S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/09/2017 - 02:28

తిరుపతి, జూన్ 8: తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న జ్యేష్ఠ్భాషేకంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపుకవచంతో మెరిసిపోయారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో గల కల్యాణ మండపంలో జరుగుతున్న జ్యేష్ఠ్భాషేకం గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు హోమాలు, స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు.

06/09/2017 - 01:58

హైదరాబాద్, జూన్ 8: వచ్చే నెల జూలై నుంచి అమలులోకి రానున్న ఏకీకృత పన్ను విధానం (జిఎస్‌టి) వల్ల రాష్ట్రానికి అదనంగా రూ. 9 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆదాయ పన్ను వృద్ధి రేటులో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణకు ఏకీకృత పన్ను విధానం వల్ల నష్టం వాటిల్లుతుందని మొదట ప్రభుత్వం అంచనా వేసింది.

06/09/2017 - 01:56

హైదరాబాద్, జూన్ 8: రాష్ట్రంలో రైతుకు మద్దతు ధర సమస్య తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మార్కెట్‌లో రైతన్నకు గిట్టుబాటు ధర లభించని పక్షంలో ప్రభుత్వం తరపున మద్దతు ధర చెల్లించడానికి ఈ నిధిని వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.

06/09/2017 - 01:36

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం ముదిరింది. తమకు ఆంధ్రప్రదేశ్ రూ. 1676కోట్ల బకాయిలను వెంటనే చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో లేఖ రాసింది. అంతకు ముందు ఆంధ్ర ట్రాన్స్‌కో తమకు రూ.

06/09/2017 - 01:34

ఏలూరు, జూన్ 8: ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గురువారం చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కాఫర్ డ్యామ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అక్కడే నిర్మించే ఐకానిక్‌బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేశారు. పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లటం తనకెంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

06/09/2017 - 01:31

కాకినాడ, జూన్ 8: రాష్ట్రంలో పేదరికంపై తాను నిరంతరం పోరాడుతున్నానని, పేదరికమే తన కులమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు పేదల కోసం జీవిస్తానని ఆయన అన్నారు. పేదరికాన్ని జయించి తీరుతామన్నారు. నవ నిర్మాణ దీక్ష సందర్భంగా తాను చేపట్టిన మహా సంకల్పాన్ని భగవద్గీతగా భావించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన సంకల్పాన్ని బైబిల్, ఖురాన్‌గా స్వీకరించాలని కోరారు.

06/09/2017 - 03:20

కూచిపూడి, జూన్ 8: నాట్యక్షేత్రం కృష్ణా జిల్లా కూచిపూడిలోని నాట్య పుష్కరిణిలో నాట్య గురువుల నృత్యప్రదర్శనలు కళాభిమానులు, కళాకారులను ఆకట్టుకున్నాయి.

06/09/2017 - 00:47

హైదరాబాద్, జూన్ 8: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న ఓ అధికారికి మూడేళ్లు జైలు శిక్ష పడింది. అక్రమార్జనకు జరిమానాగా రూ.5 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా పాల్వంచ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిన పిట్ట ప్రతాప్ ఆ సమయంలో చేతికి దొరికినంత మేరకు లంచాలు దండుకుని, వాటిని ఆస్తుల రూపంలోకి మార్చాడు. కానీ సక్రమంగా మార్చుకోలేక ఏసిబి అధికారులకు చిక్కాడు.

06/08/2017 - 02:41

అమరావతి, జూన్ 7: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన సందర్భం భవిష్యత్ ఏమిటో తెలియని ఒక శూన్యంలోకి రాష్ట్రాన్ని నెట్టింది. 16వేల కోట్ల లోటు బడ్జెట్. రాజధాని లేని అనాథ. రెండేళ్లు హైదరాబాద్‌కే పరిమితమైన అధికారులు. హోదా హామీకి తూట్లు..అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు అడ్డంకులు. సాగునీరు ప్రాజెక్టుల్లో లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు. ఇసుక దందాలో తమ్ముళ్ల దూకుడు. తాజా విశాఖ వరకూ భూముల కబ్జా ఆరోపణలు.

06/08/2017 - 02:40

అనంతపురం, జూన్ 7: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుతుపవనాలు రాయలసీమ జిల్లాలను బుధవారం తాకాయి. దీంతో చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాను నైరుతి రుతుపవనాలు తాకినట్టు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

Pages