S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/06/2017 - 02:10

న్యూఢిల్లీ, జూన్ 5: వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్ (జిఎస్‌టిఎన్)ను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆడిట్ చేయనుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం స్పష్టం చేశారు. తమ పార్టీ సహచర సభ్యుడైన సుబ్రమణ్యన్ స్వామి తరచూ జిఎస్‌టిఎన్‌లో భాగస్వామ్య విధానాన్ని ప్రశ్నిస్తున్నారు.

06/06/2017 - 02:09

హైదరాబాద్, జూన్ 5: ఉద్యోగ బాధ్యతలను అందరూ సమష్టిగా పంచుకోవాలే తప్ప ఎవరూ మానసిక ఒత్తిడికి గురి కావద్దని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పన (టిఎస్‌ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు సూచించారు. టిఎస్‌ఐఐసి జనరల్ మేనేజర్ ఎం శ్రీకాంత్ రెడ్డి శనివారం మరణించారు.

06/06/2017 - 02:08

హైదరాబాద్, జూన్ 5: ప్రతి సంవత్సరం ఒక వారం రోజులు ఆర్థిక సంబంధమైన అక్షరాస్యత వ్యాప్తి పాటించాలని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) నిర్ణయించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ఆర్థిక అక్షరాస్యత వ్యాప్తి (ఫైనాన్షియల్ లిటరసీ వీక్)ను పాటిస్తున్నట్లు ఆర్‌బిఐ ప్రాంతీయ సంచాలకుడు ఆర్ సుబ్రహ్మణీయన్ తెలిపారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని ఆర్‌బిఐ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

06/06/2017 - 02:08

ముంబయి, జూన్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సరికొత్త రికార్డులను తాకాయి. చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న ప్రయత్నాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్షా సమావేశం నిర్వహించడంతో మదుపరులు ఉత్సాహంతో ఉరకలెత్తారు.

06/06/2017 - 02:07

హైదరాబాద్, జూన్ 5: స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరచిన చికున్‌గున్యా (సిహెచ్‌ఐకెవి) వ్యాక్సిన్ ఫేజ్ 1 హ్యూమన్ క్లీనికల్ ట్రయల్స్ మొదలైనట్లు భారత్ బయోటెక్ సోమవారం తెలిపింది. 60 మంది ఆరోగ్యవంతులపై ముందస్తుగా ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి అధ్యయనం చేస్తున్నామని, దాని ఫలితాలను నమోదు చేసుకుంటున్నామని సంస్థ ఓ పత్రికా ప్రకటనలో తెలియజేసింది.

06/05/2017 - 02:44

న్యూఢిల్లీ, జూన్ 4: రిజర్వ్ బ్యాంక్ బుధవారం జరిపే ద్రవ్య పరపతి విధానం సమీక్షలో యథాతథ స్థితిని కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వచ్చే నెల 1నుంచి అమలయ్యే వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) ప్రభావం ద్రవ్యోల్బణంపై ఏ విధంగా ఉండనుందో పరిశీలించాల్సి ఉన్నందున ఆర్‌బిఐ వడ్డీ రేట్ల తగ్గింపు జోలికి వెళ్లకపోవచ్చని వారంటున్నారు.

06/04/2017 - 02:10

న్యూఢిల్లీ, జూన్ 3: చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుకు సర్వం సిద్ధమైంది. శనివారం ఇక్కడ 15వసారి సమావేశమైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జిఎస్‌టి కౌన్సిల్.. మిగతా వస్తువులకూ పన్ను శ్లాబులను నిర్ణయించింది. ఇప్పటికే 1,200లకుపైగా వస్తువులు, 500ల సేవలకు జిఎస్‌టి రేట్లను ప్రకటించిన జిఎస్‌టి కౌన్సిల్.. శనివారం మిగతా వాటికీ రేట్లను ఖరారు చేసింది.

06/03/2017 - 01:44

ముంబయి, జూన్ 2: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి రుణ దాతల నుంచి ఏడు నెలల సమయం వచ్చింది. సంస్థ పొందిన రుణాలు 45,000 కోట్ల రూపాయలకు చేరిన నేపథ్యంలో వివిధ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు ఆర్‌కామ్ క్రెడిట్ రేటింగ్‌ను దారుణంగా తగ్గించాయి. ఇది తనను చాలాచాలా బాధించిందంటూ రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీ వ్యాఖ్యానించారు.

06/01/2017 - 03:09

మాడ్రిడ్, మే 31: భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. స్పెయిన్ పర్యటన సందర్భంగా అక్కడి సంస్థలను ఆహ్వానించారు. ఐరోపా దేశాల పర్యటనలో భాగంగా బుధవారం మోదీ స్పెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగానే భారత్ సాధిస్తున్న బలమైన వృద్ధిరేటు వివిధ రంగాల్లో స్పెయిన్ సంస్థలకు విస్తృతంగా పెట్టుబడుల అవకాశాలను కల్పిస్తుందన్నారు.

06/01/2017 - 03:07

న్యూఢిల్లీ, మే 31: దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగించింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) బుధవారం ఇక్కడ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా నమోదైంది. నిజానికి స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) వృద్ధిలో కీలకమైన వ్యవసాయ రంగం గత ఆర్థిక సంవత్సరం ఆశాజనకంగానే ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వృద్ధిరేటు మాత్రం మూడేళ్ల కనిష్టానికి పతనమైంది.

Pages