S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/14/2016 - 05:38

హైదరాబాద్, జూన్ 13: హైదరాబాద్ మరో అంతర్జాతీయ వేడుకకు వేదిక కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 15 వరకు ఆసియా-పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ యూనియన్ అంతర్జాతీయ నృత్యోత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. శిల్ప కళా వేదికలో నిర్వహించనున్న ఈ వేడుకకు చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో సోమవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధితశాఖల అధికారులతో సమావేశమయ్యారు.

06/14/2016 - 05:37

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో వంశపారంపర్య అర్చకత్వ నిబంధనలను (కొత్త సర్వీస్ రూల్స్‌ను) అమలు చేయాలని అర్చకులు కోరుతున్నారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ‘ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ హెరిడిటీ అర్చకా క్వాలిఫికేషన్స్ అండ్ ఎండోమెంట్ రూల్స్, 2015’ను తక్షణమే ఆమోదించి అమలు చేయాలని అర్చక సంఘాలు కోరుతున్నాయి.

06/14/2016 - 05:36

విజయవాడ, జూన్ 13: మరో అంతర్జాతీయ సదస్సుకు విజయవాడ వేదిక కాబోతోంది. వచ్చే నెల 10న నగరంలో ఇంటెలిజెంట్ హెల్త్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు. ఈ సదస్సులో సుమారు 500కి పైగా దేశ, విదేశీ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. సదస్సులో వైద్య ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు.

06/14/2016 - 05:34

న్యూఢిల్లీ, జూన్ 13: అమెరికాలోని తెలంగాణ వాదులు సైతం రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తెజావత్ అన్నారు. తెజావత్ ఢిల్లీలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొన్నట్లు చెప్పారు.

06/14/2016 - 05:33

విశాఖపట్నం, జూన్ 13: స్వచ్ఛ్భారత్ మిషన్ (గ్రామీణ) కింద ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, దాని ప్రభావం అంతంతమాత్రంగా ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరుగు కోసం ఇంకా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరం. దేశవ్యాప్తంగా నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ సర్వే నిర్వహించి స్వచ్ఛ స్టేటస్ రిపోర్టును ఇటీవల ప్రచురించింది.

06/14/2016 - 05:18

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల ఆందోళనకు ఎట్టకేలకు రెండు రాష్ట్రాలు స్పందించాయి. దీంతో తెలంగాణ ఉద్యోగులను ఆంధ్ర ప్రభుత్వం సోమవారం రిలీవ్ చేసింది. వారందరనీ విధుల్లో చేర్చుకోవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం వెనువెంటనే ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళనకు తెరపడింది.

06/14/2016 - 05:17

రాజమహేంద్రవరం, జూన్ 13: నిరాహార దీక్ష కొనసాగిస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్య మ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న దీక్ష సోమవారం ఐదో రోజుకు చేరుకుంది. బలవంతంగానైనా ఆయనకు వైద్య సేవలు అందించాల్సిందేనని, లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదముందని వైద్యులు ప్రకటించారు.

06/14/2016 - 05:16

గుంటూరు, జూన్ 13:హెచ్‌ఓడిల తరలింపు మొదలైంది. గుంటూరు మార్కెట్ యార్డులో మార్కెటింగ్ శాఖ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో ఉద్యోగినులతో సహా 50 మంది డైరెక్టరేట్ ఉద్యోగులు ఫర్నిచర్ సహా చేరుకున్నారు.

06/14/2016 - 05:11

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలో పార్టీని నడిపించే నాయకుడు ఎవరు? ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలను రూపొందించుకుని జిల్లా పర్యటనలకు వెళుతున్నారు? మేము ఎవరి నాయకత్వంలో పని చేయాలి? అని టి.టిడిపి నాయకుడు ఒకరు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.

06/14/2016 - 05:06

హైదరాబాద్, జూన్ 13: కాంగ్రెస్, సిపిఐ పార్టీలకు పెద్ద కుదుపు. నల్లగొండ జిల్లాలో తెరాసకు గట్టి మద్దతు లభించింది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పట్టు సాధించిన తెరాసకు నల్లగొండ జిల్లాయే ఇప్పటి వరకూ సమస్యగా ఉంది. ఇప్పుడు ఆ జిల్లా నుంచి ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్కేస్తుండటంతో, జిల్లాలో తెరాసకు తిరుగులేని మద్దతు లభించినట్టయ్యింది.

Pages