S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/27/2016 - 06:22

కాకినాడ, జూలై 26: సకాలంలో ఆదాయ పన్నును చెల్లిస్తే ఎటువంటి సమస్యలు ఎదురుకావని, విధిగా ఆదాయ పన్ను చెల్లించాలని విశాఖ ఆదాయ పన్ను కమిషనరేట్-2 ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర్ చిదార సూచించారు. ఆదాయ పన్ను ఎగవేతదారులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బడ్జెట్ ద్వారా ఆదాయ వెల్లడి పథకం-2016ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

07/26/2016 - 05:27

న్యూఢిల్లీ, జూలై 25: బజాజ్ ఆటో ప్రతిష్ఠాత్మక ద్విచక్ర వాహనం ‘వి’ అమ్మకాలు లక్ష మార్కును దాటాయి. ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక లోహంతో వి బైకులను బజాజ్ తయారు చేస్తున్నది తెలిసిందే. 150సిసి సామర్థ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్‌కు పరిచయమైన వి బైక్ పంపిణీ మార్చి 23 నుంచి మొదలైంది.

07/26/2016 - 05:27

ముంబయి, జూలై 25: ప్రభుత్వరంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ప్రైవేట్‌రంగ బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సోమవారం జరిమానాలు వేసింది. నిరుడు చోటుచేసుకున్న 6,100 కోట్ల రూపాయల కుంభకోణంలో తాజాగా బ్యాంక్ లోపాలు బయటపడటంతో బ్యాంక్ ఆఫ్ బరోడాపై 5 కోట్ల రూపాయల జరిమానాను విధించిన ఆర్‌బిఐ..

,
07/26/2016 - 05:26

న్యూయార్క్, జూలై 25: యాహూ ఆపరేటింగ్ వ్యాపారాన్ని వెరిజోన్ కమ్యూనికేషన్స్ సొంతం చేసుకుంది. సుమారు 4.83 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఓ ఒప్పందం ఇక్కడ కుదిరింది. నిన్నటి తరం వెబ్ యూజర్ల ఇంటర్నెట్ ప్రవేశానికి ప్రధాన ద్వారంగా వెలిగిన యాహూ.. గూగుల్, ఫేస్‌బుక్ తదితర నేటి తరం ఇంటర్నెట్ దిగ్గజాల ముందు చతికిలపడింది.

07/26/2016 - 05:24

న్యూఢిల్లీ, జూలై 25: దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. భారతీయ ఐటి పరిశ్రమలో అత్యధిక ఉద్యోగులున్న సంస్థగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమినీ సంస్థలున్నట్లు ఐటి పరిశ్రమల సంఘం నాస్కామ్ ఓ ప్రకటనలో సోమవారం తెలిపింది.

07/26/2016 - 05:22

బెంగళూరు, జూలై 25: విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. సోమవారం బ్యాంకుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. తమతో జరిగిన మాస్టర్ డెట్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్ (ఎమ్‌డిఆర్‌ఎ) షరతులను బ్యాంకులు మీరాయని, అనవసరమైన రాద్ధాంతంతో తమ వ్యాపారాన్ని దెబ్బతీశాయని అసహనం వ్యక్తం చేసింది.

07/26/2016 - 05:19

హైదరాబాద్, జూలై 25: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకుల వల్ల వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ప్రిన్సిపల్ చీఫ్ జనరల్ మేనేజర్, బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తెలిపారు.

07/26/2016 - 05:15

విజయవాడ, జూలై 25: మచిలీపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కావాల్సిన భూమిని సమీకరించడానికి ప్రభుత్వం 185 జిఓను జారీ చేసింది. దీన్ని సోమవారం గెజిట్‌లో ప్రచురించింది. రాజధాని అమరావతికి సుమారు 33 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సునాయాసంగా సేకరించింది. ఇదే తరహాలో మచిలీపట్నం పోర్టు, కారిడార్‌కు భూమిని సమీకరించాలని భావిస్తోంది. కానీ అమరావతిలో భూసమీకరణకు, మచిలీపట్నంలో భూసమీకరణకు చాలా తేడా ఉంది.

07/26/2016 - 05:12

ముంబయి, జూలై 25: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 292.10 పాయింట్లు పెరిగి 28,095.34 వద్ద స్థిరపడగా, ఆగస్టు 10 నుంచి చూస్తే ఇది గరిష్ఠ స్థాయి. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 94.45 పాయింట్లు ఎగిసి 8,635.65 వద్ద నిలిచి 15 నెలల గరిష్ఠాన్ని తాకింది.

07/26/2016 - 05:11

విశాఖపట్నం, జూలై 25: హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ తమ తొలి బొగ్గు ఆధారిత ప్రాజెక్టును సోమవారం ప్రారంభించింది. హిందు జా గ్రూప్‌లో భాగమైన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ సంస్థ (హెచ్‌ఎన్‌పిసిఎల్) విశాఖలోని తమ 1,040 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించినట్టు వెల్లడించింది. 520 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు సంస్థ వివరించింది.

Pages