S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

07/31/2017 - 22:23

అన్నదాత కన్నీరు పెడితే
అరిష్టం దేశానికి
పండించే వాడి గుండె మండితే
పస్తులే జనానికి

నీవెన్ని
దేశాలైనా తిరుగు
కన్ననేలను గుండెలో పెట్టుకుంటూనే
నీ వెలుగు

టేస్ట్ చేసి డస్ట్‌బిన్‌లో
అన్నాన్ని పడేసేవాడు ఒకడు
అయ్యో పాపం!
ఆ అన్నానే్న ఏరుకుంటూ మరొకడు

07/31/2017 - 22:21

మేఘమాలలు
తొలకరి నవ్వుల్లో
నీటి పువ్వులు!

తెల్లవారింది
వెలుగు రెక్కలతో
గువ్వ ఎగిరింది!

మామిడి పండు
పసుపు కవరులో
నేతి మిఠాయి!
కథల బామ్మ
ఆరని నీటి చెమ్మ
అమ్మలో అమ్మ!

ఎర్రగులాబి
మనసుకు నచ్చిన
ప్రేమ జిలేబి!
అలల గానం
అలరించే కెరటం
సముద్ర తీరం!

07/31/2017 - 22:20

మనమింక
మాట్లాడుకోవల్సిందే
నీ ఊపిరి నా వొంటి మీద
అత్తరు కళ్లాపి చల్లుతున్నట్లుగా
నా వేళ్లు నీ ముంగురుల మీద
రహస్య లిపి లిఖిస్తున్నట్లుగా
జల్లు తెర పూదోట మీద వాలి
పూలకు పులకలు పుట్టించినట్లుగా
ఇప్పుడింక మాట్లాడుకోవాలె.
మాటలే లేని వౌనమంటే
ఒక గాఢాంధకారం గదా.
మాట్లాడుకోవడమంటే
చీకటి తీగలను నరుక్కుంటూ పోయి

07/31/2017 - 22:18

వర్ణించగలడు
బంధించగలడు
కవి విశ్వాన్ని.

దర్శించగలడు
శోధించగలడు
కవి ప్రకృతిని

లాలించగలడు
పాలించగలడు
కవి లోకాన్ని

కదలించగలడు
కవ్వించగలడు
కవి మనస్సుని

గర్జించగలడు
సాధించగలడు
కవి విప్లవాన్ని

ప్రేమించగలడు
పూజించగలడు
కవి బంధాన్ని

మోయించగలడు
తోయించగలడు
కవి కష్టాన్ని

07/31/2017 - 22:16

విమర్శకు - గుణ విచారణ
దోష విచారణ అనేవి రెండు కళ్లు!

ఇవి రెండూ సమన్వయంతో కలిసి చూసి
కనిపించిన దానిని తూచి తూచా తప్పకుండా
నిజాయితీగా చెప్పే తీర్పే విమర్శ!

అయితే అన్ని రంగాలలోనూ
ఈ రోజుల్లో విమర్శ అనేది
ఏకాక్షి కాకి వలె మారిపోయింది!
కాకికి- ఈ కన్నుతో చూసినప్పుడు ఆ కన్నూ
ఆ కన్నుతో చూసినప్పుడు
ఈ కన్నూ పని చేయవట!

07/29/2017 - 22:18

నేనొక బంగారు శిల్పాన్ని..!!
ఒకప్పుడు పచ్చదనాన్ని పచ్చలుగా
చేసి కిరీటంగా ధరించాను!
నేడు ఎర్రటి కెంపుల కరువు రక్తాన్ని
విరజిమ్ముతూ వెలవెలబోతున్నా..!
ఒకప్పుడు అనుబంధాల
కబంధ మాలను అలంకరించుకున్నా..!!
నేడు ఆ మాలలోని బంధాలు కకావికలై
నాగరికత ముసుగులో నగ్నంగా
నగర నడిబొడ్డున తిరుగుతున్నా..!!
నాడు నేనొక పుష్కర సంగమాన్ని

07/29/2017 - 22:17

ఆ పాత సమయాలెప్పుడూ మనవే నేస్తం
నులక మంచం ఒడిలో
ఆకాశపు గుడిలో
నక్షత్రాల గొడుగేసుకుని
మబ్బుల తివాచీలపై
నడిచిన ఆ పాత సమయాలన్నీ మనవే నేస్తం...

ఆరుబయట వెనె్నల పరదా చుట్టుకుని
ఊగే కొమ్మల ఊసులు వింటూ
చీకటికి వెలుగుల చీరలు కట్టిన
మిణుగురుల గుసగుసలు వింటూ...

07/29/2017 - 22:14

చినుకు చినుకూ
భూమిని ముద్దాడుతోంది
గ్రీష్మానికి తల్లడిల్లిన
తల్లి హృదయమేదో కరుణిస్తున్నట్లు
నేలమ్మ నిలువెల్లా మెత్తబడిపోతుంది

07/29/2017 - 22:12

వాళ్ల
ముస్తాబు సాయంత్రం నుండే మొదలు
స్నానాలు చేసేసి
వస్త్రాలు మార్చేసి-
అద్దం ముందు నుంచొని
జడలేసుకొని
బొట్లేట్టుకొని-
విటులొచ్చే వేళ-
భటులొచ్చే వేళ
ఇచ్చేవాళ్లు ఇచ్చేస్తే
సొద చెప్పుకొని సేద తీర్చుకొని
గిచ్చేవాళ్లు గిచ్చేస్తే-
ఏది ఏమైనా
రాత్రి రైలుబండి పరువాల పట్టాలెక్కి
పరుగో పరుగు-

07/29/2017 - 22:10

కళ్లు మూసుకుంటే కాని నిద్ర రాదు
నిద్ర వస్తే కాని కలలు రావు
కాని కొన్ని కలలు నిద్రపోనివ్వవు
చీకటిని పారద్రోలే కలలు కావాలి
కనురెప్పలను ఆదేశించే దిశ వున్న కలలు కావాలి
సాధించేదాకా నిద్ర పట్టని కలలు కావాలి
సాధారణ జీవితం కోరుకునే
నీలాంటి వారికి నిద్రలో వచ్చే కల చాలు
నిద్రనే కలవరపరిచే కలలు కావాలి
ఆ కలలు మొత్తం నీ గురించే అవ్వాలి

Pages