S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/09/2018 - 22:07

కదిరి, అక్టోబర్ 9: కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ అమడగూరు మండలానికి చెందిన పీఆర్‌ఏ ఈ పుల్లయ్య మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రఘురామరాజు తెలిపిన వివరాల మేరకు.. అమడగూరు మండలం వెంకటనారాయణపల్లికి చెందిన సబ్ కాంట్రాక్టర్ లక్ష్మీపతి రూ. 10 లక్షలు సిమెంటు రోడ్డు పనులు చేశారు. ఈ పనులు బిల్లులు మంజూరు కోసం రూ.

10/09/2018 - 22:06

యాడికి, అక్టోబర్ 9 : మండల పరిధిలోని బోయరెడ్డిపల్లి సమీపంలో ఉన్న న్యూ పెన్నా సిమెంట్ కర్మాగారంలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజేష్ మోరియా (36) ద్విచక్రవాహనంలో వెళ్తూ మంగళవారం కల్వర్టును ఢీకొని గుంతలో పడి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

10/09/2018 - 22:02

మార్టూరు, అక్టోబర్ 9: మార్టూరు అక్రమ వ్యాపారాలకు అడ్డగా మారింది. మార్టూరులో నిత్యం అక్రమ వేబిల్లుల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయిల ఆదాయం కోల్పోతున్నా విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా నిత్యం కోటా బియ్యం మార్టూరు హద్దులు దాటిపోతున్న విషయం తెలిసిందే.

10/09/2018 - 21:57

పలాస, అక్టోబర్ 9: కాశీబుగ్గ ఎల్‌సీగేటు సమీపంలో రాళ్లు, తుప్పల మధ్య అంబుసోలికి చెందిన ఎం. ఆనంద్(43) అనుమానస్పదరీతిలో మృతి చెందడం కలకలం రేపింది. కాశీబుగ్గ పోలీసుల కథనం మేరకు ఆనంద్ స్థానిక హోటల్‌లో పనిచేసేవాడని, అతి మద్యం సేవించేవాడని, సోమవారం రాత్రి విధులను ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునన్నారు.

10/09/2018 - 02:20

కాకినాడ సిటీ, అక్టోబర్ 8: మావోయిస్టు దళానికి చెందిన కీలక నేతను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. మావోయిస్టు దళం హిడుమ బెటాలియన్ మొదటి ప్లాటూన్‌కు సెక్షన్ కమాండర్‌గా పనిచేస్తున్న పొడియం ముడ అలియాస్ మల్లేష్ (32)ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కలిసి అరెస్టుచేశారు.

10/09/2018 - 02:18

హైదరాబాద్, అక్టోబర్ 8: సీబీఐ మాజీ డైరెక్టర్ కే విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్‌రావు నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ అధికారులు శ్రీనివాస్ బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా దాడులు చేసినట్టు సమాచారం.

10/09/2018 - 01:58

దంతాలపల్లి, అక్టోబర్ 8: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల పరిధిలోని రేపోని గ్రామంలో అనంతుల అంబరీష (35) భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. సోమవారం జరిగిన ఈ సంఘటన వివరాలు గ్రామస్థుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని రేపోని గ్రామానికి చెందిన అనంతుల అంబరీష, భార్య అనితలకు ఒక ఆడబిడ్డ జన్మించింది.

10/09/2018 - 01:51

గుంటూరు, అక్టోబర్ 8: మానవ సంబంధాలు రాను రానూ మృగ్యమవుతున్నాయి. స్వార్థంతో సొంత అవసరాల కోసం కన్నకూతురికే ప్రాణాంతక వ్యాధి సోకిన రక్తాన్ని ఎక్కించాడో కర్కశుడైన తండ్రి. తన అవసరాలకు అల్లుడు డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో పగ పెంచుకుని కన్నకూతురికే ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించి, తన వద్ద మాంత్రిక శక్తులు ఉన్నాయని వాటితో తగ్గిస్తానని చెప్పి అల్లుడి వద్ద రూ.

10/09/2018 - 01:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికల వేళ నకిలీ ఓటర్ల జాబితా వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, సచిన్‌పైలెట్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో పెద్దసంఖ్యలో నకిలీ ఓటర్లను జాబితాల్లో చేర్చారని పిటిషనర్లు వాదించారు.

10/09/2018 - 01:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాల్సిదేనని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పుపై సోమవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది. సుప్రీం తీర్పు భక్తుల మనోభావాలను, ఆలయ ఆచార వ్యవహారాలను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్‌దారు, జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం అధ్యక్షుడు శైలజా విజయన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Pages