S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

10/09/2016 - 03:42

రాజమహేంద్రవరం, అక్టోబర్ 8: పోలవరం ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామంలో చేపట్టిన పవర్ ప్రాజెక్టు నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పోలవరం విద్యుత్ కేంద్రం పనులు పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తే నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తవుతాయి. లేదంటే మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది.

10/09/2016 - 03:22

హైదరాబాద్, అక్టోబర్ 8: నైరుతీ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో ఉద్ధృతంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.

10/09/2016 - 03:17

హైదరాబాద్, అక్టోబర్ 8: ఒక వ్యక్తి మద్యం సేవించి భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో జిల్లా సెషన్స్ కోర్టు విధించిన జీవిత ఖైదును పదేళ్ల కఠిన జైలుశిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎం సీతారామమూర్తితో కూడిన హైకోర్టు ధర్మాసనం వెలువరించింది.

10/09/2016 - 04:28

హైదరాబాద్, అక్టోబర్ 8: తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి సలహాలు, సూచనలు తమకు అవసరం లేదని ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని సుధాకర్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. పోలవరం ముంపు గురించి రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

10/09/2016 - 04:18

హైదరాబాద్/బేగంపేట, అక్టోబర్ 8: మూఢ నమ్మకం ఓ బాలిక ప్రాణం తీసింది.. 64 రోజుల ఉపవాస దీక్షతో పదమూడేళ్ల ఓ బాలిక శనివారం మృతి చెందింది. దీనిపై బాలల హక్కుల సంఘం స్పందిస్తూ బాలిక మృతిపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్‌కు ఓ లేఖ రాయగా నార్త్‌జోన్ డిసిపి విచారణ చేపట్టారు.

10/09/2016 - 04:19

విశాఖపట్నం, అక్టోబర్ 8: వచ్చే ఏడాది తొలి అర్ధ్భాగంలో జియో సింక్రనస్ శాటిలైట్లే లక్ష్యంగా కొత్త లాంచింగ్ వెహికల్ (ఎల్‌విఎంకె3) సిద్ధం కానుంది. పరీక్షల దశ దాటి ప్రయోగాత్మకంగా పరీక్షించే దశకు ఇందుకు సంబంధించిన ఎల్‌విఎంకె3 సిద్ధమైందని ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్ బివివిఎస్‌ఎన్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ వి.రంగనాథన్ తెలిపారు.

10/09/2016 - 03:13

భద్రాచలం, అక్టోబర్ 8: భద్రాచలం జిల్లా కోసం, వాజేడు, వెంకటాపురం మండలాలను తిరిగి భద్రాచలం నియోజకవర్గంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ కొమరం ఫణీశ్వరమ్మ నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షలను పోలీసులు శనివారం తెల్లవారుఝామున భగ్నం చేశారు.

10/09/2016 - 03:58

తిరుమల, అక్టోబర్ 8: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల నడుమ శ్రీనివాసుడు శ్రీరాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.

10/09/2016 - 02:51

హైదరాబాద్/ గచ్చిబౌలి, అక్టోబర్ 8: గ్యాంగ్‌స్టర్ నరుూం పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న నకిలీ నక్సలైట్లను స్పెషల్ ఆపరేషన్ టీమ్, జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నరుూం ఎన్‌కౌంటర్ తరువాత నగరశివారులో బెదిరింపులకు పాల్పడుతున్న బొల్లా నర్సింహ, పల్లెల సురేందర్, రాచకొండ శ్రీరాములు, అక్కరం కృష్ణ, సమ్మయ్యలను రాచకొండ ఎస్‌వోటి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.

10/09/2016 - 02:49

హైదరాబాద్, అక్టోబర్ 8: కృష్ణా జలాల పంపిణీని తిరిగి నాలుగు రాష్ట్రాలకు చేయాలా, లేక ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయాలా? అనే అంశంపై జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఈ నెల 19వ తేదీన కీలకమైన తీర్పు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ కార్యాలయం రెండు రాష్ట్రాలకు తెలియచేసింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

Pages