S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/12/2016 - 05:54

హైదరాబాద్, జూన్ 11: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభం పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని, ముద్రగడను కాపాడాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాది సతీష్ గల్లా శనివారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కిర్లంపూడిలో దీక్షను ప్రారంభించిన రోజు ముద్రగడ పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారని ఆయన కోర్టుకు తెలిపారు.

06/12/2016 - 05:53

హైదరాబాద్/ ముషీరాబాద్, జూన్ 11: స్కూల్ ఫీజులను నియంత్రించాలని, విద్యాసంస్థల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని కోరుతూ శనివారం ఇందిరాపార్కు వద్ద స్కూల్ ఫీజుల నియంత్రణ కమిటీల జాయింట్ యాక్షన్ కమిటీ మహాధర్నా నిర్వహించింది. జాక్ నేతలు అరవింద్ జటా, నాగటి నారాయణ సహా వందలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, నాయకులు, ఎన్‌జిఓ ప్రతినిధులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

06/12/2016 - 05:51

హైదరాబాద్, జూన్ 11: హైదరాబాద్ పాత బస్తీలో దారుణం చోటుచేసుకుంది. కబూతర్ ఖానాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం శ్లాబ్ కూలిపోయింది. శుక్రవారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు.

06/12/2016 - 05:48

హైదరాబాద్, జూన్ 11: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ అంటే మంత్రికి తక్కువ, ఎమ్మెల్యేకు ఎక్కువ అన్నమాట.. కొండొకచో ఎమ్మెల్యే అయినా కాస్త తగ్గుతారేమో తప్ప హైదరాబాద్ కార్పొరేటర్ సీనే వేరు. ఓ మినీ మినిస్టర్ అన్నమాట.. బుగ్గకారు ఉన్నా లేకున్నా.. కారు నెంబర్ ప్లేట్‌పై రెడ్ స్టిక్కర్‌తో ‘జిహెచ్‌ఎంసి కార్పొరేటర్’ అని ఉంటే చాలు, ఆ డాబూ దర్పం తీరు చెప్పనక్కరలేదు. మడతలు లేని తెలతెల్లని ఖాదీ వస్త్రాలు..

06/12/2016 - 05:37

హైదరాబాద్, జూన్ 11: ఉపాధి కోసం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లే తెలంగాణ యువత కోసం ఎన్‌ఆర్‌ఐ పాలసీకి రూపకల్పన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఐటి శాఖ మంత్రి కె తారక రామారావుకు ఎన్‌ఆర్‌ఐ విభాగం బాధ్యతలు సైతం అప్పగించారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీకి రూపకల్పన చేయాలని ఐటి మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్‌ఆర్‌ఐ పాలసీలు ఉన్నాయి.

06/12/2016 - 05:33

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్డు సేఫ్టీ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రవాణా శాఖ ప్రతిపాదించిన కార్యాచరణ ప్రణాళికను ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. రోడ్డు సేఫ్టీ అథారిటీకి తొలి దశలో రూ. 40 కోట్లను కేటాయించేందుకు ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 2014లో రోడ్డు ప్రమాదాల్లో 6906 మంది మృతి చెందారు. 2015లో 7110 మంది మరణించారు.

06/12/2016 - 05:31

హైదరాబాద్, జూన్ 11: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూరె్తైన తరువాతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్టు తెలిసింది. తెలంగాణ ఆవిర్భావం, తెరాస ప్రభుత్వ ఏర్పాటు జరిగి రెండేళ్లవుతోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని చాలారోజులుగా ఊహాగానాలు సాగుతున్నా, ముఖ్యమంత్రి మాత్రం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదు.

06/12/2016 - 05:30

హైదరాబాద్, జూన్ 11: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలను పెంచేందుకు, కాలేజీ యాజమాన్యాల దోపిడీని నివారించి గాడిలోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకున్నాయి.

06/12/2016 - 05:26

హైదరాబాద్, జూన్ 11: తెలంగాణకు కేంద్రం అందించిన ఆర్థిక సాయంపై బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షా చెప్పినవన్నీ తప్పుడు లెక్కలేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. తెరాసఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకు తెలంగాణకు 90వేల కోట్లు ఇచ్చినట్టు అమిత్‌షా చేసిన ప్రకటన వాస్తవం కాదన్నారు.

06/12/2016 - 05:20

విజయవాడ, జూన్ 11: కాపులకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం దీక్ష చేపడితే, ఆయనను బలవంతంగా అరెస్ట్ చేయడం తగదని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చిరంజీవి శనివారం బహిరంగ లేఖ రాశారు. దీక్ష చేస్తున్న ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యులపట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందని వ్యాఖ్యానించారు. అరెస్ట్‌లు ఏకపక్షంగా ఉన్నాయని ఆయన అన్నారు.

Pages