S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/10/2018 - 22:12

ఆత్మకూరు, అక్టోబర్ 10: ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన వైసీపీ నేత గూలి కేశవరెడ్డి (70) బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు. కొనప్రాణంతో ఉన్న కేశవరెడ్డిని హుటాహుటిన అనంతపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. బుధవారం ఉదయం స్కూటీపై తోట వద్దకు వెళుతున్న సమయంలో దారి మధ్యలో కాపుకాచి దుండగులు దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు.

10/10/2018 - 22:11

హిందూపురం రూరల్, అక్టోబర్ 10 : హిందూపురం రూరల్ మండల పరిధిలోని వీవర్స్ కాలనీకి చెందిన రాము (30) బుధవారం ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి నిలబడిన డిప్పర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ మండలం కిరికెర పంచాయతీ వీవర్స్ కాలనీకి చెందిన రాము ద్విచక్ర వాహనంలో హిందూపురం బైపాస్ రోడ్డులో వెళుతూ రోడ్డు పక్కన నిలబడిన టిప్పర్ కిందకు దూసుకెళ్లాడు.

10/10/2018 - 02:03

హైదరాబాద్, అక్టోబర్ 9: బ్యాంక్ వినియోగ దారులు ఇచ్చే చెక్‌లను అక్రమంగా ఆర్‌టీజీఎస్, ఎన్‌ఈఎఫ్‌టీ సౌకర్యంతో సొంత ఖాతాల్లోకి బదిలీ చేసుకున్న బ్యాంక్ సీనియర్ మేనేజర్ ఘరానా మోసం బయటపడింది. సంబంధిత బ్యాంక్ సీనియర్ మేనేజర్ సూర్యనారాయణ మూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో మోసం వెలుగులోకి వచ్చింది. మంగళవారం నార్త్‌జోన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ అరెస్ట్ విషయాన్ని సిటీ కమిషనర్ అంజనీకుమార్ మీడియాకు వివరించారు.

10/10/2018 - 00:13

పాతబస్తీ, అక్టోబర్ 9: విశ్రాంత ఉపాధ్యాయురాలు ఓ సైబర్ నేరస్తుడిని సాయం చేయమని కోరటంతో రూ. 40 వేలు కాజేశాడు. ఈ ఉదంతంపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భవానీపురం హౌసింగ్ బోర్డు ఓల్డ్ ఎంఐజీ కాలనీకి చెందిన నందివాడ రాగవాణి(50) గతంలో ప్రైవేట్ టీచర్‌గా పనిచేసి ఇంటి వద్ద ఉంటోంది.

10/10/2018 - 00:07

గాజువాక(విశాఖ), అక్టోబర్ 9: మూడేళ్ల చిన్నారిని హతమార్చిన సంఘటన విశాఖపట్నం జిల్లా తీవ్ర విషాదం నింపింది. విశాఖపట్నం జిల్లా, గాజువాక మండలం, దువ్వాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన మంగళవారం వెలుగు చూచింది. అదృశ్యం అయిన మూడేళ్ల చిన్నారి హత్య గురైందని తెలుసుకున్న పారిశ్రామిక ప్రాంతం కన్నీటి పర్యాంతం అయింది. దీనికి సంబంధించి దువ్వాడ పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి.

10/09/2018 - 23:37

వనపర్తి, అక్టోబర్ 9: వనపర్తి ఆలయాలతో పాటు వైన్స్‌లో చోరీ చెసిన నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో సాజరు పరిచినట్లు వనపర్తి డిఎస్పీ సృజన తెలిపారు. మంగళవారం వనపర్తి సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

10/09/2018 - 23:04

గండేపల్లి, అక్టోబర్ 9: గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కన అరుణకుమార్ హోటల్ వద్ద సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సినీ ఫక్కీలో జరిగిన భారీ చోరీ కలకలం రేపింది. ఈ ఘటనలో సుమారు కోటిన్నర విలువైన నాలుగున్నర కిలోల బంగారు ఆభరణాలను చోరులు అపహరించారు.

10/09/2018 - 22:44

గుంటూరు, అక్టోబర్ 9: ఎరువుల అక్రమ నిల్వలు, కాలంచెల్లిన పురుగుమందుల విక్రయాలు, నకిలీ బయో ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు విడివిడిగా మెరుపుదాడులు నిర్వహించారు. మంగళవారం గుంటూరు పట్నంబజారు, గోరంట్ల, మండల కేంద్రమైన ఈపూరులో దాడులు కొనసాగాయి.

10/09/2018 - 22:38

చర్ల, అక్టోబర్ 9: చర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం ఉదయం రజక వృత్తి చేసుకునే వృద్ధ దంపతులను అతి కిరాతంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల బస్టాండ్ సమీపంలో ఒక రేకుల షెడ్డులో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని రజక వృత్తితో బతుకు వెళ్లదీస్తున్న పున్నం చుక్కయ్య(70), అతని భార్య ఎల్లమ్మ(60)లు దారుణ హత్యకు గురయ్యారు.

10/09/2018 - 22:11

చిత్తూరు, అక్టోబర్ 9: మేనమామ, బావమరుదులను దారుణంగా హత్య చేసి మృతదేహాలను అటవీ ప్రాంతంలో పడేసిన వైనం చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో చోటుచేసుకొంది. ఈ జంట హత్యలు జిల్లాలో కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం హత్య చేసి మృతదేహాలను యాదమరి మండలం కోటాలం అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లగా మంగళవారం సాయంత్రం పశువుల కాపర్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Pages