S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/07/2018 - 22:46

సిద్దవటం, జూన్ 7: సిద్దవటం రేంజ్ పరిధిలోని రోళ్లగోడు బీటులో బుధవారం సాయంత్రం ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళకూలీలను అరెస్టుచేసి, వారి వద్దనుంచి 15ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు ట్రైనీ ఐఎఫ్‌ఎస్ నరేంద్ర తెలిపారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఎర్రచందనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

06/07/2018 - 22:28

ముదిగుబ్బ, జూన్ 7: మండల పరిధిలోని యస్.బ్రాహ్మణపల్లిలో బుధవారం సాయంత్రం అశ్వని (24) అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త నాగేంద్ర, అత్తమామలు వేరుశెనగ విత్తన కాయలకు వెళ్లగా అశ్వని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వ్యవసాయ పనులు ముగించుకొని వచ్చిన భర్త నాగేంద్ర చూడగా అప్పటికే అశ్వని మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు.

06/07/2018 - 22:27

గుత్తి, జూన్ 7 : గుత్తి మండల పరిధిలోని కొత్తపేట, జక్కల చెరువు గ్రామాల సమీపంలో గురువారం జరిగిన ప్రమాదాల్లో వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరు గ్రామానికి చెందిన రాము గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వివాహం చేసుకున్నాడు.

06/07/2018 - 05:22

సికిందరాబాద్, జూన్ 6: కుటుంబ తగాదాల కారణంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతవరకైనా వెళ్లడానికి సిద్థపడుతున్నారు. నేరం నిరూపించబడి కటకటాల పాలై విలువైన జీవితాన్ని జైలుపాలు చేసుకుని నేరచరితులుగా సమాజంలో మిగిలిపోతున్నారు. ఇందుకు ఉదాహరణ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన గోపాలపురం ఏసీపీ శ్రీనివాస్ కథనం ప్రకారం..

06/06/2018 - 03:20

పెద్దపల్లి రూరల్, జూన్ 5: మండలంలోని రంగాపూర్ గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసు బృందం మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు చేపట్టింది. రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ విజయసారధి ఆదేశాల మేరకు సీఐ సారిలాల్ ఆధ్వర్యంలో బసంత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ఎంచర్ల లింగయ్య ఇంట్లో సోదాలు చేయగా, 2 లక్షల రూపాయల పైచీలుకు విలువజేసే నిషేధిత అంబార్, గుట్కా ప్యాకెట్లు లభించాయి.

06/06/2018 - 02:59

గనే్నరువరం, జూన్ 5: మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ఐదు రోజులుగా స్వప్న మృతదేహంతో స్వప్న తల్లిదండ్రులు, బంధువులు అత్తవారింటి ఎదుట ఆందోళన చేశారు. కాగా, మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. నిందితులు దొరకకపోవడంతో గ్రామస్థులు స్వప్న పిల్లలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సోమవారం స్వప్న అంత్యక్రియలు నిర్వహించారు.

06/06/2018 - 02:20

జీడిమెట్ల, జూన్ 5: ఆశీర్వాద్ గోధుమ పిండి పేరుతో నకిలీ పిండి తయారీ కేంద్రంపై బాలానగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. కాప్రా, ఊర్లశంకరమ్మ కాలనీకి చెందిన నారాయణరెడ్డి కుమారుడు తాతిరెడ్డి ఇంద్రారెడ్డి (50), సైనిక్‌పురికి చెందిన ఆంజనేయులు (50)లు కలిసి దేవరయాంజాల్ గ్రామంలో ఎస్‌వీఆర్ ఎస్టేట్‌లో ఓ గోడౌన్‌ను నిర్వహిస్తున్నారు.

06/06/2018 - 01:34

చల్లపల్లి, జూన్ 5: స్ర్తినిధి నిధుల దుర్వినియోగం కేసులో నిందితురాలు కొల్లి అరుణను ఎట్టకేలకు మంగళవారం అరెస్టు చేశారు. మహిళ సాధికారిత ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్ర్తి నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఏర్పాటు చేయగా తొలి నాళ్లలోనే చల్లపల్లి మండల స్ర్తి నిధిలో మోసానికి తెరతీశారు.

06/06/2018 - 01:00

మధిర, జూన్ 5: మద్యానికి బానిసైన తండ్రి కుమారుడు దాచుకున్న డబ్బును మద్యం సేవించేందుకు తీసుకొని వెళ్ళగ కుమారుడు వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడగగా అతనిని రోడ్డుపై తండ్రి కొట్టడంతో మనస్తాపానికి గురై కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం మధిర మున్సిపాల్టీ పరిధిలోని మడుపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

06/06/2018 - 00:49

దుగ్గిరాల, జూన్ 5: ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న సోదరుడిని పరామర్శించేందుకు వచ్చి ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో బుడంపుట్ల మల్లేశ్వరి అనే మహిళ మృతిచెందింది. మండల కేంద్రమైన దుగ్గిరాల చెన్నకేశవ నగర్‌లో ఉంటున్న అవధానం లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో చూసేందుకు తెనాలి ఇస్లాంపేటకు చెందిన అతని సోదరి బుడంపుట్ల మల్లేశ్వరి (55) మంగళవారం మన మనవడైన సాయిని వెంట పెట్టుకుని వచ్చింది.

Pages