S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

06/09/2018 - 00:13

పెదకాకాని, జూన్ 8: మండల పరిధిలోని పెదకాకాని వై జంక్షన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కృష్ణాజిల్లా తాడిగడపకు చెందిన కుమార్, సునీత దంపతులు తమ పిల్లలతో మామ బలరాం, డ్రైవర్ వరప్రసాద్ కారుతో తిరుపతి నుండి తిరిగి వస్తుండగా వై జంక్షన్ సమీపంలో ఉదయం ఎదురుగా ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టింది.

06/09/2018 - 00:08

కాకినాడ (సర్పవరం జంక్షన్), జూన్ 8: కాకినాడ రూరల్ మండలం వాకలపూడి సూర్యామహల్ థియేటర్ సమీపంలో శుక్రవారం భార్యాభర్తలు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో అచ్చంపేట జంక్షన్‌కు చెందిన గుత్తుల వరలక్ష్మి (35) అక్కడికక్కడే మృతి చెందగా భర్త రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఇరువురూ సాయంత్రం సమయంలో టివిఎస్ మోపెడ్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

06/08/2018 - 23:59

చిత్తూరు, జూన్ 8: ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్ డ్యామ్‌లో పడి అక్కా చెల్లెళ్లు మృతి చెందిన సంఘటన యాదమరి మండలం బొమ్మన చెరువు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.

06/08/2018 - 23:58

పీలేరు, జూన్ 8: పీలేరు-తిరుపతి మార్గంలో శుక్రవారం సాయంత్రం లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. సీఐ వేణుగోపాల్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఓడిరెడ్డి (50), జానకమ్మ (45), మనవరాలు చేతన రెడ్డి (5)తో కలిసి చిన్నగొట్టిగల్లు నుంచి పీలేరుకు వస్తుండగా రవాణాశాఖ కార్యాలయం సమీంలో పీలేరు నుంచి తిరుపతి వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

06/08/2018 - 23:55

పెనుమంట్ర, జూన్ 8: పెనుమంట్ర మండలం భట్లమగుటూరు గ్రామంలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మృతులిద్దరూ తాపీ మేస్ర్తీలు. వివరాలిలావున్నాయి... గ్రామంలో గంటి భద్రాచలం అనే వ్యక్తి భవన నిర్మాణం చేపట్టారు. మండలంలోని బ్రాహ్మణ చెరువు గ్రామానికి చెందిన గుడ్ల సూర్యనారాయణ (33) ఈ నిర్మాణ పనులకు కొద్ది నెలలుగా తాపీ మేస్ర్తీగా వ్యవహరిస్తున్నారు.

06/08/2018 - 22:19

అనంతపురం అర్బన్, జూన్ 8: జిల్లాలో నకిలీ సరుకులు, కల్తీపాలు, నకిలీ వస్తువులు ప్రజలను వణికిస్తున్నాయి. కల్తీని అరికట్టేందుకు అరకొరగా విజిలెన్స్‌తో పాటు సంబంధిత శాఖలు తనిఖీలు చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. శుక్రవారం తాడిపత్రి, బుక్కరాయసముద్రం, అనంతపురంలో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీ చేసే ముఠాను విజిలెన్స్ ఎస్పీ రామాంజినేయులు పట్టుకొన్నారు.

06/08/2018 - 00:56

ఉప్పల్, జూన్ 7: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నాగోల్ బండ్లగూడ తట్టి అన్నారంలో నివసిస్తున్న బసవన్నగారి యతీష్(22) విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతిని ప్రేమించాడు.

06/08/2018 - 00:50

కేపీహెచ్‌బీకాలనీ, జూన్ 7:గొలు సు దొంగతనాలకు పాల్పడుతున్న పా త నేరస్తులను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టే చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాదాపూర్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలను వెల్లడించారు.

06/08/2018 - 00:46

సుల్తానాబాద్, జూన్ 7: సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ పైకప్పు నుండి పెద్దపెద్ద పెచ్చులు, ఫ్యాన్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో పలు పనుల నిమిత్తం బ్యాంక్‌కు వచ్చిన ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బ్యాంకులో ఒక్కసారిగా పైకప్పు నుండి పెచ్చులు, ఫ్యాన్ కిందపడడంతో అక్కడే ఉన్న పలువురు ఏం జరిగిందోనన్న భయంతో ఉలిక్కిపడ్డారు.

06/08/2018 - 00:44

ముకరంపుర కరీంనగర్, జూన్ 7: నిరుద్యోగులను మాయ మాటలతో మోసగిస్తున్న పెద్దపల్లి జిల్లాకు చెందిన బండి హన్మంత రావును గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్, రెండు లక్షల 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..హన్మంత రావు డిగ్రీ చదివే రోజుల్లోనే తన స్నేహితులను మోసగిస్తూ గడిపేవాడు.

Pages