S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటాపోటీ

10/29/2016 - 22:06

రికార్డులతో ముడిపెట్టకపోతే, సచిన్ కంటే బ్రియాన్ లారానే గొప్ప బ్యాట్స్‌మన్ అనే వాదన ఉంది. కళాత్మక ఆటకు అద్దం పట్టే అతని ఆట ఎంతో మంది బ్యాట్స్‌మెన్‌కు ఒక పాఠ్యాంశం. కెరీర్‌లో 131 టెస్టులు ఆడిన లారా 11,953 పరుగులు సాధించాడు. 400 (నాటౌట్) అతని అత్యధిక స్కోరు. 34 సెంచరీలు, 48 అర్ధ సెంచరీలు అతని ఖాతాలో ఉన్నాయి. 299 వనే్డలు ఆడి, 10,405 పరుగులు చేసిన లారాకు ఈ ఫార్మెట్‌లో అత్యధిక స్కోరు 189 పరుగులు.

10/29/2016 - 22:04

బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించే ఒకప్పటి సూపర్ ఫాస్ట్ బౌలర్లు వెస్టిండీస్‌కు ఇప్పుడు లేరు. ఎలాంటి బౌలింగ్‌నైనా చితకబాది పరుగులు కొల్లగొట్టే నాటి మేటి హిట్టర్లు కనిపించడం లేదు. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన విండీస్ పరిస్థితి దారుణంగా మారింది. ఇటీవలే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన పరాజయాలే విండీస్ దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయ.

10/29/2016 - 22:00

వెస్లీ హాల్ చాలా దూరం నుంచి రనప్ మొదలుపెట్టేవాడు. బౌండరీ లైన్ నుంచి పరిగెడతాడంటూ అతనిని ఆటపట్టించిన వారు లేకపోలేదు. 1960లో ‘టై’గా ముగిసిన మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌల్ చేసి, టెస్టు క్రికెట్‌లో చిరస్మరణీయుడయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగిన ఆ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో విండీస్ 453 పరుగులు సాధిస్తే, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 505 పరుగులు చేసింది.

10/29/2016 - 21:57

ఉక్కపోతతో సతమతమవుతున్నప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడాన్ని మించిన సుఖం మరొకటి ఉండదు. రెండు మేటి క్రికెట్ జట్లు ఢీ కొంటున్న మ్యాచ్‌ని తిలకించేందుకు టికెట్ దొరకడమే మహద్భాగ్యంగా భావిస్తారు అభిమానులు. స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ.. క్రికెట్ మ్యాచ్‌ని చూసే అవకాశం ఉంటుందని ఇప్పటి వరకూ ఎవరూ ఊహించలేదు. కానీ, ఆ అద్భుత అవకాశాన్ని కల్పించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అధికారులు నిర్ణయించారు.

10/29/2016 - 21:55

ఫిలిప్పీన్స్ బాక్సింగ్ హీరో మానీ పాక్వియావో రెండు పడవలపై ప్రయాణం సాగిస్తున్నాడు. బాక్సింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత మనసు మార్చుకున్న అతను మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నాడు. మరోవైపు ఫిలిప్పీన్స్ పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందిస్తున్నాడు.

10/29/2016 - 21:51

* ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండు సార్లు 500 లేదా అంతకు మించిన భాగస్వామ్యాన్ని అందించిన ఫ్రాంక్ ఓరెల్‌ను సవ్యసాచి అంటారు. అందుకు కారణం లేకపోలేదు. అతను కుడి చేత్తో బ్యాటింగ్, ఎడమ చేత్తో బౌలింగ్ చేసేవాడు. కెప్టెన్‌గా విండీస్‌కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. 1962లో భారత జట్టు విండీస్ పర్యటనకు వెళ్లింది.

10/23/2016 - 03:49

స్వదేశంలో టెస్టు సిరీస్‌లు ఆడినప్పుడు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించే భారత క్రికెట్ జట్టు విదేశాల్లో ఎందుకు చేతులెత్తేస్తుందన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. పిచ్‌లను తమకు అనుకూలంగా మార్చుకొని భారత జట్టు విజయాలు సాధిస్తున్నదని చాలాకాలంగా విమర్శలు వినిపిస్తునే ఉన్నాయ.

10/23/2016 - 03:45

భారత చెస్‌లో తొలి గ్రాండ్ మాస్టర్‌గా విశ్వనాథన్ ఆనంద్ అవతరిస్తే, అత్యంత చిన్న వయసులోనే ఈ హోదాను సంపాదించిన ఆటగాడిగా పరిమర్జాన్ నేగీ రికార్డు సృష్టించాడు. 2006 జూలై ఒకటో తేదీన నేగీ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు సంపాదించే సమయానికి అతని వయసు 13 సంవత్సరాల 142 రోజులు. తొలి గ్రాండ్ మాస్టర్ నార్మ్ సంపాదించిన వారిలో అతనే చిన్నవాడు. 2006లో తన 12వ ఏట అతను మొదటి జిఎం నార్మ్‌ను సాధించాడు.

10/23/2016 - 03:44

జపాన్‌లో క్రీడల సందడి గతంలో ఎన్నడూ లేని విధంగా జోరందుకుంది. ఐచీ ప్రావీన్స్ రాజధాని నగోయాను 2026 ఆసియా క్రీడలకు సంయుక్త ఆతిథ్య నగరంగా డనాంగ్ (వియత్నాం)లో సమావేశమైన ఆసియా ఒలింపిక్ మండలి (ఒసిఎ) నిర్ణయించింది. నిజానికి ఈ నిర్ణయాన్ని 2018లో తీసుకోవాల్సి ఉంది.

10/23/2016 - 03:44

టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న భారత మాజీ స్టార్ సచిన్ తెండూల్కర్‌ను అధిగమించే సత్తా ఉన్న ఆటగాడిగా ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అలిస్టార్ కుక్ తెరపైకి వస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగున్న మొదటి టెస్టు అతనికి కెరీర్‌లో 134వ మ్యాచ్. ఇంగ్లాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా అతను రికార్డు నెలకొల్పాడు.

Pages