S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/02/2018 - 01:06

హైదరాబాద్, సెప్టెంబర్ 1: అధికార తెరాస ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై డిజిపి మహేందరరెడ్డి శనివారం పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదివారం జరగనున్న కొంగర కలాన్ వద్ద భారీ ఎత్తున తెరాస సభ నిర్వహించబోతోంది. సభ జరుగుతున్న ప్రాంగణంతో పాటు సభాస్థలికి వచ్చే మార్గాల్లో బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

09/02/2018 - 01:06

హైదరాబాద్, సెప్టెంబర్ 1: స్వచ్ఛత పాటించిన 35 విద్యాలయాలను గుర్తించిన ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేయనుంది. పాఠశాలల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాలను ఇస్తున్నారు.

09/02/2018 - 01:05

హైదరాబాద్, సెప్టెంబర్ 1: సీపీఎస్ పథకాన్ని తరిమికొట్టి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు శనివారం రాష్టవ్య్రాప్తంగా విద్రోహదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారంతా జిల్లా కేంద్రాల్లో డీఈఓ కార్యాలయాలను, రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు.

09/02/2018 - 01:04

బెల్లకొండ/ మాచవరం, సెప్టెంబర్ 1: పులిచింతల ప్రాజెక్టుకు నీరు చేరుతున్న దృష్ట్యా ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి 5 సంవత్సరాలు గడిచినా ఇంకా మెట్ట ప్రాంతాలను నమ్ముకుని ఉన్న 250 కుటుంబాలను రెవెన్యూ, పోలీసు అధికారులు శనివారం ఖాళీ చేయించారు. గుంటూరు జిల్లా బెల్లంకొండ, మాచవరం మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలను తరలించారు.

09/02/2018 - 01:04

హైదరాబాద్, సెప్టెంబర్ 1: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు సొంత నియోజకవర్గానికి చెందిన ‘గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ’ (గడా) ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కలెక్టర్ అయిన ఏ. ముత్యంరెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రణాళికాశాఖ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కే. రామకృష్ణారావు పేరుతో శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

09/01/2018 - 23:22

హైదరాబాద్, సెప్టెంబర్ 1: హౌసర్జన్లకు స్టయిఫండ్‌ను పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. శాంతకుమారి పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంటర్నీస్ (హౌజ్‌సర్జన్లు), పోస్ట్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ, డిప్లొమా), సూపర్ స్పెషాలిటీ విద్యార్థులకు (మెడికల్, డెంటల్) ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

09/02/2018 - 05:33

హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం వేతన సవరణను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు శనివారం ప్రకటించారు. సీఎం నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగులకు మూలవేతనంలో 35 శాతం పెరగనున్నది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి విజయం విద్యుత్ ఉద్యోగులకు వర్తించిందని ఆయన అన్నారు. ప్రగతి భవన్‌లో విద్యుత్ శాఖ సీఎండీతో పాటు ఉద్యోగులతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ వరాలు ప్రకటించారు.

09/01/2018 - 23:19

హైదరాబాద్, సెప్టెంబర్ 1: స్వచ్ఛత పాటించిన 35 విద్యాలయాలను గుర్తించిన ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేయనుంది. పాఠశాలల్లో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎంపిక చేసిన పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాలను ఇస్తున్నారు.

09/01/2018 - 23:09

హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా మలరాజ్ రతన్ రావు నియమితులయ్యారు. టీజేఎస్ అద్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ శనివారం కమిటీని ప్రకటించారు. కన్వీనర్ రతన్ రావుకు సహాయకులుగా పార్టీ నాయకులు చింతా స్వామిని, విశాల్ వంజరను నియమించారు.

09/01/2018 - 06:51

హైదరాబాద్, ఆగస్టు 31: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న ‘బ్లాక్ డే’ పాటించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పిలుపునిచ్చింది. విధిగా ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించినట్టు టీజీఎ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు జి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Pages