S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/24/2016 - 07:28

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. అంతేగాక, టెస్టు ఫార్మెట్‌లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను ఖాయం చేసుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 135 పరుగులు వెనుకంజలో ఉన్న కివీస్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, మ్యాచ్ మూడో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 121 పరుగులు చేసంది.

02/23/2016 - 08:13

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 505 పరుగుల భారీ స్కోరు సాధించిన ఆస్ట్రేలియా పట్టు బిగించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి 121 పరుగులు చేసింది. ఆ జట్టు ఇంకా 14 పరుగులు వెనుకంజలో ఉండగా, ఆరు వికెట్లు చేతిలో ఉన్నాయి.

02/23/2016 - 08:10

రియో డి జెనీరియో: ఇటలీ క్రీడాకారిణి, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ ఫ్రాన్సిస్కా షియవోన్ లేటు వయసులో టైటిల్ సాధించి తన ఫిట్నెస్‌ను నిరూపించుకుంది. 36 ఏళ్ల ఆమె 2013లో చివరి టైటిల్ గెల్చుకుంది. సుమారు మూడేళ్ల తర్వాత, ఇక్కడ జరిగిన రియో ఓపెన్ ఫైనల్‌లో అమెరికాకు చెందిన షెల్బీ రోజర్స్‌ను 2-6, 6-2, 6-2 తేడాతో ఓడించి టైటిల్ అందుకుంది.

02/23/2016 - 08:10

ముంబయి: దేశంలో క్రికెట్ రంగాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో లోధా కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయడానికి ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) సిద్ధంగా లేదు. ఈ సిఫార్సులను వెంటనే అమలు చేయాలంటూ సుప్రీం కోర్టు ఇటీవలే సూచించగా, వాటిలోని కొన్ని అంశాలు ఆరచణ యోగ్యంగా లేవని శరద్ పవార్ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ఎంసిఎ వాదిస్తున్నది.

02/23/2016 - 08:09

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తి, మూడు ఫైట్స్‌లో విజయాలను సాధించిన విజేందర్ సింగ్ టైటిల్ ఫైట్ జూన్ 11న ఉండవచ్చని సమాచారం. ఇక్కడి ఇందిరా గాంధీ స్టేడియంలో ప్రొఫెషనల్ బాక్సింగ్ టైటిల్ ఫైట్‌ను నిర్వహించడానికి ప్రపంచ బాక్సింగ్ సంస్థ (డబ్ల్యుబివో) అంగీకరించినట్టు విజేందర్‌కు ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ఫ్రాన్సిస్ వారెన్ ఒక ప్రకటనలో తెలిపాడు.

02/23/2016 - 08:08

సిడ్నీ: భారత సంతతికి చెందిన అర్జున్ నాయర్ ఆస్ట్రేలియాలోని మేటి క్రికెట్ క్లబ్ న్యూ సౌత్ వేల్స్ (ఎన్‌ఎస్‌డబ్ల్యు)లో చోటు దక్కించుకున్నాడు. 17 ఏళ్ల అర్జున్ ఆఫ్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. ‘దూస్రా’లను సంధించడంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. గురువారం నుంచి రెడ్‌బ్యాక్స్‌తో కాఫ్స్ హార్బర్‌లో జరిగే మ్యాచ్‌లో అర్జున్ ఆడే అవకాశాలున్నాయి.

02/23/2016 - 08:06

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ ఖాతాలో చాలా రికార్డులే ఉన్నాయ. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించుకున్న మెక్‌కలమ్ ఆస్ట్రేలియాతో సిరీస్ ఆరంభానికి ముందు 99 టెస్టులు ఆడాడు. తాజా సిరీస్‌లో తొలి టెస్టు అతనికి కెరీర్‌లో వందవది.

02/22/2016 - 04:31

రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టైటిల్‌ను జేపీ పంజాబ్ వారియర్స్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కళింగ లాన్సర్స్‌ను ఢీకొన్న ఈ జట్టు 6-1 తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. లీగ్ దశ ముగిసే సమయానికి 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించిన హాట్ ఫేవరిట్ రాంచీ రేస్‌ను ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఓడించిన ఢిల్లీ వేవ్‌రైడర్స్ మూడో స్థానాన్ని ఆక్రమించింది.

02/22/2016 - 04:29

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు సాకేత్ మైనేని రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు. ఫైనల్‌లో ఫ్రాన్స్‌కుచెందిన స్ట్ఫిన్ రాబర్ట్‌ను ఢీకొన్న అతను 3-6, 0-6 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మొదటి సెట్‌లో సాకేత్ నుంచి కొద్దిపాటి ప్రతిఘటన ఎదురైనప్పటికీ దానిని సమర్థంగా అధిగమించిన రాబర్ట్ రెండో సెట్‌లో చెలరేగిపోయాడు.

02/22/2016 - 04:27

కోల్‌కతా: ఒకే ప్రశ్నను ఎన్నిసార్లు మార్చిమార్చి అడిగినా తన సమాధానంలో మార్పు ఉండదని రిటైర్మెంట్‌పై భారత పరిమిత ఓవర్ల జట్ల కె ప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ధోనీపై విలేఖరులు రిటైర్మెంట్ గురించి పదేపదే ప్రశ్నించడంతో అతను స్పందిస్తూ, ఎన్నిసార్లు అడిగినా తన సమాధానం ఒకటేనని వ్యాఖ్యానించాడు.

Pages