S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/27/2016 - 03:35

స్టెల్లెన్‌బాష్ (దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా పర్యటనలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న భారత మహిళా హాకీ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ను 5-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రథమార్థం ముగిసే సమయానికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.

02/27/2016 - 03:34

పుణే, ఫిబ్రవరి 26: రంజీ ట్రోఫీ క్రికెట్‌లో మాజీ చాంపియన్ ముంబయి రికార్డు స్థాయిలో 41వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. పుణేలోని ఎంసిఎ (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్) గ్రౌండ్‌లో జరిగిన ఫైనల్‌లో ఆ జట్టు ఇన్నింగ్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించి కేవలం మూడు రోజుల్లోనే సౌరాష్ట్ర జట్టును మట్టికరిపించింది.

02/27/2016 - 03:32

మీర్పూర్, ఫిబ్రవరి 26: ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రస్తుతం శ్రీలంక జట్టుకు సారథ్యం వహిస్తున్న స్ట్రైక్ బౌలర్ లసిత్ మలింగ వచ్చే నెల భారత్‌లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్ టి-20 టోర్నీ ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

02/27/2016 - 03:31

మీర్పూర్, ఫిబ్రవరి 26: ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ ఎట్టకేలకు బోణీ చేసింది. ఈ టోర్నీలో ఇంతకుముందు టీమిండియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆ జట్టు తాజాగా శుక్రవారం మీర్పూర్‌లో జరిగిన పోరులో పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)ను 51 పరుగుల తేడాతో మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది.

02/27/2016 - 03:30

రాంచీ, ఫిబ్రవరి 26: శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌ను భారత మహిళా జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో ఇంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత జట్టు తాజాగా శనివారం రాంచీలో జరిగిన చివరి మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పర్యాటక జట్టును మట్టికరిపించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు లంకేయులను సమర్ధవంతంగా ప్రతిఘటించింది.

02/27/2016 - 03:29

ఫతుల్లా, ఫిబ్రవరి 26: ఆసియా కప్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో హై-ఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత జట్టు శుక్రవారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేసింది. అయితే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా ఈ సాధనకు హాజరు కాలేదు.

02/26/2016 - 09:22

జ్యూరిచ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా)పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన సెప్ బ్లాటర్ శకం ముగియనుంది. ఈనెల 26న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఫిఫా రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో, బ్లాటర్ హయాం ముగియనుంది. ఫిఫా ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీతోపాటు బ్లాటర్‌పైనా ఎనిమిదేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. తమకు విధించిన శిక్షను వీరిద్దరూ సవాలు చేస్తూ ఫిఫా అప్పీల్స్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు.

02/26/2016 - 06:57

జ్యూరిచ్: ఫిఫా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ఐదుగురు అభ్యర్థులు ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్, సల్మాన్ బిన్ ఇబ్రహీం ఖలీఫా, జెరోమ్ చాంపేంజ్, టోక్యో సెక్స్‌వెల్, గియానీ ఇన్ఫాటినో అస్తశ్రస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. శుక్రవారం జరిగబోయే ఎన్నికల్లో పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎవరికివారే ఎత్తుగడల్లో మునిగితేలుతున్నారు.

02/26/2016 - 06:57

ఢాకా: ఆసియా కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో తలపడిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) చివరి వరకూ పోరాడింది. ఓటమి పాలైనప్పటికీ, బలమైన ప్రత్యర్థికి తీవ్ర స్థాయలో పోటీనివ్వడం అందరినీ ఆకట్టుకుంది. టాస్ గెలిచిన యుఎఇ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో ఎ నిమిది వికెట్లు కోల్పోయ 129 పరుగులు చేసింది.

02/26/2016 - 07:36

పుణె: ముంబయితో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సౌరాష్ట్ర ఎదురుదాడికి దిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌటైనప్పటికీ, ఆతర్వాత బౌలింగ్‌లో రాణించింది. మ్యాచ్ రెండో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి ముంబయి మొదటి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లకు 262 పరుగులకు కట్టడి చేసింది. 8 వికెట్లకు 192 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం మొదటి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర 235 పరుగులకు ఆలౌటైంది.

Pages