S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం... మీరే డిటెక్టివ్

01/28/2019 - 22:09

పుణ్యాత్ముడైన ఆ జనక మహారాజు నన్ను తన పట్టపు రాణికి చాలా ఇష్టమైన వస్తువుని ఇచ్చినట్లుగా ఇచ్చాడు. స్నేహశీలైన ఆమె నన్ను మాతృ ప్రేమతో ఆదరించింది. నాకు పెళ్లి వయసు రాగానే నా తండ్రి దీనుడై, ధనం పోయిన దరిద్రుడు ఎలా బాధ పడతాడో అలా బాధపడ్డాడు. భూలోకంలో దేవేంద్రుడి వంటి వాడైనా, ఆడపిల్ల తండ్రి తనతో సమానులైన వారి నించి, తన కంటే తక్కువ వారి నించి ఆడపిల్ల పెళ్లి విషయంలో లోకంలో తిరస్కారం పొందాల్సి వస్తుంది.

01/19/2019 - 23:37

మునులంతా వెళ్లిపోయాక రాముడు బాగా ఆలోచించి అనేక కారణాల చేత అక్కడ ఉండకూడదని నిర్ణయించుకున్నాడు.

01/12/2019 - 23:14

భరతుడు తిరిగి వెళ్లిపోయాక రాముడు తపోవనంలో నివసిస్తూ అక్కడ ఉన్న మహర్షులు భయపడుతున్నట్లు, ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలి అనుకుంటున్నట్లు తెలుసుకున్నాడు. ఆ చిత్రకూట పర్వతం మీది ఆశ్రమంలో గతంలో తనని ఆశ్రయించి సంతోషంగా ఉన్నవాళ్లే ఇప్పుడు ఎందుకో కంగారు పడుతున్నట్లు రాముడికి అనిపించింది.

01/05/2019 - 22:48

దృఢమైన వ్రతం గల భరతుడు తల్లుల్ని అయోధ్యకి చేర్చిన తర్వాత శోకంలో మునిగి వశిష్ఠుడు, మొదలైన గురువులతో ఇలా చెప్పాడు.

12/29/2018 - 22:53

రామాయణం (అయోధ్యకాండ 11వ సర్గ)
ఆ తర్వాత భరతుడు సంతోషిస్తూ శతృఘు్నడితో కలిసి రథం ఎక్కాడు.

12/29/2018 - 22:52

అక్కడ గుమిగూడిన మహర్షులంతా సాటిలేని తేజస్సు గల ఆ సోదరుల గగుర్పాటు కలిగించే సంగమాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. అక్కడ అంతర్థానంగా ఉండి చూసే మునిగణాలు, సిద్దులు, దేవర్షులు మహాత్ములైన ఆ రామభరతులని ప్రశంసించి ఇలా అనుకున్నారు.
‘్ధర్మవేత్తలు, ధర్మం మీద ఆసక్తిని చూపించే ఆ సోదరులని కొడుకులుగా కన్న దశరథుడు ధన్యుడు. వీరి మాటలని విని వీరి మీద మనకి ఇష్టం కలుగుతోంది కదా?’

12/15/2018 - 22:42

మహామంత్రైన వశిష్ఠుడు రాముడితో ఇలా చెప్పి, మళ్లీ ధర్మసమ్మతమైన ఈ మాటలని కూడా చెప్పాడు.

12/15/2018 - 22:35

రాముడికి కోపం వచ్చినట్లు గ్రహించిన వశిష్ఠుడు ఇలా చెప్పాడు.
‘జనులు ఆయా లోకాలకి పోతూ తిరిగి వస్తూంటారని జాబాలికి కూడా తెలుసు. కేవలం నిన్ను అయోధ్యకి మళ్లించాలని మాత్రమే జాబాలి అలా చెప్పాడు. లోకాలకి ప్రభువైన ఓ రామా! ఈ లోకం ఎలా పుట్టిందో చెప్తా విను.

12/01/2018 - 21:59

హరిదాసు తన హరికథని ఇలా ఆరంభించాడు.
‘నిన్న చెప్పగా మిగిలిన అయోధ్య కాండలోని 108వ సర్గలో మిగిలిన భాగాన్ని చెప్పి ఇవాళ 109వ కాండ పూర్తి చేస్తాను.
నిజమైన బుద్ధి కలవారిలో శ్రేష్ఠుడైన రాముడు అధిక భక్తి, చలించని బుద్ధితో ఇలా చెప్పాడు.

11/24/2018 - 19:26

మీకో ప్రశ్న

Pages