S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/06/2018 - 00:33

నార్సింగి, అక్టోబర్ 5: డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా, పోలీసులను చూసి నైజీరియన్ పైపుద్వారా కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తుకిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసీప్‌నగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి కథనం ప్రకారం...

10/06/2018 - 00:31

హయత్‌నగర్, అక్టోబర్ 5: రోజంతా పాఠశాలలో తోటి విద్యార్థులతో సందడిగా ఉన్న బాలుడిని అదే పాఠశాలకు చెందిన బస్సు మృత్యుశకటంలా చిదిమేసింది. స్నేహితులకు బాయ్ చెబుతూ బస్సు దిగిన బాలుఒఒడు వెనుక చక్రాల కిందపడి నిలిగిపోయాడు.

10/06/2018 - 00:22

సిరిసిల్ల, అక్టోబర్ 5: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు జనశక్తి నక్సలైట్లు పట్టుబడ్డారు. ఎన్నికల వేళ వీరు పోలీసులకు ఆయుధాలతో పట్టుబడడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతకాలంగా నక్సలైట్ల ఉనికి కనుమరుగైన నేపథ్యంతో తాజాగా ఇక్కడ గతంలో తీవ్ర ప్రాబల్యం కొనసాగించిన జనశక్తి మూ లాలు మళ్లీ కనిపించడంతో పోలీసులు వీరి కదలికలపై అప్రత్తమయ్యారు.

10/05/2018 - 23:40

గోకవరం, అక్టోబర్ 5: గత కొంతకాలంగా నెలకొన్న భూ తగదాలు ఒక్కసారిగా పడగవిప్పడంతో ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈసంఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా రక్తపాతమైంది. క్షతగాత్రులు ఆసుపత్రి పాలయ్యారు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలావున్నాయి.

10/05/2018 - 23:38

రంగంపేట, అక్టోబర్ 5: రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామానికి చెందిన వెలమర్తి సత్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ రాజానగరం జీఎస్‌ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వైన్‌ప్లూ సోకడంతో ఆమె మృతి చెందినట్టుగా జీఎస్‌ఎల్ వైద్యాధికారులు తెలిపారు. అయితే ఆమె స్వైన్‌ప్లూతో మరణించలేదని, వైరల్ హెమరైజ్డ్ ఫీవర్‌తో మరణించినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టిఎస్ మూర్తి తెలిపారు.

10/05/2018 - 23:17

వేటపాలం, అక్టోబర్ 5: అనుమానం పెనుభూతమై పచ్చి బాలింత అయిన భార్యను కడతేర్చిన కసాయి ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దేశాయిపేట పంచాయతీ నీలకంఠాపురానికి చెందిన అవ్వారు లీలారావు, పద్మావతి దంపతుల మూడో కుమార్తె భానుమతి (21)ని గత యేడాది అక్టోబర్ 1న ఈపూరుపాలెంకు చెందిన సాదు సాంబశివరావుతో వివాహాం చేశారు.

10/05/2018 - 23:15

చిల్లకూరు, అక్టోబర్ 5: మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ నాంచారమ్మపేటకు చెందిన కలగుంట మణి, వెంకటరమణయ్యకు చెందిన ఇళ్లలో గ్యాస్ సిలిండర్ పేలడంతో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. శుక్రవారం ఉదయం వెంకటరమణయ్య ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా హఠాత్తుగా గ్యాస్ రెగ్యులేటర్ నుంచి మంటలు వ్యాపించడంతో రెండు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

10/05/2018 - 23:05

పొన్నూరు, అక్టోబర్ 5: అగ్నిప్రమాదాలు జరగకుండా ఆసుపత్రులలో సైతం అన్ని రకాల జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని పొన్నూరు ఫైర్ అధికారి విహెచ్ సాంబయ్య ఆసుపత్రి నిర్వాహకులు, సిబ్బందికి సూచించారు. పొన్నూరులోని డాక్టర్ రవీంద్ర ఆసుపత్రిలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఫైర్ ఆఫీసర్ ఆసుపత్రిలో మంటలను ఆర్పే పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, నీటి వనరులు కూడా ఉండటం శ్రేయస్కరమన్నారు.

10/05/2018 - 22:58

* తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ప్రచార కార్యక్రమాలు
* రంగంలోకి టాస్క్ఫోర్స్
* 80 వేల తమిళ స్మగర్ల గుర్తింపు
* టాస్క్ఫోర్స్ ఏసీఎఫ్‌లు
--------------------------------------------------------------------------

10/05/2018 - 22:53

తిరుపతి, అక్టోబర్ 5: కరకంబాడి సమీపంలో ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఉన్న ఎల్‌ఐసీ ట్రైనింగ్ సెంటర్ వెనుక శుక్రవారం ఉదయం టాస్క్ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ విజయనరసింహులు బృందం కూంబింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ స్మగ్లర్‌ను పట్టుకున్నట్లు విజయనరసింహులు తెలిపారు. ఉదయం 6 గంటలకు కొందరు స్మగ్లర్లు అడవిలో సంచరిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ బృందం గుర్తించింది.

Pages