S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/03/2019 - 00:25

న్యూఢిల్లీ, ఆగస్టు 2: తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ తాజాగా అమల్లోకి వచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. కేరళలోని సున్నీ ముస్లిం మేధావులు, మత నాయకులతో కూడిన సంస్థా కేరళ జమాయిత్-ఉల్-ఉలేమా ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ వ్యతిరేకమైనదిగా ప్రకటించాలని తన పిటిషన్‌లో సుప్రీం కోర్టును కోరింది.

08/03/2019 - 00:21

కరీంనగర్, ఆగస్టు 2:ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. గత నెల 23న కరీంనగర్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు సీపీకి ఫిర్యాదు చేశారు.

08/03/2019 - 00:18

హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 2: లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో లెక్చరర్ దంపతులు మృతి చెందిన సంఘటన కరీం నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి శివారులో శుక్రవారం ఉదయం వరంగల్ - కరీంనగర్ స్టేట్ హైవేపై కారు లారీని ఢీకొన్న ప్రమాదంలో లెక్చరర్ దంపతులు దుర్మరణం పాలయ్యారు.

08/02/2019 - 23:53

హైదరాబాద్, ఆగస్టు 2: భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన న్యూ డెమోక్రసీ సభ్యుడు లింగన్న మృతదేహానికి వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. జూలై 31వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన లింగన్న మృతదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున నలుగు గంటలకు కొత్తగూడెం నుంచి నగరంలోని గాంధీ అసుపత్రికి తీసుకువచ్చారు.

08/02/2019 - 23:53

హైదరాబాద్ / శంషాబాద్, ఆగస్టు 2: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది. తమ బిడ్డలను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా, తల్లిదండ్రులు కిడ్నాపర్‌ను వెంబడించి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ముంబై నుంచి శ్రీనాథ్ కుంటుంబ సభ్యులు ఉదయం శంషాబాద్ చేరుకున్నారు.

08/02/2019 - 23:52

విజయవాడ (క్రైం), జూలై 2: రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎయిడ్స్ ఖైదీలకు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని 27 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకిందనే సమాచారంపై సీరియస్‌గా స్పందించిన హైకోర్టు ఇందుకు సంబంధించి శుక్రవారం విచారణ నిర్వహించింది. జైలుకు రాకముందే ఎయిడ్స్ ఉందా..

08/02/2019 - 23:47

విజయవాడ, ఆగస్టు 2: గత ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అమలైన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల్లో కోట్లాది రూపాయల మేర అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్టుగా ఒకదాని వెంట మరొకటిగా వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో విచారణకు జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూనే ముందుగా పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను తక్షణం నిలిపివేస్తోంది.

08/02/2019 - 22:47

తిరుపతి, ఆగస్టు 2: తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తూ మద్యం సేవించిన వారిని, వాహనం నడిపిన వారికి, లైసెన్సులు సక్రమంగా లేని వారికి తిరుమల క్యాంప్‌కోర్టు న్యాయమూర్తి కొరడా ఝుళిపించారు. తొమ్మిది మందికి ఒక్కొక్కరికి మూడు రోజులు చొప్పున జైలుశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. తిరుమల ట్రాఫిక్ డిఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

08/02/2019 - 22:44

సీలేరు, ఆగస్టు 2: అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఎప్పటిలాగానే స్థానిక పోస్ట్ఫాసు సెంటర్ వద్ద స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. దారకొండ నుంచి సీలేరు మీదుగా వస్తున్న వాహనాన్ని పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్ దూకి పారిపోయారు.

08/02/2019 - 21:18

న్యూఢిల్లీ, ఆగస్టు 2: రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసును వివాదాలను పరిష్కరించి, ఏకాభిప్రాయానికి వచ్చేందుకు ఏర్పడిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Pages