S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

07/20/2016 - 21:39

కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు మధ్య సంబంధాలు సజావుగా నడిపేందుకు, రాజ్యాంగపరమైన విధులను రాష్ట్రంలో నిర్వహించేందుకు గవర్నర్ కీలకమైన పాత్ర వహిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నర్ పాత్రను విస్మరించేందుకు వీలులేదు. గవర్నర్ల వ్యవస్థ బ్రిటిష్ కాలంనుంచి మనకు సంక్రమించి ఉండవచ్చు. అంతమాత్రాన గవర్నర్ల వ్యవస్థవల్ల ఉపయోగం లేదనుకోవడానికి వీలులేదు.

07/20/2016 - 21:37

గవర్నర్ల వ్యవస్థకు కాలం చెల్లింది. బ్రిటిష్ కాలంనాటి పదవులు ఇవి. వీరివల్ల ఖజానాకు భారం. ప్రజలకు ఒరిగిందేమీ లేదు. రాజ్యాంగ పరిరక్షకులు తమ విధులను నిజాయితీతో నిర్వర్తించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ వ్యవహారశైలిపై సుప్రీం కోర్టు మండిపడిన విషయం విదితమే. గవర్నర్లు రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా అపహాస్యం చేస్తున్నారు.

07/20/2016 - 21:36

ప్రజలచేత ఎన్నుకోబడకపోయినప్పటికీ గవర్నర్లు రాజకీయాలకు దూరంగా, ప్రజాభద్రతకు చేరువగా ఉండాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా గవర్నర్లు పోషిస్తున్న పాత్ర అదే. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ, జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే వారి వారి జీవన విధానం వేర్వేరు కావచ్చు. ప్రజల అవసరాల మేరకో.. ఆధిపత్యం కోసమో గానీ ప్రజాభిప్రాయాలు రాజకీయంగా కలుషితమవుతున్నాయి. ప్రలోభాల మాయో.. అవసరాల నిమిత్తమో.. సమాజం మారిపోతోంది.

07/13/2016 - 21:35

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంవత్సరం ప్రారంభమైంది, ప్రాథమిక ,మాధ్యమిక పాఠశాలల్లో సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్శిటీలతో పాటు ఈ ఏడాది వృత్తి , సాంకేతిక విద్యా సంస్థల ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతి ఏటా అనుబంధ గుర్తింపు సమస్యలున్నా, ఈ ఏడాది ఆ సమస్యలు హెచ్చుమీరాయి.

07/13/2016 - 21:34

తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయిన తర్వాత కెజి టు పిజి ఉచిత విద్య అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ఎప్పుడు అమలు చేస్తారోనని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీరా కెజి టు పిజి దాకా ప్రస్తుతం ఫీజుల మోత మోగించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది.

07/13/2016 - 21:32

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగంలో పెరుగుతున్న ఫీజుల ధోరణిని అరికట్టేందుకు ఒక నియంత్రణ మండలిని ఏర్పాటు చేయాలి. ఎల్‌కెజి నుంచి ఉన్నత విద్య వరకు ఉన్న కాలేజీలను నియంత్రణ మండలి పరిధిలోకి తీసుకురావాలి. ఇంటర్ నుంచి ఉన్నత విద్య వరకు కాలేజీల అడ్మిషన్ల ఫీజులను ప్రభుత్వం నిర్ణయించడమేకాకుండా, అమలయ్యేటట్లు చూడాలి.

07/13/2016 - 21:30

చదువు ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుంది. ఈ కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం ఎంత కష్టానికైనా సిద్ధపడుతున్నారు. అయితే చదువు ఖరీదుగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే బంగారు తెలంగాణలో కేజీ నుంచి పీజి వరకు ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన విద్య అందాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భావించారు.

07/13/2016 - 21:27

విద్యా విధానంపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు, స్పష్టమైన విధానం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్పష్టమైన విద్యా విధానంతో ముందుకు వెళతాం అని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కానీ అధికారం చేపట్టిన తర్వాత విద్యను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయించుకోవడంలో బిజీగా ఉన్నారు.

07/13/2016 - 21:25

బంగారు తెలంగాణ విజ్ఞాన తెలంగాణవైపు దారితీస్తుందని భావించాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉన్నత విద్యారంగం మరింత దిగజారిందే తప్ప, మెరుగు కాలేదు. కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం వల్ల నాణ్యమైన విద్య గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. కాని వాస్తవపరిస్థితి ఇందుకు వ్యతిరేకంగా ఉంది. పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ తదితర యూనివర్సిటీలలో బోధనా, బోధనేతర సిబ్బంది లేరు.

07/13/2016 - 21:23

ప్రస్తుత విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న విద్యావిధానం వల్ల అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు లేవు. అందువల్ల ప్రభుత్వం నిపుణులతో చర్చించి సంస్కరణలు చేపట్టడం వల్ల విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందనడంలో సందేహం లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై తీవ్రమైన వత్తిడి తీసుకువస్తున్నారు.

Pages