S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

06/05/2016 - 06:30

హైదరాబాద్, జూన్ 4 : తెలంగాణ రాష్ట్రంలో రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులు సాయంత్రం విధి నిర్వహణ నుండి ఒక గంట ముందుగా వెళ్లిపోయేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా పేరుతో శనివారం ఒక సర్క్యులర్ మెమో జారీ అయింది. రంజాన్ మాసం ఈ నెల 6 లేదా ఏడో తేదీన వస్తోందని, జూలై ఐదు వరకు ఉంటుందన్నారు.

06/05/2016 - 06:29

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివి పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 90 మంది విద్యార్ధులకు వందేమాతరం ఫౌండేషన్ విహంగ విహారం చేసే అవకాశం కల్పించింది. గత ఎనిమిదేళ్లుగా విద్యార్ధుల్లో స్ఫూర్తిని రగిలించేందుకు, పేద విద్యార్ధులకు విమానం ఎక్కే అవకాశాన్ని కల్పించేందుకు వందేమాతరం ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

06/05/2016 - 06:28

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ రాష్ట్రం మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎమ్సెట్-2కు శనివారం రాత్రికి 30వేల దరఖాస్తులు వచ్చాయి. తొలి రోజు ఆరు వేల దరఖాస్తులు రాగా రెండో రోజు దరఖాస్తుల సంఖ్య 15వేలకు పెరిగింది. మూడో రోజు నాటికి 22వేలకు, నాలుగో రోజు 30వేలకు పెరిగాయి. అబ్బాయిలు 10 వేల మంది దరఖాస్తు చేయగా, అమ్మాయిలు సుమారు 20వేల మంది దరఖాస్తు చేశారు.

06/05/2016 - 06:28

హైదరాబాద్, జూన్ 4: ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద తలపెట్టిన 9564 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ పనులు స్పీడందుకున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత స్ధాయి నిపుణులు ఈ నెలలో అణు విద్యుత్ ప్లాంట్ సైట్‌ను సందర్శించి పర్యావరణ ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా సామాజిక ప్రభావిత అంచనా అధ్యయనం కూడా చేసి కేంద్రానికి వెంటనే నివేదిక ఇవ్వనున్నారు.

06/05/2016 - 05:17

హైదరాబాద్, జూన్ 4: కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు పంపిన ముసాయిదా నోటిఫికేషన్ వివాదస్పదంగా మారింది. ముసాయిదాలోని మార్గదర్శకాలను అంగీకరించే ప్రసక్తిలేదని ముందుగా కేంద్రానికి ఫిర్యాదుచేసి, అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానం తలుపులు తట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్ర ప్రభుత్వం మాత్రం ముసాయిదా నోటిఫికేషన్‌ను అంగీకరిస్తున్నట్టు ఇప్పటికే బహిరంగంగా ప్రకటించింది.

06/05/2016 - 05:18

హైదరాబాద్, జూన్ 4: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతినేలా వ్యవహరిస్తోందని, దీన్ని సీరియస్‌గానే ఎదుర్కోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. బోర్డు వ్యవహారంపై రాష్ట్రంలోని బిజెపి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలో పర్యటిస్తున్న పార్లమెంటరీ కమిటీ దృష్టికి సైతం కృష్ణా బోర్డు వ్యవహారాన్ని తీసుకెళ్లారు.

06/05/2016 - 05:08

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్ర కాంగ్రెస్‌కు వెంటనే సర్జరీ చేయకపోతే, తరువాత పోస్టుమార్టం చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి శనివారం రాష్ట్ర మంత్రి టి.

06/05/2016 - 05:05

హైదరాబాద్, జూన్ 4: రాష్ట్రంలో పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తికి 6500 కోట్లు మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్ర జలవనరుల పార్లమెంటరీ సభ్యుల బృందం శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. తెలంగాణ విజ్ఞప్తిపై పార్లమెంటరీ బృందం సానుకూలంగా స్పందించింది. కేంద్రానికి ఈ అంశంపై తాము నివేదిక ఇస్తామని కమిటీ చైర్మన్ హుకుంసింగ్ హామీనిచ్చారు.

06/05/2016 - 05:03

హైదరాబాద్, జూన్ 4: వివిధ రంగాల్లో పరస్పర సహకారం కోసం టి-హబ్ కాలిఫోర్నియా రాష్ట్రం ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఈ అంశంపై కాలిఫోర్నియాతో గతంలోనే ఐటి మంత్రి కె తారక రామారావు ప్రాథమికంగా చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో ఉన్న కెటిఆర్ కాలిఫోర్నియా ప్రభుత్వంతో ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. కెటిఆర్ నాయకత్వంలోని బృందం, కాలిఫోర్నియ గవర్నర్ ఆఫీసు ఈమేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

06/05/2016 - 04:42

హైదరాబాద్, జూన్ 4: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలను మూడు రోజులపాటు జడివానలు ముంచెత్తనున్నాయి. రాగల 72 గంటలపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండి శాస్తవ్రేత్త ‘ఎఫ్’ (ఎన్‌డబ్ల్యుఎప్‌సి) డాక్టర్ రంజీత్ సింగ్ వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇక వేడిగాడ్పులేమీ ఉండవన్నారు.

Pages