S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/06/2016 - 02:27

విశాఖపట్నం, నవంబర్ 5: విశాఖలో బీచ్ లవ్ ఫెస్టివల్ మంట పుట్టిస్తోంది. సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన విశాఖలో అశ్లీలతతో కూడిన బీచ్ లవ్ ఫెస్టివల్‌ను నిర్వహించడాన్ని వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు నిరసిస్తున్నాయి. అయితే, బీచ్ లవ్ ఫెస్టివల్ కేవలం ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెపుతున్నారు.

11/06/2016 - 02:24

హైదరాబాద్, నవంబర్ 5: హైదరాబాద్ నగరంలో ఇద్దరు కవల ఆడపిల్లలపై పొరుగున ఉన్న ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడి అత్యాచారాలకు పాల్పడిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బాలబాలికలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లను ఆదేశించింది.

11/06/2016 - 02:23

హైదరాబాద్/ మషీరాబాద్, నవంబర్ 5: హరహర మహాదేవ.. ఓం నమఃశివాయ.. సాయిసదాశివ.. శివన్నామ స్మరణలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు మార్మోగాయి. కార్తీకమాసం సందర్భంగా భక్తి టీవి ఆధ్వర్యంలో కోటి దీపోత్సవ మహోత్సవం శనివారం రాత్రి ఎన్టీఆర్ స్టేడియంలో భక్తిప్రపత్తుల మధ్య ప్రారంభమయింది. ఈ నెల 21 వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం కొనసాగనుంది.

11/06/2016 - 02:14

విశాఖపట్నం (మధురవాడ), నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో పశు సంవర్ధక శాఖలో వైద్యుడిగా పనిచేస్తున్న గిరడా కాంతి కిరణ్ ఇంట్లో ఎసిబి అధికారులు శనివారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఎసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఏకకాలంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, హైదారాబాద్ జిల్లాల్లోని 11 చోట్ల దాడులు నిర్వహించారు.

11/06/2016 - 02:11

విజయవాడ, నవంబర్ 5: ప్రస్తుత కాలంలో తమలో అంతర్లీనంగా దాగివున్న ప్రతిభకు పదును పెట్టడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత సహసర్ కార్యవాహ్ ఆర్.బాగయ్య అన్నారు. గుంటూరు జిల్లా నూతక్కిలో సేవాభారతి ఆధ్వర్యంలో 12 కంప్యూటర్లతో ఏర్పాటైన ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.

11/06/2016 - 02:06

హైదరాబాద్, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లోనూ 2016-17 విద్యాసంవత్సరం నుండి పదోతరగతి విద్యార్థులకు తుది పరీక్షలు ఒక్కో పేపర్ 80 మార్కులకు మాత్రమే నిర్వహించనున్నారు. మిగిలిన 20 మార్కులను సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులే కేటాయిస్తారు. ఆరు సబ్జెక్టుల్లో మొత్తం 11 పేపర్లు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2.30 గంటలు కాగా, ప్రశ్నాపత్రం చదువుకోవడానికి మరో 15 నిమిషాలు అదనంగా కేటాయించనున్నారు.

11/06/2016 - 02:05

హైదరాబాద్, నవంబర్ 5: కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో ముఖ్యమైందని, చట్టబద్దత లేకపోయినా, ఇది చాలా కీలకంగా మారిందని హైకోర్టు న్యాయమూర్తి ఎ.రామలింగేశ్వరరావు అన్నారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార అంతర్జాతీయ కేంద్రం (ఐసిఎడిఆర్), తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై న్యాయాధికారులకు నిర్వహిస్తున్న అవగాహన తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు.

11/05/2016 - 08:23

హైదరాబాద్, నవంబర్ 4: ‘‘మీకేం రోగం... చేతులు చాచకుండా పనిచేయలేరా? ప్రభుత్వం మీకు జీతాలు ఇస్తోంది కదా? అయినా చేతులు చాస్తున్నారు, ఇకపై ఇలాంటివి సహించేది లేదు’’ అని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులపై మండిపడ్డారు. సివి ఆనంద్ పౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అవినీతిని నిర్మూలించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు.

11/05/2016 - 08:22

హైదరాబాద్, నవంబర్ 4: మహానేత సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ప్రధాని కావల్సిందని, కాని ఈ విషయంలో మహాత్మాగాంధీ పాత్ర ప్రశ్నార్థకమని కేంద్ర కమ్యూనికేషన్లు, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. పటేల్ లేకుంటే భారతదేశ స్థితిని మనం ఊహించలేమని చెప్పారు.

11/05/2016 - 08:20

హైదరాబాద్, నవంబర్ 4: సంస్థానాల విలీనంలో సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ చేసిన కృషి అమోఘమని కేంద్ర న్యాయ, ఐటి శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా బిజెపి నేతలతో కలిసి రవిశంకర్ సచివాలయం సమీపంలోని సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ స్మారక స్థూపానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

Pages