S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/13/2016 - 03:54

కాకినాడ, జూన్ 12: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పట్టు వీడటం లేదు. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆరు నూరైనా దీక్ష కొనసాగుతుందని ప్రకటించిన ముద్రగడ ఎక్కడా పట్టు సడలకుండా ముందుకు సాగటం తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష సాగిస్తోన్న ముద్రగడ వైద్య పరీక్షలకు సహకరిస్తున్నారంటూ పో లీసులు శనివారం రాత్రి ప్రకటించిన విషయం తెలిసిందే!

06/13/2016 - 03:31

హైదరాబాద్, జూన్ 12: ‘తెలంగాణ అక్షర యోధుడు’ శీర్షికన ఆంధ్రభూమి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనంపై సిఎం కె చంద్రశేఖర్‌రావు స్పందించారు. తెలంగాణ ఉద్యమానికి అక్షరాయుధాలు అందించిన కెఎల్ రెడ్డి తీరని పేదరికంతో బతుకు పోరాటం చేస్తున్నారు. మరోపక్క వృద్ధ్యాపంలో సంక్రమించిన పార్కిసన్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. కథనంతో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు.

06/13/2016 - 02:44

హైదరాబాద్, జూన్ 12: రైతుల పంట రుణాల మాఫీ కేటాయింపుల్లో ప్రభుత్వానికి భారీగా నిధులు మిగులనున్నాయి. బ్యాంకర్లకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థతోపాటు రుణ మాఫీ లబ్థిదారుల ఆధార్ కార్డుల సీడింగ్‌తో పెద్ద సంఖ్యలో డూప్లికేట్ ఖాతాల గుట్టు రట్టయ్యింది. దీంతో పంట రుణ మాఫీకి అర్హులైన వారి సంఖ్య భారీగా తగ్గనుండటంతో ప్రభుత్వానికి సుమారు రూ.1800 నుంచి రూ.

06/13/2016 - 02:41

హైదరాబాద్, జూన్ 12: మెరుగైన ఫలితాల కోసం టి-హబ్, డిఆర్‌డివోలు కలిసి పని చేస్తే మంచిదని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అభిప్రాయపడ్డారు. రెండింటి భాగస్వామ్యంతో నగరంలో డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధనలు, స్టార్టప్‌లకు మద్దతు లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటి ప్రగతిని అభినందిస్తూ కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రాష్ట్ర ఐటి మంత్రి కె తారక రామారావుకు లేఖ రాశారు.

06/13/2016 - 02:39

హైదరాబాద్, జూన్ 12: గడువులోనే ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తగిన విధంగా నీటిపారుదల శాఖ పని చేయాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు. ఎస్సారెస్పీ ఆధునీకరణ పనులను పరిగెత్తించాలని కోరారు. రీ-ఇంజనీరింగ్‌లో భాగంగా కీలకమైన ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

06/13/2016 - 02:22

హైదరాబాద్, జూన్ 12: ఏపిఎస్ ఆర్టీసి విభజన కాలేదు. ఆస్తుల పంపకం ప్రక్రియ నిలిచిపోయింది. కాని ఇక్కడ బస్‌భవన్‌లో ఉన్న ఏపి ఆర్టీసి ఉద్యోగులను ఈ నెల 27లోగా విజయవాడ బస్ హౌస్‌లో రిపోర్టు చేయాలని ఆర్టీసి ఎండి ఆదేశాలు ఇవ్వడంతో ఎంప్లారుూస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌లు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.

06/13/2016 - 02:20

హైదరాబాద్, జూన్ 12:సచివాలయం తరలింపునకు రంగం సిద్ధమైంది. ఫైళ్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రి తరలింపునకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం ఆరంచెల విధానాన్ని ఖరారు చేసింది. మరోవైపు సచివాలయంలో ఏపి ఉద్యోగులను ఎవర్ని కదిలించినా, రేపో మాపో తరలిపోక తప్పదనేట్టే మాట్లాడుతున్నారు. హైదరాబాద్‌కు వీడ్కోలు పలుకుతున్నామనే భావన వారి మాటల్లో కనిపిస్తోంది.

06/13/2016 - 02:17

విశాఖపట్నం, జూన్ 12: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఎంతమాత్రం తగదని మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టడీ మెటీరియల్, తదితర ఫీజులతో దోచుకుంటున్నాయన్నారు. ఇక మీదట ప్రైవేటు పాఠశాలల్లో ఏ తరగతికి ఎంత వసూలు చేస్తున్నదీ ఫీజుల వివరాలను వెబ్‌సైట్లో పెట్టాలని ఆదేశించారు.

06/13/2016 - 02:14

రాజమహేంద్రవరం, జూన్ 12: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం రోజు రోజుకూ క్షీణిస్తోంది. తక్షణం వైద్యం అందించాల్సి ఉందని, కానీ అందుకు ముద్రగడ అంగీకరించడం లేదని ఆదివారం హెల్త్ బులిటిన్‌లో వైద్యులు తెలిపారు. ముద్రగడ దంపతులు, కొడుకు గిరి, భార్య సిరి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. గత రాత్రి ముద్రగడ భార్య పద్మావతి, కోడలికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

,
06/13/2016 - 02:09

హైదరాబాద్, జూన్ 12: జేఈఈ అడ్వాన్స్డ్-2016 పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మిగతా జాతీయ స్థాయి పరీక్షల్లో మాదిరిగానే ఇందులో కూడా తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100 ర్యాంకుల్లో 30 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఉండడం గమనార్హం.

Pages