S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/03/2017 - 02:55

హైదరాబాద్, ఏప్రిల్ 2: వన్యప్రాణి అభయారణ్యం, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే తాగునీటి పైపు లైన్ల నిర్మాణ ప్రతిపాదనలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు త్వరలో కేంద్ర అధికార బృందం రానుంది. పైపు లైన్ల నిర్మాణానికి రోడ్లు తవ్వడం, కొన్ని చోట్ల మళ్లింపు వంటివి అభయారణ్య పరిధిలో చేపట్టాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

04/03/2017 - 02:03

హైదరాబాద్, ఏప్రిల్ 2: సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయడం ద్వారా అదనంగా కొత్త ఆయకట్టుకు నీరివ్వాలని భావిస్తోంది. రాష్ట్రంలో భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది.

04/03/2017 - 02:01

హైదరాబాద్, ఏప్రిల్ 2: సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నాలుగో రోజుతో ఉద్ధృతమైంది. అక్కడక్కడ నడుస్తున్న డిసిఎం, ట్రాలీలను లారీ యజమానుల సంఘం నాయకులు అడ్డుకున్నారు.

04/03/2017 - 01:55

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో 2017-18 సంవత్సరానికి జూనియర్ కాలేజీలు నడిపేందుకు వీలుగా అఫిలియేషన్ గడువు పెంచేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రైవేట్ ఎయిడెడ్/అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు (కంపోజిట్ కాలేజీలు) సహకార కాలేజీలకు అఫిలియేషన్‌ను పొడిగిస్తున్నామని బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి డాక్టర్ ఎ. అశోక్ తెలిపారు.

04/02/2017 - 04:35

హైదరాబాద్, ఏప్రిల్ 1: విద్యా సంస్ధలు భారీగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు సమగ్రమైన చట్టం తీసుకుని రావాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

04/02/2017 - 04:32

హైదరాబాద్/ఖైరతాబాద్, ఏప్రిల్ 1: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వరాదన్న డిమాండ్‌తో ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు శనివారం అనూహ్యంగా రాజ్‌భవన్ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. దీంతో కంగారుపడిన పోలీసులు అక్కడికి చేరుకుని విహెచ్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

04/02/2017 - 04:30

కోదాడ, ఏప్రిల్ 1: అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో వున్నా ప్రభుత్వం నుండి కనీస స్పందనలేదని, మిరప పంటలు వేసిన లక్షలాదిమంది రైతు లు గిట్టుబాటుగాక చేతికొచ్చిన పంట ను తెంపకుండా వదిలేస్తున్నా, పంటలను కాలపెడుతున్నా పట్టించుకొనేవాడు లేకపోవడంతో రైతులు రాష్ట్రం లో కన్నీళ్లు పెడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

04/02/2017 - 04:26

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ పెత్తనం ఏమీ లేదని డాక్టర్ కె కేశవరావు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహణ కమిటీ సభ్యుడిగా ఉన్న కేశవరావు పాత్రికేయులతో మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తోడ్పడుతోందని చెప్పారు. యూనివర్శిటీతో సంబంధం ఉన్న అన్ని వర్గాలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు.

04/02/2017 - 04:25

హైదరాబాద్, ఏప్రిల్ 1: బాలికలపై లైంగిక వేధింపుల నివారణ, మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలను మెట్రోపాలిటన్ సెషన జడ్జి జస్టిస్ రాధారాణి ప్రశంసించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని షీ టీమ్స్, మహిళలకు భరోస కేంద్రాలు పనితీరును ఆమె అభినందించారు.

04/02/2017 - 04:23

సంగారెడ్డి, ఏప్రిల్ 1: పెద్ద నోట్ల రద్దుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు ఇప్పుడు మరో ప్రచారం తెరపైకి రావడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. పది రూపాయల నాణెం చెల్లదంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కిళ్ల్లీ కొట్లు, కూరగాయల వ్యాపారులు, ఆటో డ్రైవర్లు మొదలుకుని అన్ని వర్గాలవారు పది రూపాయల నాణెం ఇస్తామంటే అది చెల్లుబాటు కావడంలేదని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

Pages