S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

06/11/2017 - 00:53

అమ్మ లాలన
జోలపాట దీవెన
బోసినవ్వులు!

వేసవికాలం
మల్లెల గుబాళింపు
తొలి వలపు!
తాటి ముంజెలు
విసనకర్ర చెట్టులో
వెన్నముద్దలు!

వీస్తున్న గాలి
కొత్త ఊహల్లో తేలి
పురివిప్పింది!
ఏరు చెప్పింది
నేలమ్మతో చెలిమి
ఎంతో బలిమి!

06/11/2017 - 00:52

పావురాన్ని చంపినంత తేలిక కాదు
ప్రాణాన్ని పోయగల పాటని చంపడం
ఏడంతస్తుల మేడని కూల్చినంత తేలిగ్గాదు
శిథిలాల్లోంచి చిగురుటాశను పుట్టించే
పాటని మట్టుబెట్టడం!

06/11/2017 - 00:47

ముళ్ళ కంచెలెన్నో దాటుకొచ్చా కానీ
నీ చూపుల కంచెలనే దాటలేకపోతున్నా!

కష్టాల కడలినే దాటుకొచ్చా కానీ
నీ మాటల సంద్రానే్న దాటలేకపోతున్నా!

ఆశల కలలెన్నో నింపుకొచ్చా కానీ
చేసిన బాసలను నింపుకోలేకపోతున్నా!

ఈసడింపులెన్నో తుంచుకొనొచ్చా కానీ
నీ చులకనభావాన్ని తుంచలేకపోతున్నా!
అడ్డంకులెన్నో తుడుచుకొనొచ్చా కానీ
నీ వౌనపు మసిని తుడవలేకపోతున్నా!

06/04/2017 - 01:23

కూలిపోయన వంతెనలగుండా
మాటలు చిక్కుకుని విలవిలలాడినప్పుడు
ఎండ సోకని మూలాలలో నన్ను నేను
ఎప్పటికప్పుడు తప్పిపోతాను

కడవల కొద్దీ కన్నీళ్లను
అనుభవాల దొంతరలో
పాతరేసి పోరాడుతున్న
ఒంటరి కెరటాన్ని

06/04/2017 - 01:20

సర్దుకుపోవడం
సరైన పద్ధతి కాదు
సర్దుకుపోవడమంటే
తప్పును సమర్థించడమే
జరిగే తప్పుని ఎదిరించలేక
ఓ మూల ఒదిగిపోవడమే

తప్పును తప్పించుకుపోతే
తప్పు తప్పులతో కలిసి
తడికలా అల్లుకుపోతుంది
కదిపే ప్రయత్నం జరిగితే
కల్లోలం సృష్టించి
ఒప్పును కప్పేస్తుంది

06/04/2017 - 01:19

నిశ్చలమైన సముద్రంలో
ముత్యాలను ఏరాలనుకోకు..
వజ్రాలు మింగినవాణ్ణి
కత్తితో కోయాలనుకోకు
ఉరిమే మెరుపుల మధ్య
రాలే పిడుగును
నీ చేతులతో ఆపాలనుకోకు
నేను జ్ఞానచక్షువుని
మూలాల్ని శోధించేవాణ్ణి
ఒకప్పుడు ఆ కళ్ళు నన్ను చూసి
విరబూసిన పూరేకుల మీద
తుషారాల్లా పలుకరించేవి
ఇప్పుడెందుకలా ఎర్రబడ్డాయ!
నాకు మాత్రమే తెలిసేలా

06/04/2017 - 01:17

అతనికి ఆహ్వానాలతో పనిలేదు
స్వాగత ద్వారాలు చాలు
తెచ్చుకోలు చిరునవ్వులు నచ్చవు
ఫొటోల కోసం వాటేసుకోడు
కెమెరా కంట్లో పడాలని
ముందు వరసలో సీటేసుకోడు
సహృదయంతో ఆశీర్వదిస్తాడు
సంతోషంగా భోంచేసి వెళ్తాడు
బంధుమిత్రుల జాబితాలో లేడు
వధూవరుల్లో ఎవరివాడో తెలియదు
ఎవడు వాడు ఎచటి వాడని
ఆరాలు తీయడం అనవసరం
అతనో రోడ్డున పడ్డ జోగి

05/24/2017 - 00:23

పుస్తకాల బీరువా సర్దుతుంటే
ప్రేమలేఖ ఒకటి జారిపడింది
ఆ క్షణం
మనసూ శరీరమూ ఏకమై
గతం ఆకాశంలోకి ఎగిరిపోయ
అనుభూతి పావురమై
గిరికీలు కొడుతోంది
తన్మయత్వంతో
ఆ ముత్యాల అక్షరాలను
కంపించే పెదాలతో గోముగా ముద్దాడి
జ్ఞాపకాల మునివేళ్లతో స్పృశించాను
నా అశ్రువు ఒకటి
ఆమె సంతకంపై రాలి
అపురూప ముఖబింబమై దర్శనమిచ్చింది

05/24/2017 - 00:21

చిన్ననాటి జ్ఞాపకాలను
ఒడిలో ఒడిసి పట్టుకుని
పరువం నాటి ప్రయాణాన్ని
మది సరదాల్లో
దాచి పెట్టుకుని
పెళ్ళైన నాటినుండి
సంసార భారాన్ని
తలమీద పెట్టుకుని
ఇటు సంసారానికి
అటు ఉద్యోగానికి
సమన్యాయం
చేయాలన్న తపనతో
సతమతమవుతున్న నా పతీ
ఈ ఉరుకుల పరుగుల జీవనదిలో
ఈదుతూ...
నిను నీవే మరిచావు

05/24/2017 - 00:20

ఊహల లోగిల్లో
ఎదుగుతున్న యవ్వనాన్ని
పసుపు వర్ణంగా
ఆరబోయటం చూశాం

జీవిత సందర్భాల్ని
పసుపుతో ముడిపడటాన్ని
పలకరించాం

పసుపు మొక్కలు
అందంగా ఎదుగుతుంటే
ఆకాశంలోని హరివిల్లుల్ని
రాల్చుకున్నాం

నీరు పోసినప్పుడు
మదుపులు తెచ్చినప్పుడు
ఆఖరుకి గిడ్డంగులకి
పసుపు చేరేదాకా
స్వప్నాల్ని ఎగరేసుకున్నాం

Pages