S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/29/2016 - 03:38

కడప, మార్చి 28: నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు కడప విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నారు. అందులో భాగంగా ఏప్రిల్ 5వ తేదీ నుంచి విజయవాడకు, 8 నుంచి హైదరాబాద్, తిరుపతిలకు విమాన సర్వీసులు నడపడానికి చర్యలు పూర్తయ్యాయి. గతంలో ఈ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు విమాన రాకపోకలను కొనసాగించారు. అయితే తగినంత మంది ప్రయాణికులు లేకపోవడంతో 4 నెలల క్రితం సర్వీసులను నిలిపివేశారు.

03/29/2016 - 04:22

ఏలూరు, మార్చి 28: నదుల అనుసంధానంలో దేశంలోనే ప్రప్రథమంగా నమోదవుతున్న పట్టిసం ఎత్తిపోతల పథకం ప్రాంతం రానున్న రోజుల్లో పర్యాటకాభివృద్ధి విషయంలోనూ కీలకంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోమవారం పట్టిసం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడనికి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలచేశారు.

03/29/2016 - 02:24

గూడూరు టౌన్, మార్చి 28: ఓ ఘర్షణ కేసులో ఇరు వర్గాలకు సంబంధించి నమోదైన కేసులో 90 మందికి ఆరు నెలల జైలు, 10 వేలరూపాయల వంతున జరిమానా విధిస్తూ గూడూరులోని అడిషనల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సాయిరాం సోమవారం తీర్పు వెలువరించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

03/29/2016 - 01:40

హైదరాబాద్, మార్చి 28: తెలుగు చిత్ర రంగానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘బాహుబలి’ చిత్రం జాతీయ స్థాయిలో రెండు అవార్డులను దక్కించుకోవడం పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రకటించిన 63వ జాతీయ అవార్డుల ఎంపిక సందర్భంగా బాహుబలి సినిమా జాతీయ ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో జాతీయ స్థాయిలో రెండు అవార్డులను దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన గుర్తింపు తెచ్చింది.

03/29/2016 - 01:37

అనంతపురం, మార్చి 28 : ఎల్‌నినో ప్రభావంతోనే రాష్టవ్య్రాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అనంతపురం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పనిచేస్తున్న వ్యవసాయ వాతావరణ శాస్తవ్రేత్త ఎస్‌ఎన్ మల్లీశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, ప్రస్తుత పరిస్థితి, ఈ పరిస్థితులు ఎంత కాలం కొనసాగుతాయి లాంటి అంశాలపై ఆమెతో ‘ఆంధ్రభూమి ప్రతినిధి’ మాట్లాడారు.

03/29/2016 - 01:37

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాలను నెలకు రెండు లక్షల 30 వేల రూపాయలకు పెంచేందుకు వీలుగా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు సోమవారం సభలో బిల్లు ప్రతిపాదించారు.

03/29/2016 - 01:35

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్సెట్ దరఖాస్తు గడువును పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అదనపు ఫీజు లేకుండా ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించారు. గత నెల 28వ తేదీ నుండి మార్చి 28వరకూ ఎలాంటి జాప్యపు రుసుం లేకుండా దరఖాస్తులను అనుమతించారు. ఇంతవరకూ 32 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అందులో మెడికల్‌కు 10వేల దరఖాస్తులు, ఇంజనీరింగ్‌కు 21,055 దరఖాస్తులు వచ్చాయి.

03/29/2016 - 01:34

హైదరాబాద్, మార్చి 28: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిస్థితులు కుదుటపడుతున్నాయి. విద్యార్ధుల సంఘర్షణలకు కారణాలను అనే్వషించి, వాటి పరిష్కారానికి యూనివర్శిటీ చర్యలు తీసుకుంటోంది. స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డీన్ ప్రొఫెసర్ బి కామయ్య అధ్యక్షతన ఏడుగురు సభ్యుల కమిటీని యూనివర్శిటీ నియమించింది.

03/29/2016 - 01:26

మార్కాపురం/రామచంద్రాపురం, మార్చి 28: విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను విద్యాశాఖ తప్పుల తడకగా ఇచ్చి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పేపర్-2లో 2, 4, 5 ప్రశ్నలు రీడింగ్ సి నుంచి రావాల్సి ఉండగా రీడింగ్ ఎ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు సమాధానాలు రాయలేక ఇబ్బందులు పడ్డారు.

03/29/2016 - 01:24

ముత్తుకూరు, మార్చి 28: ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఓడరేవు అయిన ఓడరేవు ద్వారా ఇండియా-బంగ్లాదేశ్‌ల మధ్య తొలిసారిగా సముద్రయానం ద్వారా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వీటికి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవు వేదికగా నిలిచింది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవి హార్బర్ కంటైనర్ నౌక ఓడరేవులో లంగరు వేయడంతో ఈనౌకను సోమవారం జిల్లా కలెక్టర్ ఎం జానకి ప్రారంభించారు.

Pages