 12-21, 21-18, 21-11 తేడాతో ఓడించడం ద్వారా టైటిల్ రేసును ఆరంభించాడు.

03/03/2016 - 00:41

లాస్ ఏంజిల్స్: ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ ఎట్టకేలకు తన పంతం వీడి రాజీకొచ్చింది. వచ్చే వారం ప్రారంభం కానున్న ఇండియన్ వెల్స్‌లో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ టోర్నీలో ఆడరాదని 15 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంపై యూటర్న్ తీసుకుంది. 2001లో అక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు వీనస్, ఆమె సోదరి సెరెనా విలియమ్స్‌లను ప్రేక్షకులు హేళన చేశారు.

03/03/2016 - 00:40

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించడం అనుకున్నంత సులభం కాదని, అక్కడ తమకు సవాళ్లు తప్పవని భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా వ్యాఖ్యానించింది.

03/02/2016 - 07:28

మీర్పూర్: ఆసియా చాంపియన్‌షిప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా, ఐదు వికెట్లు కోల్పోయి గమ్యాన్ని చేరింది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు.

03/02/2016 - 07:26

ధర్మశాల: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య టి-20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌పై సందేహాలు ముసురుకున్నాయి. సహజంగానే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య జరుగుతుంది. దీనికితోడు టి-20 వరల్డ్ కప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీ కావడంతో అంచనాలు మరింత భారీగా ఉంటాయి.

Pages