S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/05/2017 - 03:22

గుంటూరు, జూన్ 4: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వం జాతీయ పార్టీలను పిలిచి గుంటూరు ఆంధ్రా ముస్లిం కాలేజీలో నిర్వహించిన ‘ప్రత్యేక హోదా భరోసా సభ’ జనం లేక వెలవెల పోయింది. అటు నైరాశ్యంలో ఉన్న పార్టీ కార్యకర్తలకూ భవిష్యత్తుపై భరోసా ఇవ్వకపోయింది.

06/05/2017 - 03:21

గుంటూరు, జూన్ 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చేంతవరకు విశ్రమించేదిలేదని కాంగ్రెస్ సహా పలు జాతీయ పార్టీల నేతలు తేల్చిచెప్పారు. ఆదివారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాల ఆవరణలో ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా భరోసా సభకు సిపిఐ, జనతాదళ్ (యు), సమాజ్‌వాదీ పార్టీ, డిఎంకె, ఐయుఆర్‌ఎంఎల్, తదితర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు హాజరై సంఘీభావం తెలిపారు.

06/05/2017 - 02:50

హైదరాబాద్, జూన్ 4: ఏ సర్వే చూసినా ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా వస్తున్నదని, ఎప్పుడు, ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపికే అధికారం లభిస్తుందని బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.

06/04/2017 - 01:49

విజయవాడ, జూన్ 3: భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరాగాంధీ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని 1983లో అత్యధిక సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన నందమూరి తారక రామారావు అదే ఉత్సాహంతో దేశవ్యాప్తంగా అధికారపక్ష కాంగ్రెసేతర పక్షాలన్నింటిని ఏకం చేసేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా అదే సంవత్సరం విజయవాడలో జరిగిన తొలి మహానాడును తగిన వేదికగా కూడా మలువగల్గారు.

06/04/2017 - 01:44

గుంటూరు, జూన్ 3: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌పై ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. విభజన అనంతరం గత సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్‌కు పూర్వవైభవాన్ని సంతరింప చేసేందుకు ప్రత్యేక హోదా అంశంతో ఉనికిని చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

06/03/2017 - 01:20

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ గ్రూప్-2, 2011నాటి గ్రూప్-1 పోస్టుల ఎంపిక పరీక్ష ఫలితాలను ప్రకటించింది. 2011లో ఇచ్చిన నోటిఫికేషన్ 15 లిమిటెడ్, నోటిఫికేషన్-18 ప్రకారం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుమేరకు ఇరు తెలుగు రాష్ట్రాలు మళ్లీ పరీక్షలు నిర్వహించాయి. తెలంగాణలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను శుక్రవారం వెబ్‌పోర్టల్‌లో ఉంచారు.

06/03/2017 - 01:18

హైదరాబాద్/ గచ్చిబౌలి/ శేరిలింగంపల్లి/ వనస్ధలిపురం, జూన్ 2: తెలంగాణను కుదిపేస్తోన్న భూస్కాం రోజుకో మలుపుతిరుగుతోంది. కేసులో రాష్టవ్య్రాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, వీరితో కుమ్మక్కై ప్రభుత్వ భూముల స్వాహాకు పాల్పడిన పెద్దల భాగోతాన్ని రట్టు చేసేందుకు ఏసిబి పరుగులు పెడుతోంది. ఇదిలాఉండగా మియాపూర్ భూముల అవకతవకలపై లోతుగా దర్యాప్తు చేయనున్నట్టు సిపి సందీప్ శాండిల్య ప్రకటించారు.

06/02/2017 - 01:21

సంగారెడ్డి, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సిఎం కెసి ఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురికోసమేనా అని ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణ ఎందుకు ఏర్పడిందో మూడేళ్లు గడిచిన తరువాత కూడా ఆ లక్ష్యం నెరవేరలేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే, బంగారు తెలంగాణను సాధించాలంటే 2019లో కాంగ్రెస్‌కు అధికారం అప్పగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

06/01/2017 - 06:53

తిరుపతి, మే 31: తిరుమలలో వృద్ధులు, వికలాంగులకు మరింత సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఎస్వీ మ్యూజియం ఎదురుగా ప్రత్యేకంగా టోకెన్ కౌంటర్లను బుధవారం టిటిడి ప్రారంభించింది. టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు ఈ కౌంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ రోజుకు రెండు స్లాట్లలో దాదాపు 1500 మంది వృద్ధులు, వికలాంగులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.

06/01/2017 - 04:23

హైదరాబాద్, మే 31: హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు డెడ్‌లైన్ 2017 జూన్ 2వ తేదీతో ముగుస్తుంది. ఆ తేదీ లోపల వచ్చి అక్కడ రిపోర్టు ఇచ్చిన వారి పిల్లలకు స్థానికత వస్తుంది. ఈ నిబంధన ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ఉద్యోగులకు ఈ వెసులుబాటును కల్పిస్తూ రాష్టప్రతి గత ఏడాది ఉత్తర్వులు ఇచ్చారు.

Pages