S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/10/2016 - 17:06

హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 13 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులుతెలిపారు. ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల జల్లులు పడుతున్నాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం 13 నాటికి బలపడుతుందని, ఉత్తర తెలంగాణలో అధికంగా వర్షాలు పడతాయన్నారు.

09/10/2016 - 17:03

హైదరాబాద్‌:నగరంలోని శనివారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసి రహదారులు జలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

09/10/2016 - 15:51

హైదరాబాద్: ఈ నెల 12న గజ్వేల్‌లో మల్లనసాగర్ రైతులకు మద్దతుగా సభ నిర్వహిస్తామని, అదేరోజు గవర్నర్‌ను కలుస్తామని టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. వేములఘాట్‌లో రైతుల దీక్షకు 100 రోజులైన సందర్బంగా గజ్వేల్‌లో సభ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ నెల 19, 20న కాంగ్రెస్ జడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని, దిగ్విజయ్, రాజకీయ నిపుణులు హాజరవుతారని తెలిపారు.

09/10/2016 - 15:39

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ 3 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనే గడువు శుక్రవారం అర్ధరాత్రి ముగిసినప్పటికీ శనివారం సాయంత్రం 5గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

09/10/2016 - 12:10

హైదరాబాద్‌: శనివారం ఉదయం నగరంలోని సైదాబాద్, అంబర్ పేట, కోఠి, నాంపల్లి, జూబ్లీహిల్స్‌, లక్డికాపూల్, ఖైరతాబాద్, అమీర్‌పేట్‌, కూకట్‌పల్లిలో భారీ వర్షం పడింది. పలు చోట్ల ట్రాఫిక్ జాం అయింది.

09/10/2016 - 07:34

హైదరబాద్, సెప్టెంబర్ 9: వయస్సుతో నిమిత్తం లేకుండా ఏ తరానికి అన్యాయం జరిగినా ముందు నిలిచి పోరాడిన ప్రజాకవి కాళోజి నారాయణరావు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గీతాంజలి కావ్యాన్ని రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్‌ను విశ్వకవిగా ప్రశంసించారని, అలాగే విశ్వ కవి కాళోజి అని ఆయన అభివర్ణించారు.

09/10/2016 - 07:16

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 9: పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా నీటి సరఫరా ప్రారంభమైంది. ఎంజికెఎల్‌ఐలోని మూడు లిప్టుల్లో మొదటి లిప్టులలోని ఐదు మోటార్లతో నీటిని పంపింగ్ చేస్తూ కిందికి వదులుతున్నారు.

09/10/2016 - 07:14

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 9: పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణాజలాలు గ్రామాలకు చేరుతుండటంతో ప్రజలలో ఆనందం నెలకొంది. పైనుంచి కాలువల ద్వారా వస్తున్న నీటిని జొన్నలబొగుడ రెండో లిప్టులోని మొదటి పంపుతో నీటిని పంపింగ్ చేస్తూ జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను నింపి కాలువల ద్వారా కిందికి వదులుతున్నారు.

09/10/2016 - 07:13

గజ్వేల్, సెప్టెంబర్ 9: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెసోళ్ల్లు కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.

09/10/2016 - 07:13

కొత్తగూడెం, సెప్టెంబర్ 9: సింగరేణి సంస్థలో బిసిలకు అమలు జరుగుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి అతిథిగృహంలో శుక్రవారం తెలంగాణ శాసనసభ బిసి సంక్షేమ కమిటీ సమీక్ష నిర్వహించింది.

Pages