S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/03/2016 - 04:32

హైదరాబాద్, జూలై 2: రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన విజయ డెయిరీ పాల ప్యాకెట్ల పోలికతో ప్రైవేట్ సంస్థ శ్రీ సాంబశివ డెయిరీ ప్రోడక్ట్స్ పాల ప్యాకెట్లను విడుదల చేస్తోందని విజయ డెయిరీ (తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య) మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించాలని ఆయన కోరారు.

07/03/2016 - 04:31

బెంగళూరు, జూలై 2: కీలక ఎరువులైన డైఅమ్మోనియం ఫాస్ఫేట్ (డిఎపి), మురియత్ ఆఫ్ పొటాష్ (ఎమ్‌ఒపి), నైట్రోజన్ ఫాస్ఫేట్ అండ్ పొటాష్ కంపోజిషన్ (ఎన్‌పికె) ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఇక్కడ కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. ‘డిఎపి, ఎమ్‌ఒపి, ఎన్‌పికె ఎరువుల ధరలు గడచిన పదిహేను సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తగ్గలేదు. పైగా వీటి ధరలు పెరిగాయి.

07/03/2016 - 04:30

బోస్టన్, జూలై 2: ‘కత్తులతో కాదు.. కంటి చూపుతో చంపేస్తా’ ఓ సూపర్‌హిట్ తెలుగు సినిమాలోని పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఈ డైలాగ్ సంగతి ఎందుకు? అనుకుంటున్నారా.. అదే చెబుతున్నాం.. త్వరలో ఓ సరికొత్త టెక్నాలజీ పరిచయం కానుంది. రోజుకో టెక్నాలజీ వస్తోంది అయితే ఏంటి? అనుకోకండి. ఎందుకంటే ఈ టెక్నాలజీతో మీరు మీ స్మార్ట్ఫోన్‌ను కంటి చూపుతోనే కంట్రోల్ చేసేయొచ్చు.

07/03/2016 - 04:27

న్యూఢిల్లీ, జూలై 2: బులియన్ మార్కెట్‌లో వెండి వెలుగులు విరజిమ్ముతున్నాయి. శనివారం ఒక్కరోజే కిలో వెండి ధర 960 రూపాయలు ఎగిసిపడగా, వారం రోజుల్లో 3,170 రూపాయలు పెరిగి కిలో వెల 45 వేల మార్కును అధిగమించి 45,560 రూపాయలను తాకింది. గత నాలుగు రోజులుగా వెండి ధరలు పెరుగుతూనే ఉండగా, శనివారం కూడా అదేతీరు సాగింది. దీంతో రెండేళ్ల గరిష్ఠ స్థాయికి ధర చేరింది.

07/03/2016 - 04:25

న్యూఢిల్లీ, జూలై 2: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తిగత ఆస్తులు గత ఆర్థిక సంవత్సరం (2015-16) 2.8 కోట్ల రూపాయలు క్షీణించాయి. 2015 మార్చి 31కి 71.95 కోట్ల రూపాయలుగా ఉన్న జైట్లీ సంపద.. 2016 మార్చి 31కి 69.13 కోట్ల రూపాయలకు వచ్చింది. ఈ మేరకు 2015-16కుగాను తాజాగా విడుదల చేసిన వ్యక్తిగత వార్షిక ఆస్తులు, అప్పుల ప్రకటనలో జైట్లీ పేర్కొన్నారు.

07/02/2016 - 08:20

న్యూఢిల్లీ, జూలై 1: ప్రాంతీయ విమాన అనుసంధాన పథకాన్ని (ఆర్‌సిఎస్) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించింది. కొత్త పౌరవిమానయాన విధానంలో భాగంగా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు అందాలనే ప్రభుత్వ యోచనకు అనుగుణంగా ఆర్‌సిఎస్‌ను తీసుకొచ్చారు. విమానయాన సంస్థలు, విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతోసహా భాగస్వాములందరి అభిప్రాయాలను దీనిపై కేంద్రం సేకరిస్తోంది.

07/02/2016 - 08:17

ముంబయి, జూలై 1: జోన్ స్టార్టప్స్ ఇండియా, కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నెక్స్ట్ బిగ్ ఐడియా’ పోటీకి ఈ ఏడాదికిగాను గూగుల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ అధిక టెక్నాలజీ, అమిత సామర్థ్యం కలిగిన ఐదు అంకుర సంస్థల (స్టార్టప్)ను ఎంపిక చేయడానికి నిర్దేశించినది.

07/02/2016 - 08:17

తడ, జూలై 1: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొన్న శ్రీసిటి పారిశ్రామిక వాడను శుక్రవారం చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం సందర్శించింది. చైనాలోని షెజియాంగ్ రాష్ట్రం నుండి విచ్చేసిన పది మంది సభ్యుల బృందానికి శ్రీసిటి వ్యవస్థాపకుడు రవీంద్ర సన్నారెడ్డి ఘనంగా స్వాగతం పలికి పారిశ్రామికంగా శ్రీసిటి సాధించిన ప్రగతిని గురించి వివరించారు.

07/02/2016 - 08:16

ముంబయ, జూలై 1: పక్కన ఫోటోలో కనిపిస్తున్నది పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయ, బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా ఎగవేసి విదేశాలకు పారిపోయన కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం. బకాయల వసూళ్లలో భాగంగా దీన్ని సర్వీస్ ట్యాక్స్ శాఖ వేలం వేయగా, కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలైంది. అదికూడా విమానం విలువ 152 కోట్ల రూపాయలుగా నిర్ణయంచి వేలానికి తీసుకువస్తే..

07/02/2016 - 08:15

ముంబయి, జూలై 1: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ టై-అప్ అయ్యింది. దీంతో ఇక ఎస్‌బిఐ ఖాతాదారులు నెలసరి వాయిదాల్లో (ఇఎమ్‌ఐ) ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అయితే వ్యక్తిగత రుణ వడ్డీరేటు (14 శాతం) వర్తిస్తుంది. ‘ఇలాంటి ఓ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

Pages