S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/12/2017 - 01:41

విజయవాడ, జూన్ 11: రాష్ట్రంలోని జిల్లా, సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో విస్తరిస్తున్న అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వాతంత్య్రానంతర కాలం నుంచి ట్రెజరీల ద్వారా వెళ్లిన బిల్లులకు బ్యాంక్‌ల నుంచి నేరుగా చెల్లింపులు జరుగుతుంటే దేశవ్యాప్తంగా రెండేళ్ల నుంచి ‘కార్పొరేట్ నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్’ అమల్లోకి వచ్చింది.

06/12/2017 - 01:39

విజయవాడ, జూన్ 11: రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో 2017-18 నూతన విద్యా సంవత్సరంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలు ఉద్రిక్త పరిస్థితుల్లో పునఃప్రారంభం కాబోతున్నాయి. వేసవి సెలవుల్లోనే బదిలీలు జరగాలంటూ అన్ని ఉపాధ్యాయ సంఘాలు గత విద్యా సంవత్సరం ముగియటానికి ముందునుంచే ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దొడ్డిదారిన బదిలీలు చేయటంపై ఆయా సంఘాలు భగ్గుమన్నాయి.

06/12/2017 - 01:38

హైదరాబాద్, జూన్ 11: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బంధం తెగిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరాను నిలిపివేశాయి. బకాయిల పేరుతో రెండు రాష్ట్రాల మధ్య రేగిన వివాదం తెగేదాకా సాగింది. దీని ప్రభావం ఆగస్టులో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది.

06/12/2017 - 01:36

హైదరాబాద్/విజయవాడ, జూన్ 11: ఐఐటి-జెఇఇ 2017 అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చూపించారు. మద్రాస్ ఐఐటి ఈ పరీక్షలను నిర్వహించింది. ఎపి ఎంసెట్‌లో మొదటి ర్యాంక్, తెలంగాణ ఎంసెట్‌లో 5వ ర్యాంక్ సాధించిన మోహన్ అభ్యాస్‌కు ఐఐటి జెఇఇలో 64వ ర్యాంక్ లభించింది. తెలంగాణ ఎంసెట్‌లో 10వ ర్యాంక్ సాధించిన నిఖిల్‌కు ఐఐటి-జెఇఇలో 248వ ర్యాంక్ లభించింది.

06/12/2017 - 00:42

హైదరాబాద్, జూన్ 11: హైదరాబాద్‌లోని భోజగుట్ట భూముల అన్యాక్రాంతంపై సిసిఎస్ పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. వివిధ సర్వే నెంబర్లలో ఉన్న దాదాపు 900 ఎకరాలు కబ్జాకు యత్నించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కీలక సూత్రధారి శైలేష్ సక్సేనా, అతని అనుచరుడు శ్రీనివాసరావుగా గుర్తించారు.

06/11/2017 - 23:41

హైదరాబాద్, జూన్ 10: ప్రయాణికుల సౌకర్యార్థం ఈనెల 11 నుంచి చెన్నై ఎగ్మూర్-శాంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. ట్రైన్ నెం. 06078 చెన్నై ఎగ్‌మోర్ ప్రత్యేక రైలు ఆదివారం రా.గం. 23:35లకు బయలుదేరి మరుసటి రోజు ఉ.గం.

06/11/2017 - 05:12

హైదరాబాద్, జూన్ 10: ప్రేమ వివాహాలకు సంబంధించి యువతీ, యువకుడు మేజర్లని రుజువు ఉంటే ఎఫ్‌ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)ను నమోదు చేయవద్దని హైకోర్టు రెండు రాష్ట్రాల డిజిపిలను ఆదేశించింది. ఈ సమాచారాన్ని రెండు రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లకు అందించాలని హైకోర్టు ఆదేశించింది.

06/11/2017 - 02:55

సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు నల్లగొండ జిల్లా

06/11/2017 - 02:53

యాదగిరిగుట్ట, జూన్ 10: ప్రేమించాడు.. పెళ్లి చేసుకోమన్నాడు.. ఆమె కాదంది. పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని చేసుకోవటానికి సిద్ధపడింది. ఒక్కసారిగా అతనిలో ఉన్మాది నిద్రలేచాడు. తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదనుకున్నాడు. విచక్షణ కోల్పోయాడు. కత్తితో ప్రియురాలిపై దాడిచేసాడు. ఎక్కడపడితే అక్కడ పోట్లు పొడిచాడు.. అతని పైశాచికత్వానికి ఆమె బలైపోయింది. అతను తాపీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు..

06/11/2017 - 03:06

హైదరాబాద్, జూన్ 10: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, హఫీజ్‌నగర్ రెవెన్యూ పరిథిలోని దండుమైలారంలో తెరాస నేత, ఎంపీ కె. కేశవరావు కుటుంబీకులు ఖరీదు చేసిన భూముల వ్యవహారం వివాదస్పదంగాకాగా, ఈ అభియోగాలను టిఆర్‌ఎస్ ఎంపి కె కేశశరావు ఖండించారు. కెకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి (కార్పోరేటర్), కోడలు జ్యోత్స్న ఖరీదు చేసిన 50 ఎకరాలలో 38 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ప్రచారం జరుగుతున్నది.

Pages