S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/01/2017 - 03:06

న్యూఢిల్లీ, మే 31: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులో తెలుగు రాష్ట్రాలలోని గ్రానైట్ పరిశ్రమకు పాత పన్ను విధానమే కొనసాగించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి లేఖ రాశారు. బుధవారం ఇక్కడ ఏపి, తెలంగాణలకు చెందిన పలువురు గ్రానైట్ పారిశ్రామికవేత్తలు సురవరంతోపాటు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి తమ సమస్యలను వారికి వివరించారు.

06/01/2017 - 03:05

హైదరాబాద్, మే 31: అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లాస్టిక్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ పారిశ్రామిక, వౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. ఈ క్లస్టర్‌లో ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి పారిశ్రామిక వేత్తలకు అన్ని రకాల వౌలిక సదుపాయాలను కల్పిస్తామని బాలమల్లు బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.

06/01/2017 - 03:03

ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్
న్యూఢిల్లీ, మే 31: ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ ఏకీకృత నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 528.29 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 105.37 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకుంది. మొత్తం ఆదాయం ఈసారి 1,982.68 కోట్ల రూపాయలుగా, నిరుడు 2,066.01 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ పేర్కొంది.
భూషణ్ స్టీల్

06/01/2017 - 03:03

ముంబయి, మే 31: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో కొనసాగుతున్న సూచీ లు.. రోజుకో రికార్డును అందుకుంటూ వచ్చినది తెలిసిందే. అయితే బుధవారం మాత్రం ఈ జోరుకు బ్రేక్ పడింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 13.60 పాయింట్లు కోల్పోయి 31,145.80 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 3.30 పాయింట్లు పడిపోయి 9,621.25 వద్ద నిలిచింది.

05/31/2017 - 08:29

న్యూఢిల్లీ, మే 30: దేశీయ విమానయాన రంగం దూసుకుపోతోందని పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్‌గజపతి రాజు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత విమానయాన రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని మంగళవారం ఇక్కడ తెలిపారు. విమానయాన వృద్ధిరేటులో అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో, దేశీయంగా మూడో స్థానంలో భారత్ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.

05/31/2017 - 08:27

భీమవరం, మే 30: అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో రొయ్య రైతుల కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కంటిపాపలా కాపాడుకున్న చెరువుల్లో రొయ్యలు చనిపోయి మట్టిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా. గతంలో ఎన్నడూలేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే నష్టానికి కారణమని రైతులు వాపోతున్నారు.

05/31/2017 - 08:26

హైదరాబాద్, మే 30: తెలంగాణలో పనిచేస్తున్న వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన డీలర్లంతా తమ వివరాలను గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జిఎస్‌టి) నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసుకోవాలని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జిఎస్‌టి నెట్‌వర్క్ ప్రత్యేక పోర్టల్‌ను జూన్ 1 నుండి 15 వరకు తెరిచి ఉంచుతామని వివరించారు.

05/31/2017 - 08:25

న్యూఢిల్లీ, మే 30: టాటా గ్రూప్ సంస్థల అధిపతి, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్.. టిసిఎస్ సిఇఒగా గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 30.15 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. టాటాల సారథిగా బాధ్యతలు స్వీకరించక ముందు చంద్రశేఖరన్ దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్ సిఇఒగా ఉన్నది తెలిసిందే.

05/31/2017 - 08:24

న్యూఢిల్లీ, మే 30: మ్యాక్స్ ఫైనాన్షియల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 593.27 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 393.19 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 15,227.89 కోట్ల రూపాయలుగా ఉందని మంగళవారం తెలిపింది. నిరుడు 11,696.14 కోట్ల రూపాయలుగా ఉంది.
హిందాల్కో ఇండస్ట్రీస్

05/30/2017 - 08:20

న్యూఢిల్లీ/బెంగళూరు, మే 29: తొలి తొమ్మిది నెలల్లో 55 వేల కోట్ల రూపాయల ఆదాయం రావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది జూలై 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి రానున్న క్రమంలో సెస్ లెవీ ద్వారా ఎంతలేదన్నా ఈ మొత్తం అందవచ్చని మోదీ సర్కారు భావిస్తోంది. బొగ్గు, లగ్జరీ ఉత్పత్తులపై జిఎస్‌టితో పెద్ద ఎత్తున రాబడి వస్తుందని చెబుతున్నారు.

Pages