S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

09/11/2016 - 15:43

హైదరాబాద్: సీఎంగా కేసీఆర్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, ఆయనకు ‘ఉత్తమ అబద్దాలకోరు అవార్డు’ ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం అనవసరం లేకున్నా ప్రాజెక్టుల విలువలు పెంచుతోందని మరి నిర్వాసితులకు పరిహారం ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ వల్ల ఖజానాపై 50 వేల కోట్ల భారం పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌‌కుమార్ విమర్శించారు.

09/11/2016 - 15:16

హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరో 24 గంటల్లో కోస్తాంధ్ర సమీపంలో అల్పపీడనంగా మారే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం ప్రకటించారు. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

09/11/2016 - 15:14

హైదరాబాద్‌: అల్పపీడనం కారణంగా శనివారం నుంచే తెలంగాణ రాష్టంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా, సోమ, మంగళ, బుధ వారాల్లో తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం సంచాలకుడు తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారుతోందని, దాని ప్రభావం సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని పేర్కొన్నారు.

09/11/2016 - 15:00

హైదరాబాద్‌: తెలంగాణలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ఎంసెట్‌-3 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లోన్ని 91 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఎంసెట్‌-3 ప్రాథమిక కీని సాయంత్రం విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

09/11/2016 - 14:58

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిజాంను పొగుడుతుంటే, ఆయన కుమార్తె కవిత చాకలి ఐలమ్మను కీర్తిస్తూ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి మగ్దూం విగ్రహం వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్రలో ఆయన పాల్గొన్నారు.

09/11/2016 - 05:39

నల్లగొండ, సెప్టెంబర్ 10: నల్లగొం డ జిల్లా పరిధిలోని యాదాద్రి దేవస్థానాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం చేపట్టిన పనులు వేగవంతమయ్యాయి. భారీ యంత్రాలతో కూ ల్చివేతలతో పనులు శరవేగంగా సా గు తున్నాయ. యాదాద్రి ఆలయా న్ని తెలంగాణ తిరుపతిగా రూపుదిద్దుతామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే పదిసార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులనుపై నిరంతర దృష్టి పెట్టారు.

09/11/2016 - 05:37

కరీంనగర్, సెప్టెంబర్ 10: జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదాపై జిల్లాలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా సాధన కోసం కొనసాగిస్తున్న ఆందోళనలో భాగంగా శనివారం జెఎసి నేతృత్వంలో అఖిలపక్షం నాయకులు చెవిలో పువ్వులను పెట్టుకుని అంబేద్కర్ విగ్రహం ఎదుట వౌనదీక్ష చేపట్టి నిరసన కొనసాగించారు.

09/11/2016 - 05:36

కొత్తకోట, సెప్టెంబర్10: వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు.

09/11/2016 - 05:30

కోరుట్ల, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సిపి నేత కట్ట శివను శుక్రవారం ఆరెస్టు చేసి శనివారం మెట్‌పల్లి కోర్టు లో హాజరుపర్చారు. వ్యా పారవేత్త కోరుట్లకు చెంది న బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ కుమారుడు ఎంఎ ఖరుూ్యంను హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌స్టర్ నరుూం ముఠా సభ్యులు బెదిరించి డబ్బులు వసూలు చేశారు.

09/11/2016 - 05:28

పెద్దపల్లి, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా జైలు నుండి పార్థీ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు ఖైదీలు శుక్రవారం అర్ధరాత్రి తప్పించుకోగా, వారిని కొన్ని గంటల్లోనే పెద్దపల్లి పోలీసులు పట్టుకున్నారు.

Pages