S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/15/2017 - 04:26

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నవంబరు 3,4 తేదీల్లో తిరుపతిలో నిర్వహించనున్న ఏపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు వేదిక కానున్నాయని ఏపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు వెల్లడించారు. ఏపి ఎన్‌జివో అసోసియేషన్ పశ్చిమ కృష్ణా కార్యవర్గ సమావేశం శనివారం గాంధీనగర్‌లోని ఏపి ఎన్‌జివో హోంలో నిర్వహించారు.

10/14/2017 - 03:22

కర్నూలు ఓల్ట్‌సిటీ, అక్టోబర్ 13: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హంద్రీనది ఉగ్రరూపం దాల్చింది. దీనికి తోడు గాజులదినె్న ప్రాజెక్టు నుంచి వరద నీటిని నదిలో విడుదల చేయడంతో శుక్రవారం కర్నూలు నగరం నడిబొడ్డున వరదనీరు రోడ్లపైకి చేరింది. నగరంలోని ఆనంద్ టాకీసు బ్రిడ్జి కిందకు వరదనీరు చేరుకోవడంతో కొత్త బస్టాండ్ - పాత బస్టాండ్ మధ్య రాకపోకలు నిల్చిపోయాయి.

10/14/2017 - 03:21

విజయవాడ, అక్టోబర్ 13: రాష్ట్రంలో నవంబర్ నెలాఖరునాటికి అగ్రి ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అగ్రి ఇంక్యుబేటర్లలో వ్యవసాయానికి సంబంధించి వివిధ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇచ్చేలా అగ్రి ఇంక్యుబేటర్లను అభివృద్ధి చేయాలన్నారు.

10/14/2017 - 03:20

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 13: రాష్ట్రంలోని 59 ఆలయాల్లో టెంపుల్ మేనేజ్‌మెంట్ సిస్టం (టిఎంఎస్) ప్రవేశపెట్టామని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విధానంవల్ల భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే కాకుండా దేవాలయాల్లో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శకత పాటించవచ్చన్నారు.

10/14/2017 - 03:18

విజయవాడ, అక్టోబర్ 13: విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విరాట్‌ను ఆధునిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. నౌకను మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు వీలుగా కన్సల్టెంట్‌ను ఖరారు చేయగా, ఇప్పటికే ప్రాథమిక నివేదికను రాష్ట్ర పర్యాటక శాఖకు అందచేసింది.

10/14/2017 - 03:17

శ్రీకాళహస్తి, అక్టోబర్ 13: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి మండలం, రాచగునే్నరి గ్రామం వద్ద ఉన్న శ్రీకాళహస్తి పైప్స్ లిమిటెడ్ కర్మాగారం వద్ద తమిళనాడుకు చెందిన కారును కంటైనర్ లారీ ఢీకొనడంతో కారులో ఉన్న ప్రయాణికులు నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృత దేహాలు కారులో ఇరుక్కుపోయాయి.

10/14/2017 - 03:16

విజయవాడ, అక్టోబర్ 13: ఈ ఏడాది ఏపి ఎస్సీ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.2713 కోట్లకు పెరిగిందని కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు చెప్పారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితుల జీవన విధానంలో మార్పు కోసం, వారు ప్రారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి పలు పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

10/14/2017 - 03:15

తాడేపల్లి, అక్టోబర్ 13: జాతీయ విపత్తుల నివారణ చర్యలకు ప్రపంచబ్యాంకు ద్వారా 2,200 కోట్ల రూపాయలు వినియోగించనున్నట్టు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి డాక్టర్ మన్‌మోహన్‌సింగ్ పేర్కొన్నారు.

10/14/2017 - 02:52

విజయవాడ, అక్టోబర్ 13: జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ హెచ్చరించారు. ఈ ఏడాది చివరి నాటికి ఎన్టీఆర్ జలసిరి కింద రాష్ట్ర వ్యాప్తంగా 35వేల బోర్లు వేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో 400 కొండలపై 4వేల హెక్టార్లలో గ్రామాలకు ఆదాయాన్నిచ్చే మొక్కలు నాటాలన్నారు.

10/14/2017 - 02:51

బాపట్ల, అక్టోబర్ 13: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాల లబ్ధిని కింది స్థాయి వరకు తీసుకెళ్లేక్రమంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర స్ర్తి, శిశుసంక్షేమ శాఖామాత్యులు పరిటాల సునీత సూచించారు. శుక్రవారం బాపట్లలో పర్యటించిన మంత్రి పరిటాల సునీత మునిసిపల్ కౌన్సిల్ హాలు ఆవరణలో స్ర్తి, శిశుసంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

Pages