S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/14/2016 - 05:03

హైదరాబాద్, జూన్ 13: వయోధిక పాత్రికేయుడు, తొలితరం తెలంగాణ పాత్రికేయ ఉద్యమకారుడు, రచయిత కెఎల్ రెడ్డిని అన్ని విధాలుగా ఆదుకోవడానికి సిఎం కె చంద్రశేఖర్‌రావు రూ. 15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం కెఎల్ రెడ్డిని స్వయంగా పిలిపించుకొని ముఖ్యమంత్రి చెక్ అందజేశారు.

06/14/2016 - 04:51

హైదరాబాద్, జూన్ 13:కాపునేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటివరకూ చర్చలకు వెళ్లకపోవడం, ముద్రగడ ఆహారం తీసుకోవడానికి, వైద్య సేవలకు నిరాకరించడం కాపువర్గంలో కలవరం కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోనూ కాపు నేతల నిరసనలు విస్తరించడం చూస్తే, భవిష్యత్తు పరిణామాలు నవ్యాంధ్రపై ప్రభావం చూపుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

06/14/2016 - 04:46

హైదరాబాద్, జూన్ 13: నైరుతీ రుతుపవనాలు రాయలసీమ జిల్లాల వరకు వచ్చి ఆగిపోయాయి. గత మూడు రోజుల నుంచి ఇవి కర్నాటకలోని కార్వార్, గదగ్, ఏపీలోని ఒంగోలు వద్ద స్థిరంగా ఉన్నాయి. తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలవైపు ముందుకు కదలడం లేదు. మరో రెండు మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శాస్తవ్రేత్త బిపి యాదవ్ తెలిపారు.

06/14/2016 - 04:44

విజయవాడ, జూన్ 13: అమరావతికి ఉద్యోగులు తరలివచ్చే ప్రక్రియకు కౌంట్‌డౌన్ ప్రారంభమవడంతో ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఉద్యోగుల తరలింపునకు సంబంధించి తాజాగా విధివిధానాలు జారీ చేసింది. సిఎస్ టక్కర్‌తో సోమవారం జరిగిన సమావేశంలో సిఎం చంద్రబాబు క్షుణ్ణంగా చర్చించారు. అనంతరం సోమవారం రాత్రి పొద్దుపోయాక విధివిధానాలను విడుదల చేశారు.

06/14/2016 - 03:42

హైదరాబాద్, జూన్ 13: కాపునేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై కాపు అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యాచరణపై తొలిసారిగా సోమవారం సాయంత్రం పార్క్‌హయత్ హోటల్‌లో నిర్వహించిన కాపునేతల సమావేశంలో ముద్రగడ వ్యవహారంపై లోతుగా చర్చించారు.

06/13/2016 - 04:15

హైదరాబాద్, జూన్ 12 : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కలిసి ప్రపంచశాంతికి పునాదులు వేయాలని విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, మోదీ ఇటీవల అమెరికా పర్యటన వల్ల ప్రపంచశాంతికి బాటలు వేసినట్టయిందన్నారు.

06/13/2016 - 04:13

తిరుమల, జూన్ 12: తిరుమలలో ఆదివారం కూడా రద్దీ కొనసాగింది. వారాంతపు, వేసవి చివరి సెలవులు కావడంతో భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో గత మూడు రోజులుగా ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ఒక్కరోజే దాదాపు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

06/13/2016 - 04:10

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణాలో కాంగ్రెస్ నేతల తీరుపై అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు, మాజీ ఎంపీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోతుంటే టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారా? అని అధినేత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

06/13/2016 - 04:03

హైదరాబాద్, జూన్ 12: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తులను పట్టుకోవడంలోనూ, ట్రాఫిక్ ఉల్లం‘ఘను’లకు బ్రేక్ వేసేందుకు సైబరాబాద్ పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మూడవ కంటితో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పరిజ్ఞానాన్ని అమ్ముల పొదిలో చేర్చుకున్నారు. జంట నగరాల్లో కళ్లజోళ్లతో పటిష్ట నిఘా పెంచారు.

,
06/13/2016 - 04:00

హైదరాబాద్, జూన్ 12:కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కలిశారు. వీరిద్దరూ టిఆర్‌ఎస్‌లో చేరనున్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు టిఆర్‌ఎస్‌లో చేరేందుకు గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.

Pages